No Live Matches Found
1
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172115/i.jpg?p=thumb&d=high)
India
7020 / 58
odi
2
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172117/i.jpg?p=thumb&d=high)
Australia
5309 / 45
odi
3
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172126/i.jpg?p=thumb&d=high)
South Africa
4062 / 37
odi
4
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172116/i.jpg?p=thumb&d=high)
Pakistan
3922 / 36
odi
5
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172128/i.jpg?p=thumb&d=high)
New Zealand
4708 / 46
odi
6
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172123/i.jpg?p=thumb&d=high)
England
3934 / 41
odi
7
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172119/i.jpg?p=thumb&d=high)
Sri Lanka
4947 / 55
odi
8
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172120/i.jpg?p=thumb&d=high)
Bangladesh
4417 / 50
odi
9
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172188/i.jpg?p=thumb&d=high)
Afghanistan
2845 / 35
odi
10
![switch](http://api.cricbuzz.com/a/img/v1/i1/c172124/i.jpg?p=thumb&d=high)
West Indies
3109 / 44
odi
-
బిగ్‌బాస్: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్
బిగ్‌బాస్ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్‌బాస్ విడగొట్టాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్‌కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్‌లు ఆడించాడు. మీకు సూటబుల్ అనిపించే పాటలను డెడికేట్ చేసుకోమని నాగ్ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్ సాంగ్‌తో, శ్రీముఖి.. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్.. జులాయి టైటిల్ సాంగ్, వరుణ్.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్‌గా శివజ్యోతి డాన్స్ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్, అలీ రెజాలకు బాక్సింగ్ గ్లౌజ్‌లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్ చేస్తుండగా మిగతా హౌస్మేట్స్ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్ ఆసక్తికర టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్‌బాస్ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను రాహుల్‌పై వేసింది. -
బిగ్‌బాస్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!
బిగ్‌బాస్ ఇంట్లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వరుణ్, వితిక, శివజ్యోతిల గొడవ దెబ్బతో అందరూ నామినేషన్లోకి వచ్చారు. దీంతో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది తేలనుంది. ఇక ఇంటి సభ్యుల కష్టానికి ఏమాత్రం తీసిపోకుండా వారి అభిమానులు కూడా తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే బిగ్‌బాస్ ఈ వారం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. మొదట నామినేషన్ ప్రక్రియతో అందరినీ డేంజర్ జోన్లోకి పంపించి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించి ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో అదిరిపోయే ట్విస్టు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇప్పటికే వైల్డ్‌కార్డ్ కార్డ్ ఎంట్రీలు అయిపోయాయి. మిగిలిందల్లా డబుల్ ఎలిమినేషన్! తాజా ప్రోమో ప్రకారం నాగ్ చెప్పినట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా..! ఉంటే కనక హౌస్ నుంచి వితికతో పాటు శివజ్యోతి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపేమో.. ఎలిమినేట్ అయింది వితిక మాత్రమే అంటూ లీకువీరులు దరువేసి మరీ చెప్తున్నారు. మరి ఈ వారం వితిక వెళ్లిపోతే వరుణ్ ఏమవుతాడో చూడాలి! భార్యను వెయ్యి ఏనుగుల బలంగా భావించే వరుణ్ తను వెళ్లిపోతే కుప్పకూలిపోతాడా.. రెట్టింపు కష్టపడుతూ టైటిల్ దక్కించుకోడానికి ప్రయత్నిస్తాడా అనేది చూడాలి! Sunday ochesindi so its Funday time!!! kani last lo twist emana untunda ??#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/JYLUSDDvFJ — STAR MAA (@StarMaa) October 20, 2019 -
బిగ్‌బాస్: వితికా ఎలిమినేట్.. ఇది ఫిక్స్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ -3 తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్ పోరు వైపు దుసుకెళ్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియకు భిన్నంగా ఈ వారం జరిగింది. పదమూడో వారానికి గాను జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. హౌస్‌లో ఉన్న ఏడుగురు నామినేట్ అవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరగబోతోందో ముందే చెబుతున్న లీకువీరులు తాజాగా ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతున్నారో ముందే చేప్పేశారు. పదమూడో వారానికి గాను వితికా షేరు ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వితికా బిగ్‌బాస్ హౌస్‌ను వీడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భార్యభర్తలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన వితికా-వరుణ్‌లు విడిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక వితికా లేని వరుణ్ గేమ్ ఇంకా బాగా ఆడతాడా లేక చతికిలపడతడా అనేదానిపై తెగ చర్చ జరుగుతోంది. ఆమె ఎలిమినేట్ కావడానికి గల అనేక కారణాలను కూడా నెటిజన్లు పేర్కొంటున్నారు. మెడాలియన్ టాస్క్ గెలవడానికి బాబా భాస్కర్‌తో ప్రవర్తించిన తీరు.. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శివజ్యోతితో వరుణ్-వితికల వాగ్వాదం ఆమె ఎలిమినేషన్‌కు కారణాలుగా పేర్కొంటున్నారు. పునర్నవి భూపాలం ఎలిమినేషన్ తర్వాత రాహుల్ కూడా వరుణ్-వితికాలతో అంత సఖ్యంగా ఉండటం లేదు. దీంతో వితికాకు ఓటింగ్ శాతం తగ్గింది. అంతేకాకుండా ఉన్న ఏడుగురు ఇంటిసభ్యుల్లో వీక్ కంటెస్టెంట్ వితికా కావడంతోనే ఆమెకు ఓట్లు తక్కువ వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుణ్, రాహుల్, పునర్నవిల సహాయంతోనే ఇన్ని రోజులు నామినేషన్ కాకుండా సేఫ్ అయిందని లేకుంటే వితికా ఎప్పుడో హౌస్‌ను వీడేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక వితికా ఎలిమినేషన్ విషయం అధికారికంగా తెలియాలంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ వరుకు వేచిచూడాల్సిందే. -
బిగ్‌బాస్: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్ అవుతుందా?
తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. పదమూడో వారానికి గానూ ఏడుగురు నామినేట్ అవగా ఎవరో ఒకరు లగేజీ సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక పొరపాటున కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్లు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నమోదైన పోల్స్ ప్రకారం వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే నేటితో ఓట్లు వేయడానికి ఆఖరి రోజు కావటంతో లెక్కలు మారే అవకాశం ఉంది. లీకువీరుల అంచనా ప్రకారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది వితికేనంటూ పేర్కొంటున్నారు. తను టాస్క్‌లు బాగా ఆడినప్పటికీ అతి తెలివి, స్వార్థబుద్ధితో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అని అభిప్రాయపడుతున్నారు. పైగా తను ఇంట్లో ఉండటం వల్ల వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. వితిక ఒక అవకాశవాది అని వెనకాల గోతులు తీయడంలో దిట్ట అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మెడాలియన్ టాస్క్‌లో బాబాకు వెన్నుపోటు పొడవటం కూడా ఆమెకు నెగిటివిటీగా మారింది. బిగ్‌బాస్ షో ప్రారంభంలో తప్పితే ఆ తర్వాత నామినేషన్ దరిదాపుల్లోకి రాకుండా వితిక, శివజ్యోతి తప్పించుకు తిరిగారని.. ఈ సారి వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ప్రేక్షకులు. పైగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరినీ పంపించేస్తామని పేర్కొంటున్నారు. శివజ్యోతి కన్నింగ్ బిహేవియర్ అని, ఆమె ఏడుపు మొఖాన్ని చూడలేకున్నామని ఆమెను పంపించేయాలని మరికొంతమంది కోరుతున్నారు. ఎటొచ్చీ ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే వితిక బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు తొంభై రోజులుగా కలిసి ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి బిగ్‌బాస్ రెడీ అయిపోయాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కానీ ఒక్కరోజులో ఈ అంచనా తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి బిగ్‌బాస్ ఏమైనా ట్విస్టులు ఇస్తాడా? డబుల్ ఎలిమినేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారా అన్నది వీకెండ్ ఎపిసోడ్లో చూడాలి. -
బిగ్‌బాస్: వితిక దెబ్బకు వరుణ్ అబ్బా!
బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. బిగ్‌బాస్ ఇంట్లో టైటిల్ వేటకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపించి బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఎనభై ఏడు రోజులపాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఇంటి సభ్యులు వారిని చూడగానే ఎమోషనల్ అయ్యారు. వచ్చిన అతిథులు సైతం ఎవరి తరహాలో వారు టైటిల్ పోరుకు హౌజ్‌మేట్స్‌ను సన్నద్ధం చేసి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హౌజ్‌మేట్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కో గెటప్‌లో దర్శనమిస్తున్నారు. శ్రీముఖి ధరించిన గెటప్ తనకు పర్ఫెక్ట్గా సూట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా తన హావభావాలు చూస్తుంటే ఇది మహానటి సావిత్రి పాత్ర అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక శివజ్యోతి చంద్రముఖి క్యారెక్టర్లో విరుచుకుపడి నటించినట్లు తెలుస్తోంది. వరుణ్, వితికలు బాహుబలి చిత్రంలోని ప్రభాస్, అనుష్క గెటప్ వేశారు. కత్తి తిప్పుతూ రాణిలా హావభావాలు పలికిస్తోంది వితిక. బాహుబలి ఫేమస్ సీన్ ఒకటి కాపీ చేయాలని చూడగా బొక్కబోర్లా పడ్డారు. వరుణ్ వీపు మీద నుంచి వితిక నడుచుకుంటూ వెళ్లాలని చూసింది. కానీ వరుణ్ బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. దీంతో అందరూ పడీపడీ నవ్వారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. వరుణ్.. మళ్లీ ఫ్రూట్ అయ్యాడంటున్నారు. మీరు కూడా కింది మీమ్స్ చూసి సరదాగా నవ్వుకోండి. Cinemallo manaki nachina characters lo housemates 🎞️📽️#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/4ZUWgF9BYv — STAR MAA (@StarMaa) October 18, 2019 -
బిగ్‌బాస్: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!
బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ చిచ్చు చల్లారలేదు. మాటల యుద్ధానికి దిగిన కంటెస్టెంట్లు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ‘నన్ను కంత్రి అని నోరు పారేసుకున్నాడు. టివిలొ మా ఆయన చూస్తే ఫీల్ కాడా? తనకొక్కడికే పెళ్లాం ఉందా?’ అంటూ శివజ్యోతి ఏడ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియ వరుణ్, రాహుల్ స్నేహానికి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. పునర్నవి వెళ్లినప్పటి నుంచి రాహుల్ కాస్త దూరంగా ఉంటున్నాడని, తనలో మార్పు గమనిస్తున్నానని వరుణ్ అభిప్రాయపడ్డాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారి పనితనంతో హోటల్‌కు సెవన్ స్టార్ సంపాదించి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించాడు. హోటల్ మేనేజర్ వరుణ్.. వంట మాస్టర్లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక, హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా అలీ, శివజ్యోతి, రాహుల్ పనిచేశారు. వీరందిరి చేత బిగ్‌బాస్ కొన్ని డ్రిల్స్ చేయించాడు. మార్చ్.. ఆగకుండా శుభ్రం చేయడం.. ఫ్రీజ్ అవటం.. ఉన్నచోటే నిద్రపోవడం.. పాట వచ్చినప్పుడు డాన్స్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు ఇంటి సభ్యులతో ఆడుకున్న బిగ్‌బాస్.. తర్వాత ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ముందుగా వితిక చెల్లెలిని ఇంట్లోకి పంపించగా.. ఆమె బావగారూ అంటూ పరుగెత్తుకెళ్లి వరుణ్‌ను హత్తుకుంది. చెల్లెలు రితికను చూడగానే వితిక బోరున ఏడ్చింది. వితికను ఊరడిస్తూ.. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూ ఆమెకు ధైర్యాన్ని నూరిపోసింది. టాస్క్‌లో మరింత పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది అంటూ వరుణ్‌కు సలహా ఇచ్చింది. చివరగా వెళ్లిపోతూ హోటల్‌కు ఒక స్టార్‌ను ఇచ్చింది. తర్వాత అలీ రెజా భార్య మాసుమా ఇంట్లోకి అడుగు పెట్టింది. వచ్చీరాగానే అలీని హత్తుకుని విలపించింది. ఇక మావాళ్లు ఎప్పుడొస్తారో అంటూ మిగతా హౌస్మేట్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్‌బాస్ : శివజ్యోతి ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!
బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ చివరి అంకానికి చేరింది. సీజన్ ముగింపునకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ బిగ్‌బాస్ గేమ్ కఠినతరం చేసేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఇంటి సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే గేమ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ ట్రాక్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్ పదమూడో వారం నామినేషన్ ప్రక్రియలో ఇంట్లో కుంపటి పెట్టాడు. ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ టాస్క్‌పెట్టి.. మీలో మీరే ఎవరు తోపు అనేది తేల్చుకోండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు సేవ్ అవుతారని, మిగతా నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్లు నామినేషన్‌కు వెళ్తారని చెప్పారు. ఇక ఈ టాస్క్‌లో రాహుల్, శ్రీముఖి ఒకరి మీద ఒకరు వీర లెవల్లో వాదులాటకు దిగారు. కానీ చివరికి బాబా తన మొదటి స్థానాన్ని శ్రీముఖికి ఇవ్వడంతో ఈ గొడవ సమసిపోయింది. ఇక శివజ్యోతి.. తన లక్కీ నంబర్ మూడంటూ ఆ స్థానం తనకు కావాల్సిందేనని పట్టుబట్టింది. వరుణ్.. తన మూడో స్థానాన్ని శివజ్యోతికి ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. అయితే వితిక వచ్చి అడగ్గానే తను పక్కకు తప్పుకుని మూడో స్థానాన్ని ఆమెకు అప్పగించాడు. ఇది మింగుడుపడని శివజ్యోతి వారిద్దరితో వాదనకు దిగింది. కంటెస్టెంట్లుగా ఎవరికి వారు సొంతంగా గేమ్ ఆడండి అని శివజ్యోతి.. వరుణ్, వితికలకు చురకలు అంటించింది. మూడో స్థానం నుంచి కదిలేది లేదని వితిక పక్కనే నుంచుని పేచీకి దిగింది. సహనం కోల్పోయిన వరుణ్.. శివజ్యోతిపై ఫైర్ అయ్యాడు. కంత్రి ఆటలు ఆడకు అంటూ ఆమెను వెక్కిరించాడు. దీంతో వెటకారాలు, వెక్కిరింతలు చేయొద్దని శివజ్యోతి వరుణ్‌కు స్పష్టం చేసింది. చాలా సేపటివరకు ఇదే గొడవ కొనసాగింది. చివరకు బజర్ మోగడంతో టాస్క్ సమయం అయిపోయింది. ఎవరెవరూ ఏయే.. స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకోడంలో గందరగోళం, సందిగ్దత ఏర్పడినందున.. ఈ వారం అందరూ నామినేషన్‌కు వెళ్తున్నారని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇక వరుణ్, వితిక, శివజ్యోతి మాటల యుద్ధంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వితికను నామినేట్ చేయడానికే శివజ్యోతి ఈ కుట్ర పన్నిందని నెటిజన్లు అంటున్నారు. వరుణ్ ప్రవర్తనను కూడా ఓ వర్గం ఎండగడుతోంది. మొత్తంమీద ఈ ముగ్గురూ చేసిన తప్పుకు ఇంటి సభ్యులంతా నామినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ గొడవ వల్ల నష్టపోయేది మాత్రం వితికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ను వీడేది వితికే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతవరకు నామినేషన్లోకి ఎక్కువగా రాని వితిక, శివజ్యోతిలను ఈసారి ఇంటికి పంపిస్తామనే ఆలోచనలో జనం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో చూడాలి..! -
వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ కోసం ఇంటిసభ్యులు హోరాహోరీగా పోరాడారు. మొదటి లెవల్లో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన వితిక, రెండో లెవల్లో విజయం సాధించిన బాబా భాస్కర్ మెడల్ కోసం తలపడ్డారు. నేటి ఎపిసోడ్లో రాహుల్, పునర్నవి మళ్ళీ గొడవ పడ్డారు. నన్ను ముట్టుకోకు వదిలేయ్ అంటూ పునర్నవి.. రాహుల్‌పై ఫైర్ అయింది. కోపం తగ్గాక రాహుల్ ను కవ్వించాలని చూసినప్పటికీ అది విఫలమైంది. 'నీ మొహం చూస్తేనే చిరాకు వస్తుంది' అంటూ రాహుల్ కూడా పునర్నవిని వేసుకున్నాడు. ఇక అదే కోపాన్ని రాహుల్.. మహేశ్‌పై తీసినట్టు కనిపించింది. బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ చివరి అంకంలో వితిక, బాబా భాస్కర్ నువ్వానేనా అన్న రీతిలో తలపడ్డారు. వీరిలో ఒకరిది సహనం ఐతే ఇంకొకరిది అంతకు మించిన మొండితనం. దీంతో టాస్క్ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఇంటిసభ్యులు రిక్షాలో కూర్చున్న పోటీదారులిద్దరినీ నానారకాలుగా విసిగించారు. అయినప్పటికీ వారిద్దరూ నవ్వుతూనే భరించారు. టాస్క్ లో భాగంగా ఎండలో మూడు స్వెటర్లు ధరించారు. అటు వర్షానికీ తడిచారు. వీటన్నింటికీ మించి ఒక్కొక్కరూ పది మిరపకాయలు తిన్నారు. కాగా ఉదయం ప్రారంభమైన టాస్క్ రాత్రి వరకూ కొనసాగింది. అన్నింటినీ కిందా మీద పడుకుంటూ ఎలాగోలా పూర్తి చేశారు. కానీ అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయింది. బాబా, వితికలకు బాత్రూం వస్తోంది. ఉన్నచోటే పని కానిచ్చేయండి అని శ్రీముఖి ఓ సలహా విసిరింది. టైటిల్ అయినా వదులుకుంటా తప్ప అలాంటి పని చేయనంటూ వితిక ఖరాఖండిగా చెప్పింది. అయితే బాబా పాస్ కు వెళ్తాననడం నచ్చని వితిక అతన్ని రిక్షా నుంచి తోసేసింది. దీంతో ఇంటిసభ్యులందరూ కంగుతిన్నారు. ఏది ఏమైనప్పటికి బిగ్ బాస్ వితికను విన్నర్ గా ప్రకటించాడు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వితిక సెల్ఫిష్ గా ప్రవర్తించిందని.. తనవల్లే బాబా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది అని విమర్శిస్తున్నారు. మరికొంతమందేమో వితిక సరైన నిర్ణయం తీసుకుందని అభినందిస్తున్నారు. తాజా ప్రోమో ప్రకారం వితిక చేసిన పనికి నాగార్జున సైతంషాక్ అయినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్: టాస్క్ అన్నాక మీద పడతారు..!
బిగ్‌బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు టాస్క్‌లో మహేశ్.. రాహుల్‌పై మండిపడ్డ విషయం తెలిసిందే! అయితే అదంతా ఆటలో భాగమే అని మిగతావారు నచ్చజెప్పడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకులే అని భావించిన మహేశ్ తిరిగి ఆట ప్రారంభించాడు. ఇక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవేశంలో పునర్నవికి ఇచ్చిన 200 విలువ చేసే రాయి ఇవ్వనని మొండికేసింది. అయితే వెంటనే తేరుకున్న మహేశ్ మళ్లీ ఆటలో కాస్త పుంజుకున్నాడు. ఇక బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు నామినేషన్ టాస్క్ ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు విధించాడు. ఇందులో భాగంగా కెప్టెన్ శ్రీముఖి తప్ప మిగతావారంతా ఇంట్లోకి వెళ్లకుండా గార్డెన్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. టాస్క్‌లో సేకరించే రాళ్లతో వంట సామాగ్రిని కొనుక్కొని భోజనం సిద్ధం చేసుకోవాలి. ఇక వంటసామాగ్రి ఖరీదు చూసి ఇంటిసభ్యులు గుడ్లు తేలేశారు. రూపాయి అగ్గిపెట్టె కూడా రూ.500 ఉంది. దీంతో ఇంటిసభ్యులు తిండి కోసం నానా తంటాలు పడ్డారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో మహేశ్, రాహుల్‌కు గొడవ జరగగా నేడు వరుణ్, వితికలకు భేదాభిప్రాయాలు వచ్చినట్టు కనిపిస్తోంది. రాళ్లు సేకరించే క్రమంలో బాబా, వితిక ఒకరినొకరు తోసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తోపులాటలో వితిక కిందపడింది. దీంతో చూస్కొని ఆడొచ్చు కదా అంటూ వితిక అసహనంతో ఊగిపోయింది. ‘ఇది టాస్క్.. అలానే జరుగుతుంది, టాస్క్‌లో దెబ్బలు తగులుతాయి’ అంటూ వరుణ్.. వితికపై ఫైర్ అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద వాదులాటే జరిగింది. ఆడితే ఆడు, లేకపోతే లేదంటూ వితికపై మండిపడ్డాడు. వితికపై ఈగ కూడా వాలనివ్వని వరుణ్.. ఎందుకు తనపై అంతలా సీరియస్ అయ్యాడు? అసలు వీరి గొడవ ఎక్కడిదాకా వెళుతుంది అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. కాగా ఇప్పటికే రాహుల్ నామినేట్ అవగా, నేటి ఎపిసోడ్లో ఎవరు నామినేషన్ జోన్లోకి రానున్నారో చూడాలి! Physical task lo hurt avatam common ye kada#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/hJX1j2jucy — STAR MAA (@StarMaa) October 1, 2019 -
బిగ్‌బాస్: గొడవలు పెట్టడం ఎలా?
బిగ్‌బాస్ తొమ్మిదో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్లో రాహుల్ సిప్లిగంజ్, హిమజా, మహేశ్‌లు ఉన్నారు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు బిగ్‌బాస్ హౌజ్‌లో ఆసక్తికర పరిస్థితులు నెలకొంటాయి. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా.. శత్రువులుగా ఉన్న వారు స్నేహితులుగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిశాక బిగ్‌బాస్ ఇచ్చే ఫన్నీ, సీరియస్ టాస్క్‌లతో ఇంటి సభ్యులు బిజీ అవుతారు. మంగళవారం వరకు నామినేషన్ ప్రక్రియ జరిగింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్క్ `క్రేజీ కాలేజీ'తో ఇంటి సభ్యులందరూ సరదాగా గడిపారు. దీనిలో భాగంగా గాసిపాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన వితికా.. బిగ్‌బాస్‌లో గొడవలు ఎలా పెట్టాలనే దానిపై ఇంటిసభ్యులతో చర్చిస్తుంది. దీనికి శ్రీముఖి, పునర్నవి, రాహుల్ ఇచ్చిన సమాధానాలు అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. అంతకుముందు లవాలజీ లెక్చరర్‌గా బాబా భాస్కర్ తొలుత నవ్వులు పూయించగా.. చివరికి శివజ్యోతి చేత కంటతడి పెట్టించాడు. ఇక చిల్లాలజీ లెక్చరర్‌గా వరుణ్ సందేశ్ సందడి చేశాడు. ఇంటి సభ్యులను సిల్లీ ప్రశ్నలు అడిగి ఫన్నీ సమాధానాలు రాబట్టాడు. ఇక ఈ రోజు బిగ్‌బాస్ తొలుత ఉద్విగ్నంగా.. అనంతరం సందడిగా జరిగే అవకాశం ఉంది. -
అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
-
బిగ్‌బాస్.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్మేట్స్.. నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీముఖి, శిల్పా, హిమజ, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ బిగ్‌బాస్‌కే తలనొప్పిగా మారింది. బిగ్‌బాస్ ఆదేశాలనే లెక్కచేయకుండా కొందరు చిన్నచూపు చూస్తున్నారు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి, మహేష్, పునర్నవిలకు షూస్ పాలిష్చేసే టాస్క్‌ను పనిష్మెంట్గా ఇచ్చాడు. మహేష్, పునర్నవిలు ఈ పనిష్మెంట్ను చేయడానికి ఒప్పుకోలేదు. అయితే శివజ్యోతి బుజ్జగించడంతో మహేష్ చివరకు తలొంచాడు. కానీ పునర్నవి మాత్రం ఎంతమాత్రం వెనక్కితగ్గలేదు. శ్రీముఖి మాత్రం ఆ పనిష్మెంట్ను అందరికంటే ముందే స్వీకరించింది. అయితే శ్రీముఖి ఈ సారి కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికైనట్లు కనిపిస్తోంది. కెప్టెన్ కావాలని ఇదివరకే ఎన్నోసార్లు ప్రయత్నించిన శ్రీముఖికి భంగపాటే ఎదురైంది. ఈసారైనా కెప్టెన్‌గా ఎన్నికవుతుందా? లేదా అన్నది చూడాలి. బరువులెత్తగలవా జెండా పాతగలవా అనే ఈ టాస్క్ కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వితికా, శ్రీముఖి, శివజ్యోతిలను వరుణ్, రవి, మహేష్‌లు ఎత్తుకుని అటు ఉన్న జెండాలను ఇటు పెట్టాల్సి ఉంటుంది. అయితే వితికాను ఎత్తుకున్న వరుణ్, శివజ్యోతిని మోస్తున్న మహేష్‌లు కాస్త త్వరగానే గమ్య స్థానాలకు చేరుకుంటూ జెండాలను పెడుతున్నారు. అయితే శ్రీముఖిని ఎత్తుకున్న రవి మాత్రం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు నెటిజన్లు రవిపై జాలి చూపిస్తున్నారు. రవి మధ్యలోనే కూలిపోతాడేమో, టాస్క్ తరువాత రవి పరిస్థితి ఏంటో అని జాలిపడుతున్నారు. మరి వీరి కామెంట్లకు బదులిస్తూ.. శ్రీముఖి టాస్క్ గెలిచి.. కెప్టెన్‌గా ఎన్నికవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే శివజ్యోతి కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా గెలిచి రెండో సారి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తుందా? లేదా.. ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్‌ల్లో పోటీపడటమే గానీ విజయం సాధించని వితికా, శ్రీముఖిలు కెప్టెన్‌గా ఎన్నికవుతారో చూడాలి. -
బిగ్‌బాస్: గొడవ పడుతున్న వరుణ్-వితిక
-
భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్ టాస్క్‌లో భాగమా?
బిగ్‌బాస్ ఇంట్లో ఇప్పటివరకు చాలా కూల్‌గా కనిపించిన వ్యక్తి ఎవరంటే టక్కున వినిపించే పేరు వరుణ్. అలాంటి వరుణ్ వితికాపై విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. వితికాకు ఇంటిలో ఉండే అర్హతే లేదంటూ మొహం మీదే చెప్పాడు. వితికాను అందరి ముందే నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఏడిపించడానికి ప్రయత్నించినట్టుగానే ఉంది. వరుణ్ నిజంగానే అలా ప్రవర్తించాడా లేక ఇది బిగ్‌బాస్ ఆడిస్తున్న నాటకమా? అనేది భేతాళుని చిక్కు ప్రశ్నలా మారింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య మహేశ్.. వరుణ్‌తో కాస్త క్లోజ్ అయ్యాడు. దీన్నిబట్టి చూస్తే వరుణ్ -వితికా మధ్య పుల్లలు పెట్టింది మహేశే అని కొందరు తిట్టిపోస్తున్నారు. ఇది కెప్టెన్సీ టాస్క్ అని కొందరు తేలికగా తీసిపడేస్తున్నారు. మరోవైపేమో ఇది పక్కా సీక్రెట్ టాస్క్అని.. ఇందులో వరుణ్ గెలిచి రెండో కెప్టెన్‌గా ఎన్నికయి రికార్డు సృష్టించాలని వరుణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్ని గొడవలు జరిగినా వరుణ్ వితిక విడిపోవడమనేది జరగదని వారి ఫాలోవర్స్ గట్టిగా విశ్వసిస్తున్నారు. భూమి ఆకాశం ఒక్కటైనా వారిని విడదీయలేరు అంటూ ఆ జంటకు జై కొడుతున్నారు. కాగా ప్రోమోలో కనిపించే ట్విస్టులు ఎపిసోడ్లో ఉండవు.. ఎపిసోడ్లో ఉండే ట్విస్ట్‌లు ప్రోమోలు ఉండవు.. సో తప్పకుండా ఎపిసోడ్లో అంత సీన్ ఉండదు అని కొట్టిపారేస్తున్నారు ప్రోమో లవర్స్. మరో వైపేమో.. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు అవుతాయి. ఈ మాత్రం దీనికే ఇంత కంగారు పడిపోవాలా అంటూ పెళ్లయిన వారు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్‌బాస్ 3 సీజన్ కాస్త చప్పగా సాగుతోందని, చిన్నచిన్న గొడవలతో అలా నెట్టుకొస్తున్నారని, లవ్‌ట్రాక్‌లు కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా బిగ్‌బాస్ సీజన్ 1,2ల కన్నా ఇది బాగా వెనకపడిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో వీటన్నింటి నుంచి గట్టెక్కడానికి, టీఆర్పీ రేటింగ్‌ను అమాంతం పెంచడానికి బిగ్‌బాస్ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక వరుణ్ టాస్క్‌లో భాగంగా చేసినా.. నిజంగా అలా ప్రవర్తించినా తర్వాత వితిక దగ్గర అతని పరిస్థితిని తల్చుకుంటే జాలేస్తోందని నెటిజన్లు వరుణ్‌పై సానుభూతి ప్రకటిస్తున్నారు. వారు గొడవ పెట్టుకోలేదు. బిగ్‌బాస్ కావాలనే గొడవ పెట్టాడు అని మరికొందరు గట్టిగా నమ్ముతున్నారు. ఏదిఏమైనా ఈ సారి వీర లెవల్లో విరుచుకుపడ్డ వరుణ్‌ను వితిక క్షమిస్తుందా? అసలు భార్యాభర్తల మధ్య నిప్పు రాజేసింది ఎవరు? ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్లనుంది..? అనేది వేచి చూడాల్సిందే. -
బిగ్‌బాస్.. ఏయ్ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్
బిగ్‌బాస్‌లో ప్రతీవారం నామినేషన్స్,టాస్క్, ఎలిమినేషన్స్ జరగుతూనే ఉంటాయి. హౌస్‌లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ అనంతరం ఆరోవారానికి గానూ.. పునర్నవి,రవికృష్ణ, మహేష్, హిమజ, రాహుల్,వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యారు. ఇక నేడు బిగ్‌బాస్ ఓ టాస్క్‌ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా ఏయ్ సరిగా మాట్లాడు అంటూ రాహుల్‌పై అలీరెజా ఫైర్ అయ్యాడు. ఈ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్ అంతా గందరగోళంగా మారినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగబోతోన్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఈ గొడవ జరగనుందా? మరేతర కారణంగానైనా జరగనుందా? అనే విషయం తెలియాలి. గతానికి భిన్నంగా వితికా ఏడ్వడం లేదు.. వరుణ్ కూడా తన భార్యను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావ్, రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ వితికానుద్దేశించి వరుణ్ చెప్పడం.. ‘నా దగ్గరికి రావొద్దంటోన్న’ అంటూ వితికా తిరిగి అనడం.. ఇలా మాటామాట పెరిగి వరుణ్ అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది. కోపంలో కాఫీని విసిరేయడం లాంటివి ప్రోమోలో ఆసక్తిని రేపుతున్నాయి. మరి వారిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి. -
బిగ్‌బాస్.. ఆ నలుగురు విడిపోనున్నారా?
సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, చిన్నపాటి గొడవలు.. ఇలా నవరసాలు పండిస్తున్న బిగ్‌బాస్ హౌస్ సోమవారం వచ్చేసరికి మాత్రం సీరియస్‌గా మారిపోతుంది. దానికి ప్రధాన కారణం నామినేషన్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్ అనగానే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అందుకోసం వారు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఎవరిని నామినేట్ చేయాలని సాకు వెతుక్కోవడమే కాదు అసలు తనని ఎవరు, ఎంతమంది నామినేట్ చేస్తారో అనే భయం పట్టి పీడిస్తుంది. తీరా నామినేషన్‌కు వచ్చాక సీన్ కాస్తా మరింత పెద్దదైపోతుంది. గొడవ జరగకుండా ఇప్పటివరకు ఏ నామినేషన్ ఎపిసోడ్ పూర్తవకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక ఊహించని రీతిలో వెన్నుపోటులు కూడా నడుస్తాయి. గతవారంలో పునర్నవి, వరుణ్.. రాహుల్‌ను తమ స్నేహితుడు అని చెప్తూనే నామినేషన్‌కు పంపించడమే ఇందుకు ఉదాహరణ. ఇకపోతే మాస్క్‌లు తీసేయండి.. అని నాగార్జున చెప్పిన మాటలను ఇంటి సభ్యులు ఇప్పుడిప్పుడే పాటిస్తున్నట్టు అనిపిస్తోంది. గత ఎపిసోడ్లో జరిగిన మిత్రుడు-శత్రువు-వెన్నుపోటుదారుడు ఆటలో ఇంటి సభ్యులందరూ వారి మనసులో ఉన్నదంతా బయటకు కక్కేశారు. కొంతమంది వారు నొచ్చుకోకుండా చెప్పీ చెప్పనట్టు చెప్పి తప్పించుకున్నారు.. అది వేరే విషయం. అయితే హౌస్‌లో ఓ నలుగురు మాత్రం స్నేహ బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వరుణ్-వితికా-రాహుల్-పునర్నవి ఓ గ్రూప్‌గా ఉంటోన్న విషయం అందరికీ తెలిసిందే. గతవారం నామినేషన్ విషయంలో తనను నామినేట్ చేసినా..లైట్ తీసుకున్నాడు రాహుల్. హౌస్‌మేట్స్‌లో కొందరు మిగతా ఇంటి సభ్యుల వెనకాల మాట్లాడుకున్న వీడియోలు ప్లే చేయించి హౌస్మేట్స్ మధ్య గొడవలు పెట్టేందుకు బిగ్‌బాస్ ప్రయత్నించాడు. దీనిలో భాగంగా వితికా తన గురించి మాట్లాడిన వీడియాను పునర్నవికి చూపించాడు. అప్పటికే వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు కనిపించినా.. ఈ సీన్ తరువాత పునర్నవి చాలా బాధపడింది. బుజ్జగింపులు, క్షమాపణలు, ఎన్నో అలకలు, చివరకు పునర్నవిని వితికా ఎత్తుకు తీసుకెళ్లడంతో గొడవ గురించి మరిచిపోయినట్లు కనిపించింది. అయితే ఆదివారం నాటి టాస్క్‌లో మళ్లీ మొదటికి వచ్చింది. వితికా తనకు వెన్నుపోటు పొడిచిందని, వరుణ్ తన శత్రువని పేర్కొంది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా అదే విషయం తెలుస్తోంది. పునర్నవి ఇంకా వితికాను క్షమించలేదని, అందుకే ఆమెను నామినేట్ చేస్తోందని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. దీంతో ఆ నలుగురు కాస్త విడిపోతారేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి. నేడు జరగనున్న నామినేషన్ ప్రక్రియలో రాహుల్-వితికాల్లోంచి వితికాను వరుణ్ సేవ్ చేయాలని చూస్తుండగా.. పునర్నవి వితికాను నామినేట్ చేసింది. అయితే ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో కెప్టెన్ శివజ్యోతి నిర్ణయమే ఫైనల్ కావడంతో.. ఆ ఇద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు సేవ్ అయ్యారు? అనేది తెలియాల్సి ఉంది. -
బిగ్‌బాస్.. వరుణ్‌కు వితికా శత్రువా?
బిగ్‌బాస్ హౌస్‌లో తమకు మిత్రుడెవరు? శత్రువెవరు? వెన్నుపోటు పొడిచిందెవరు? అంటూ ప్రతీ హౌస్మేట్స్ తెలపటం.. ఈ వీకెండ్లో హైలెట్‌గా మారనుంది. ఈ టాస్క్‌లో ఎవరి మైండ్‌లో ఏముందో? ఎవరినీ తమ మిత్రుడుగా, శత్రువుగా భావిస్తున్నారో.. వెన్నుపోటుదారునిగా అనుకుంటున్నారో తెలిసిపోనుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మహేష్, శ్రీముఖి, పునర్నవి, వరుణ్‌లకు సంబంధించి.. ఎవరెవర్ని ఏమని భావిస్తున్నారో.. చూపించినట్టు తెలుస్తోంది. (బిగ్‌బాస్.. ఎలిమినేట్ అయింది ఆమేనా?) బాబా భాస్కర్‌ను మిత్రుడుగా, అలీరెజాను శత్రువుగా.. శ్రీముఖిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్‌ను మిత్రుడుగా, బాబా భాస్కర్‌ను శత్రువుగా.. వితికా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా శ్రీముఖి పేర్కొంది. రాహుల్‌ను మిత్రుడుగా, వరుణ్ సందేశ్‌ను శత్రువుగా.. వితికాను వెన్నుపోటుదారులుగా పునర్నవి తెలిపింది. వితికాను తన శత్రువుగా, పునర్నవిని వెన్నుపోటుదారులుగా వరుణ్ సందేశ్ పేర్కొనట్టు కనిపిస్తోంది. ఆసక్తికరంగా ఈ టాస్క్ హౌస్మేట్స్ మధ్య ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుందో చూడాలి. ఐదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేది అషూ రెడ్డి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి వీటన్నింటికి సమాధానం కావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. -
గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్ రంగంలోకి దిగాడా?
బిగ్‌బాస్ అంటేనే గొడవలు.. అరుపులు.. వాటితో వచ్చే టీఆర్పీలు. కొంతమందిని ఓ ఇంట్లో పడేసి.. బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచేయడం.. ఊరికే ఉన్నవారిని అలా ఉండనీయకపోవడం.. టాస్క్‌ల పేరిట వారి అంతరాలను బయటకు లాగడమే బిగ్‌బాస్ పని. అయితే ఈ మూడో సీజన్లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లు సరిగా లేవో.. లేదా.. హౌస్మేట్స్ సరిగ్గా పార్టిసిపేట్ చేయడం లేదో గానీ ఏ ఒక్క ఘటన అంతగా హైలెట్ కావడం లేదు. పైగా ఇంటి సభ్యుల మధ్య చిన్నాచితక గొడవలు తప్పా.. హౌస్ దద్దరిల్లే గొడవలు ఒక్కటీ లేకపోవడం బిగ్‌బాస్‌కు మింగుడుపడటం లేనట్టుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే.. ఈ రోజు హౌస్‌లో పెద్ద చర్చలే జరిగేట్టు కనబడుతోంది. ఓ ఇంటిసభ్యుడి వెనక మిగతా హౌస్మేట్స్ ఏం మాట్లాడుకున్నారో అన్న వీడియోలను ప్లే చేసి చూపించి.. వారి మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కిచెన్‌లోకి ఎంటర్ అయితే పునర్నవి ఎలానో ప్రవర్తిస్తుందని, తనను అది చెయ్ ఇది చెయ్ అంటే కాలుద్ది అని పునర్నవిని ఉద్దేశించి వితిక అన్న మాటలను ఆమెకు ప్లే చేసి చూపించాడు బిగ్‌బాస్. బయటకు వచ్చిన పునర్నవి.. వితికాపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాహుల్‌తో పునర్నవి చర్చించనున్నట్లు కనపడుతోంది. ఇక రాహుల్ మాట్లాడిన విషయాలను సైతం శ్రీముఖికి చూపించాడు బిగ్‌బాస్. మరి ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో? ఇప్పటికే హిమజ-బాబా భాస్కర్ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ రోజు హౌస్‌లో ఎలాంటి సంఘటనలు జరగనున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితికా షెరు
బిగ్‌బాస్‌లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్‌లో ఎలా ఉంటారు? టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి. వితికా షెరు జననం: 1993 స్వస్థలం: భీమవరం తల్లిదండ్రులు: విద్య: ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తి: నటి, మోడల్ గుర్తింపునిచ్చింది: ప్రేమ ఇష్క్ కాదల్ ప్రయాణం: 11 సంవత్సరాలకే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అవటంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనూ నటించింది. తెలుగు నటుడు వరుణ్ సందేశ్‌తో సాగిన ప్రేమను పెళ్లి పీటలెక్కించింది. నటించిన చిత్రాలు: అంతు ఇంతు ప్రీతి బంతు(కన్నడ), ప్రేమించు రోజుల్లో, సందడి, చలో, (జుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు,) పడ్డానండీ ప్రేమలో మరి తెలియనివి: ఆర్కే గ్రాండ్ మాల్, తాస్య, భీమ జ్యువెలర్స్, భార్గవి ఫ్యాషన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్. పలు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లోనూ కనిపించింది. -
అందర్నీ ఓ రౌండ్ వేసుకుంటోన్న నాగ్
బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం గడిచేందుకు వచ్చింది.. మూడో వ్యక్తి కూడా వెళ్లేందుకు రంగం సిద్దమైంది. అయితే ఈ వారంలో జరిగిన టాస్క్.. దాంట్లో గాయపడిని రవికృష్ణ, దానికి కారణమైన శ్రీముఖిని బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేయడం.. హిమజ-అలీరెజా వాగ్వాదం హైలెట్‌గా నిలిచాయి. రవికృష్ణ విషయంలో వితిక, రాహుల్ స్పందించిన తీరుపై నాగ్ ఫైర్ అయ్యాడు. ఈ శనివారం నాగ్ కాకమీదున్నాడని.. అందరి లెక్కలు సరిచేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో నిధిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రవికృష్ణ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిధిని, డబ్బులను దాచిపెట్టే బిజీలో వితికా ఉంది. అనంతరం రవికి తగిలిన గాయాన్ని తలుచుకుని వితిక తెగ బాధపడింది. ఇదే విషయాన్ని నాగ్ ప్రస్తావిస్తూ.. వితికాను కడిగేశాడు. ‘రవి పట్ల నువ్వు చూపించిన కన్సర్న్ అండ్ కేర్ సూపర్బ్... నీ కేరు, కన్సర్న్ డబ్బులు దాచేసిన తరువాతా..?’ అంటూ ఎద్దేవా చేశాడు. ఈ వారంలో తమన్నా రవికృష్ణను ఏవిధంగా హింసించిందో అందరికీ తెలిసిందే. మగాడివేనా రా.. పప్పుగాడు అంటూ కించపరిచే విదంగా తమన్నా వ్యవహరించింది. అది చాలా తప్పంటూ తమన్నాను హెచ్చరించాడు. ఇక రాహుల్ ఉపయోగించే భాష, పదాలపైన నాగ్ అభ్యంతరం తెలిపాడు. ఇలా ఇంటి సభ్యులందర్నీ దారిలో పెట్టడానికి నాగ్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. రెండు వారాలుగా ఎంటర్టైన్ చేస్తూ.. సుతిమెత్తగా హెచ్చరిస్తూ వస్తోన్న నాగ్.. ఈ సారి మాత్రం ఇంటిసభ్యులను కంట్రోల్లో పెట్టే విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?
బిగ్‌బాస్‌ను నాలుగున్నర కోట్ల మంది వీక్షిస్తున్నారంటూ.. బిగ్గర్‌దెన్ బిగ్గెస్ట్ అంటూ బిగ్‌బాస్ షో గురించి కింగ్ నాగార్జున చెప్పుకొచ్చారు. తమను నాలుగున్నర కోట్ల మంది గమనిస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని హౌస్‌మేట్స్‌కు సూచించాడు. హీరో-విలన్ గేమ్ అంటూ ఇంటిసభ్యులను ఆట ఆడించిన నాగ్.. ఇంటి సభ్యులందరి వ్యవహారాలను చక్కబెట్టాడు. మొదటి వారంలో వదిలేసిన వరుణ్ సందేశ్-మహేష్ గొడవను ప్రస్తావించాడు. బిగ్‌బాస్ ఇంట్లో ఎక్కడికక్కడ గ్రూపులు ఏర్పడ్డాయని నాగ్ తెలిపాడు. శ్రీముఖి, జాఫర్, తమన్నాలు.. వరుణ్ సందేశ్, వితికాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. బయట ఉన్న వరుణ్ రవికృష్ణతో శ్రీముఖి గురించి చర్చిస్తూ ఉన్నాడు. జాఫర్, బాబా భాస్కర్లతో వరుణ్ సందేశ్ గురించి మహేష్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. సెకండ్సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లందర్నీ వరుణ్ కలిశాడని, గేమ్ ఎలా ఆడాలని తెలుసుకున్నాడంటూ జాఫర్, బాబా భాస్కర్లతో మహేష్ చెప్పుకొచ్చాడు. జైల్లో ఉన్న కారణంగా తమన్నాతో ఒక ఓటు వేయించుకుంటున్నాడంటూ కామెంట్ చేశాడు. ఇక వీటన్నంటిని గమనిస్తున్న నాగ్.. ఇంట్లో కొత్త కొత్త ట్రాకులు, గ్రూపులు పెరిగాయంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక ఒక్కొక్కరి లెక్క తేలుస్తూ.. ఇంటి సభ్యులందరి వ్యవహారాలను టచ్ చేశాడు. మొదటగా శివజ్యోతి నుంచి మొదలుపెట్టగా.. పవర్ గేమ్‌లో కింద పడినా.. స్పోర్టివ్‌గా తీసుకోవడం అలీ రెజాకు కిరీటాన్ని పెట్టడాన్ని అభినందించాడు. ఇంట్లో బాగా ఏడుస్తుందని.. బయట వర్షాలు బాగా పడుతున్నాయని, చెరువులు నిండుతున్నాయని ఏడ్వొద్దని సరదాగా కామెంట్ చేశాడు. ఇక పవర్ గేమ్ వ్యవహారంలో, తమన్నా గొడవపెట్టుకోవాలని చూసినా.. సామరస్యపూర్వకంగా చక్కదిద్దడంపై అలీ రెజాను పొగిడాడు. అలీ రెజా విషయంలో తమన్నాను మందలిస్తూ.. అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించమని ఆమెకు సలహా ఇచ్చాడు. తమన్నా ఆటపట్టించినా సరదగా తీసుకోవడం.. వితికాను ఓదార్చే విషయంలో రవికృష్ణను పొగిడాడు. వితికా-వరుణ్ సందేశ్ గొడవ గురించి మాట్లాడుతూ.. తన భర్తే తనకు సపోర్ట్ చేయలేదని ఎమోషనల్ అయిందని.. భర్త భార్యను సపోర్టు చేయాలని వరుణ్‌తో చెప్పుకొచ్చాడు. మొదటివారంలో జరిగిన మహేష్-వరుణ్ గొడవ గురించి మాట్లాడుతూ.. మహేష్‌తో వరుణ్ ప్రవర్తించిన తీరు నచ్చలేదని తెలిపాడు. సీమ నుంచి వచ్చినోళ్లు నాటు కాదు.. సిటీ నుంచి వచ్చినోళ్లు నీటు కాదంటూ తెలిపాడు. బాబా భాస్కర్ హీరో.. వరుణ్ సందేశ్, తమన్నాలు విలన్లు ఇంటిసభ్యులందరితో హీరో-విలన్ గేమ ఆడించాడు నాగ్. బంగారు వర్ణంలో ఉన్న కిరీటాన్ని హీరో అని భావించే ఇంటి సభ్యుడికి, నలుపు వర్ణంలో ఉన్న కిరీటాన్ని విలన్ అని భావించే హౌస్‌మేట్స్‌కు పెట్టాలని ఓ ఆటను ఆడించాడు. ఈ ఆటలో ఎక్కువ బంగారు కిరీటాలు బాబా భాస్కర్‌కు రాగా.. వరుణ్ సందేశ్, తమన్నాలకు విలన్‌కు సంబంధించిన కిరిటం తొడిగారు. శివజ్యోతి, అషూ, రోహిణిలు బాబా బాస్కర్‌కు బంగారు కిరీటం తొడగ్గా.. వరుణ్, రాహుల్, తమన్నాలకు నలుపు వర్ణం కిరీటం పెట్టారు. అలీ రెజాకు విలన్ కిరీటం.. రవికృష్ణకు హీరో కిరీటాన్ని తమన్నా తొడిగింది. జాఫర్.. వరుణ్‌కు విలన్, శ్రీముఖికి హీరో కిరీటాన్ని తొడిగాడు. శ్రీముఖి.. జాఫర్‌కు హీరో, వరుణ్‌కు విలన్ కిరీటాన్ని పెట్టారు. రాహుల్.. రోహిణికి హీరో, శ్రీముఖికి విలన్ కిరీటాన్ని పెట్టారు. అలీ రెజాకు హీరో, తమన్నాకు విలన్ కిరీటాన్ని హిమజ తొడిగింది. రవికృష్ణకు హీరో, శివజ్యోతికి విలన్ కిరీటాన్ని వరుణ్ సందేశ్ పెట్టాడు. పునర్నవి.. తమన్నాకు హీరో, మహేష్‌కు విలన్ కిరీటాన్ని తొడిగింది. శివజ్యోతిని బిగ్‌బాస్ ఇచ్చిన సోదరిగా చెప్పుకొచి.. ఆమెకు హీరోకు సంబంధించిన కిరీటాన్ని, తమన్నాకు విలన్ కిరీటాన్ని అలీ రెజా తొడిగాడు. వరుణ్‌కు హీరో, రాహుల్‌కు విలన్ కిరీటాన్ని వితిక పెట్టారు. వితికాకు విలన్, రోహిణికి హీరో కిరీటాన్ని బాబా భాస్కర్ తొడిగాడు. తమన్నాకు హీరో, వరుణ్‌కు విలన్ కిరీటాన్ని మహేష్ పెట్టాడు. ఈ ఆటలో బాబా భాస్కర్ హీరో.. తమన్నా, వరుణ్ సందేశ్‌లు విలన్స్ అని ఇంటిసభ్యులు తేల్చేశారు. ఇక ఎలిమినేషన్లో ఉన్న ఇంటిసభ్యులందరిలో మహేష్, హిమజ, రాహుల్, శ్రీముఖి సేఫ్.. అయినట్లు నాగ్ ప్రకటించాడు. ఇక మిగిలిన ఇంటిసభ్యులు వరుణ్ సందేశ్, వితికా షెరు, జాఫర్, పునర్నవిల్లోంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. ఇప్పటికే లీకైన సమాచారం మేరకు జాఫర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. వితికా షెరు బయటకు వెళ్తుందనే ప్రచారం జరిగినా.. శనివారం సాయంత్రం నుంచి జాఫర్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపించాయి. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోంచి జాఫర్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా విశ్లేషణ ప్రకారం జాఫర్ ఎలిమినేట్ అయ్యాడా? లేక వితికా ఎలిమినేట్ అయ్యిందా తెలుసుకోవాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. -
భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్ నుంచి రెండో వ్యక్తి బయటకు వెళ్లే తరుణం వచ్చేసింది. రెండో వారానికి నామినేట్ అయిన రాహుల్, జాఫర్, శ్రీముఖి, మహేష్, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవిలో వరుణ్ కెప్టెన్‌గా ఎన్నికైనందున.. ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండదు. మిగిలిన ఏడుగురిలోంచి ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే ఆ ఒక్కరు ఎవరనేది హౌస్‌మేట్స్‌లో ఉన్నవారికే కాకుండా బిగ్‌బాస్ వీక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ ఏడుగురిలోంచి వితికా షెరు, జాఫర్లు ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వితికా ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. స్వార్థంగా ఆలోచిండం, తన భర్త కోసం మాత్రమే పనులు చేయడం, అందరితోనూ కలవలేకపోవడం.. బయటకు వచ్చిన హేమ సైతం వితికాపై ఆరోపణలు చేయడం.. ఇలా ప్రతీ విషయంలోనూ వితికాకు నెగెటివిటీ పెరిగిపోతోంది. దీంతో ఈసారి ఎలిమినేషన్‌కు గురయ్యేది వితికానే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఓ జంటను పంపించి.. వారితో గొడవలు పెట్టించి టీఆర్పీ పెంచుకుందామని చూశారని మొదట్నుంచీ ఓ టాక్ వినిపించింది. అందుకే వరుణ్ సందేశ్, వితికా షెరులను కంటెస్టెంట్లుగా తీసుకున్నారనే కామెంట్లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వారంలో వితిక ఎలిమినేట్ అయితే.. వారిద్దరి రొమాన్స్‌కు చెక్ పడనుంది. రెండో వారానికి గానూ ఇద్దరూ నామినేషన్స్‌లో ఉండగా.. కెప్టెన్సీ పదవితో వరుణ్ ఈ గండం నుంచి గట్టెక్కాడు. ప్రైవేట్స్ పోల్స్‌ను బట్టి చూస్తే వితిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం వితిక నిజంగానే ఎలిమినేట్ అవుతుందా? తన అదృష్టం బాగుండి మరేవరైనా బయటకు వెళ్లిపోతారా? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో వంటగ్యాస్, నీళ్లు కట్
బిగ్‌బాస్ ఇంట్లో నీళ్లకు, గ్యాస్, హౌస్ యాక్సరిస్‌కు కోతపెట్టేశాడు. అవసరానికి మించి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇంటి సభ్యులకు చూపించాడు. మళ్లీ నీళ్లు రావాలన్నా.. గ్యాస్ కావాలన్నా సైకిల్ తొక్కుతూనే ఉండాలి. రాత్రి కూడా తొక్కుతూనే ఉండాలని.. లేకుంటే రాత్రంగా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయని తెలిపాడు. శివజ్యోతి టాస్క్‌లో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఇంటి సభ్యులతో చెప్పడం, రవికృష్ణ ఏదో అన్నాడని తమన్నా అలగడం, జాఫర్, మహేష్, బాబా భాస్కర్, తమన్నాలు కలిసి శ్రీముఖి గురించి మాట్లాడుకోవడం హైలెట్‌గా నిలిచాయి. సైక్లింగ్ టాస్క్ ఇంట్లో చిచ్చు పెట్టింది. గ్యాస్, నీళ్లు, హౌస్ యాక్సరీస్ కోసం సపరేట్గా మూడు సైకిళ్లు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్.. ఏ సైకిల్ తొక్కితే దానికి సంబంధించినవి నిరంతరాయంగా వస్తాయని తెలిపాడు. మూడు సైకిళ్లను విరామం లేకుండా తొక్కితూ ఉంటే మిగతా వాళ్లు వారి కార్యక్రమాలను చూసుకుంటూ ఉన్నారు. అక్కడ గ్యాస్‌కు సంబంధించిన సైకిల్‌ను పునర్నవి తొక్కినంత సేపు వంట గదిలో దోశలు వేస్తూ వితిక బిజీగా ఉంది. అందరూ కలిసి లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. టాస్క్‌లో పార్టిసిపేట్ చేయోచ్చుగా అని వితికాను ఉద్దేశించి పునర్నవి అనడంతో పెద్ద రచ్చ జరిగింది. నేను కూడా టాస్క్‌లో ఉన్నానని 35,40 దోశలు వేశానని తెలిపింది. ఇలా మాటామాటా అనుకుంటూ.. తాను సైకిల్ తొక్కుతూ ఉంటేనే దోశలు వేశావని.. పునర్నవి అంది. నువ్వు తొక్కకపోతే వేరేవాళ్లు తొక్కేవారని వితికా అనగా.. దోశలు కూడా నువ్వు వేయకపోతే వేరేవాళ్లు వేసేవారని వరుణ్ కౌంటర్ ఇవ్వడంతో వితికా ఆగ్రహించింది. తనకు గానీ, పునర్నవికి గానీ సపోర్ట్ ఇవ్వకు అని వరుణ్నుద్దేశింది వితిక పేర్కొంది. తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడతానని వరుణ్ తెలిపాడు. ఇదంతా జరుగుతుండగా.. పునర్నవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లి తనతో మాట్లాడూ అని వితికాను వరుణ్ కోరగా.. తానేమీ తప్పు చేయలేదని.. అలాంటప్పుడు తానెందుకు వెళ్లి మాట్లాడాలి అంటూ వరుణ్‌పై ఫైర్ అయింది. అలా ఆ గొడవ పెరుగుకుంటూ వితికా ఏడ్చే వరకు వెళ్లింది. అనంతరం ఇంటి సభ్యులు, వరుణ్‌ల ఓదార్పుతో కొంతసమయాన్ని గొడవ సద్దుమణిగింది. వరుణ్ తప్పు తనదేనంటూ క్షమాపణ చెప్పడంతో.. వితికా కూడా సారీ చెప్పింది. రాత్రి పడుకోవడానికే ఇప్పుడు తొక్కుతున్నానని శ్రీముఖి అనడం కరెక్ట్ కాదని ఇంటి సభ్యులకు అర్థమయ్యేట్లు శివజ్యోతి చెప్పడం.. ఐదు టీమ్స్‌గా అందరం విడిపోదామని సలహా ఇవ్వడం.. అలా అయితే అందరికీ అవకాశం వస్తదని చెప్పుకొచ్చింది. కానీ హౌస్మేట్స్ ఈ ప్రతిపాదనను స్వీకరించలేదు. తనకు దోశ విషయంలో చిన్న టెస్ట్ పెట్టామని.. ఈ టెస్ట్‌లో తమన్నా ఫెయిల్ అయిందని రవికృష్ణ సరదాగా అన్నాడు. ఆ మాటలకు తమన్నా ఫీల్ అవ్వడంతో.. ఆమెను రోహిణి, శివజ్యోతిలు ఓదార్చారు. బాబా భాస్కర్, జాఫర్, తమన్నా, మహేష్‌లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చర్చలో భాగంగా.. శ్రీముఖిని ఎవ్వరూ ఏం చేయలేరని తమన్నా చెబుతూ ఉంటే.. తను స్ట్రాటజీతో వచ్చిందని అనుకున్నాను కానీ అలాంటిదేం లేదు అంటూ జాఫర్ కూడా మాట కలిపాడు. మొదటి వారం తాను, శ్రీముఖి యాక్టివ్‌గా ఉన్నామని అయితే మా మాట వినడం లేదని ఈవారం వదిలేశామని మహేష్ కూడా వారితో కలిసి వంతపాడాడు. అందరూ నిద్రిస్తున్న వేళ.. హౌస్ యాక్సరీస్కు సంబంధించిన సైకిల్‌ను శివజ్యోతి తొక్కడం కాస్త ఆలస్యమయ్యే సరికి ఇంట్లో గంట మోగుతూ లైట్లు వెలిగాయి. దీంతో కొంతమంది లేచి సైకిల్ తొక్కే ఏరియాకు వచ్చారు. ఇక రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఏదో టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ టాస్క్‌లో శివజ్యోతి-వరుణ్ సందేశ్‌ల మధ్య గొడవ జరిగేట్టుంది. మరి ఆ సంగతి ఏంటో పూర్తిగా తెలియాలంటే బుధవారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్.. భార్యాభర్తల మధ్య గొడవలు
బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారంలో హౌస్‌మేట్స్‌కు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డట్టున్నాయి. బాత్రూమ్లో నీళ్లు కరువయ్యాయి, వంట గదిలో గ్యాస్ అయిపోతోంది.. వీటన్నంటిని మళ్లీ పంపించాలంటే సైక్లింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. నిరంతరం సైకిల్ తొక్కుతూనే ఉండాలనే షరతు కూడా పెట్టాడు. ఇక హౌస్‌లో రగడ మొదలు కాకుండా ఉంటుందా? ఇంతవరకు ప్రేమగా ఉన్న జంటపక్షుల మధ్య గొడవ మొదలైనట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమోతో అర్థమవుతోంది. ఓ జంటను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదేనని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతుండగా.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కూడా దీనికి ఊతమిస్తోంది. తాను 35, 40 దోశలు వేశానని వితిక చెబుతుండగా.. ‘గ్యాస్ తొక్కకపోతే నువ్వు వేసేదానివి కాద’ని పునర్నవి పేర్కొంది. ‘నువ్వు కాకపోతే వేరే ఎవరైనా గ్యాస్ తొక్కేవారు’ అని వితికా అనగానే.. ‘నువ్వు కాకపోతే దోశలు వేరేవాళ్లు వేసేవార’ని వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. తనకు ఏది నిజమనిస్తే అటు వైపే ఉంటానని వరుణ్ తేల్చి చెప్పాడు. దీంతో వితిక కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తడం ప్రోమోలో కనిపిస్తోంది. మరి ఇంతకీ నిజంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే నేడు ప్రసారమయ్యే షో చూడాల్సిందే. -
బిగ్‌బాస్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో అంతా ఒక రకమైన వాతావరణం నెలకొంది. బాబా భాస్కర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనను అని అనడం.. అనంతరం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు తప్పనిసరై ఇద్దరి సభ్యులను నామినేట్ చేయడం.. ఇంట్లో సభ్యులెవరైనా నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడితే నామినేట్ అవుతారని తెలపడం.. వరుణ్ సందేశ్-వితికాలు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ అనుకుని వితికాను ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయించడం.. తనకంటూ ఓ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నట్లు తమన్నా కనపడటం.. సోమవారం ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన తమన్నా ఇంట్లో కొందర్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వచ్చీ రావడంతోనే తమన్నా.. న్యాయనిర్ణేతగా మారినట్టు అనిపిస్తోంది. మహేష్-వరుణ్ సందేశ్ వ్యవహారం గురించి హౌస్‌లో ముచ్చటించింది. మహేష్ అలా సారీ చెప్పడం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో ఇంట్లో ఉండి ఉంటే.. మహేష్‌కు సపోర్ట్ ఇచ్చేదాన్ని, మహేష్‌ను అలా చీప్ మెంటాల్టీ అనడం తనకు నచ్చలేదని బాబా భాస్కర్, జాఫర్, మహేష్, అలీ రెజా, శ్రీముఖిలతో చెప్పుకొచ్చింది. ఇక నామినేషన్ ప్రక్రియలో కూడా తమన్నా వరుణ్-వితికాల పేర్లు చెప్పడం చూస్తే ముందుగానే ఓ ప్లాన్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నారని, వారిద్దరిలో ఒకర్ని ఎలిమినేట్ చేసేందుకే ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నానని తెలిపింది. అయితే తనకు, మహేష్‌కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తోందని రాహుల్‌తో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్‌లో రెండో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక హిమజ- పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్.. వరుణ్ సందేశ్- జాఫర్, శ్రీముఖి.. అషూ-శ్రీముఖి, రాహుల్.. రాహుల్-హిమజ,శ్రీముఖి.. సావిత్రి- శ్రీముఖి,జాఫర్.. అలీ-హిమజ,వరుణ్ సందేశ్.. రవికృష్ణ-హిమజ, జాఫర్.. జాఫర్-వితికా, మహేష్.. రోహిణి-పునర్నవి, మహేష్.. మహేష్- వితికా, వరుణ్.. శ్రీముఖి-హిమజ, మహేష్.. పునర్నవి-హిమజ, శ్రీముఖి.. తమన్నా-వరుణ్ సందేశ్, వితికాలను నామినేట్ చేశారు. ఇక వీరిలో శ్రీముఖి,హిమజ ఐదు ఓట్లతో.. జాఫర్, మహేష్ విట్టా, వితికా, వరుణ్‌సందేశ్ మూడు ఓట్లతో.. పునర్నవి, రాహుల్ రెండు ఓట్లతో నామినేట్ అయ్యారు. రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఈ నామినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ ఎవర్నీ నామినేట్ చేయలేనని.. కావాలంటే తనను నామినేట్ చేసుకోండని బిగ్‌బాస్‌కు తెలిపాడు. అయితే నియమాల ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడు ఓ ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందేనని బిగ్‌బాస్ సూచించాడు. అయినా సరే బాబా భాస్కర్ వినకపోవడంతో ఆలోచించుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చారు. మళ్లీ చివర్లో కన్ఫెషన్ రూమ్‌కు రావాలని కోరాడు. ఇక అందరూ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లను బిగ్‌బాస్‌కు తెలిపారు. అయితే రెండో సారి కూడా బాబా భాస్కర్ ఎవర్నీ కూడా నామినేట్ చేయలేదు. ఈసారి బిగ్‌బాస్ రెండు అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు పేర్లు చెప్పి నామినేషన్ ప్రక్రియను ముగించడం.. లేదా.. ఇంటిసభ్యులందరితో చర్చించడం ఇంకొకటి. బాబా భాస్కర్ నామినేషన్స్‌లో ఎవరి పేరు చెప్పనందుకు.. ఇంటి సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉండటం ఒక దారి లేదంటే అందరూ కలిసి బాబా భాస్కర్‌ను నామినేట్ చేయడం ఇంకోదారి అని బిగ్‌బాస్ సెలవిచ్చాడు. అయితే బాబా భాస్కర్‌ను తామెవ్వరమూ నామినేట్ చేయలేమని ముక్తకంఠంతో తెలిపారు. కావాలంటే.. అందరం నామినేషన్స్‌లో ఉంటామని ఏకతాటిపైకి వచ్చారు. అలా వద్దని.. కావాలంటే తానే ఓ ఇద్దరిని నామినేట్ చేస్తానని బాబా భాస్కర్ ముందుకు వచ్చాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన బాబా భాస్కర్.. వితికా, రాహుల్‌ను నామినేట్ చేశాడు. ఇక అంతటితో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని ప్రకటించి.. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిపాడు. ఈ వారం ఇంటి సభ్యులు ఎవరు ఎలా ఆడతారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఈ ఎనిమిది మంది సభ్యుల్లోంచి ఎవరు నిష్క్రమిస్తారో తెలియాలంటే బిగ్‌బాస్ చూస్తూ ఉండాల్సిందే.