-
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్‌కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024 -
స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్‌లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ చిత్రంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్‌లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హీరోతో బిగ్‌బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్
బిగ్‌బీ మనవరాలు నవ్య నవేలీ నంద, హీరో సిద్దాంత్ చతుర్వేది లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. సిద్దాంత్ ఓ వైట్ బ్రిడ్జి మీద పుస్తకం చదువుతున్నట్లుగా పోజిచ్చాడు. అటు నవ్య కూడా రాత్రి సమయంలో వైట్ బ్రిడ్జి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి ఫొటోల్లో తెల్లటి బ్రిడ్జి కామన్‌గా ఉండటంతో నవ్య, సిద్దాంత్ కలిసే ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా సిద్దాంత్ పోస్ట్‌కు మండుతున్న సూర్యుడి ఎమోజీతో రిప్లై ఇచ్చిన నవ్య తర్వాత దాన్ని డిలీట్ చేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం రిషికేష్‌కు వెళ్లిన వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని చెప్పకనే చెప్పారని అభిప్రాయపడుతున్నారు. కాగా హీరో సిద్దాంత్ చివరగా గెహ్రియాన్ సినిమాలో నటించాడు. ఇందులో దీపికా పదుకొణెతో పాటు నవ్య క్లోజ్ ఫ్రెండ్ అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_301238179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే!