-
SVP Success Meet Kurnool: కర్నూలులో ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ
-
వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్
కర్నూలు (కల్చరల్): అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్‌బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఫంక్షన్లంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలని మహేష్‌బాబు అన్నారు. సినిమా డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ.. కర్నూలులో విజయోత్సవ సభ జరుపుకోవడం లైఫ్ టైం గిఫ్ట్ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి, గోపి, రామ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్కారువారి పాట కోసం సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన హీరోయిన్
హ్యాండ్సమ్, స్వీట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేస్తాడు మహేశ్‌బాబు. ప్రతి సినిమాలోనూ మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడీ సూపర్‌స్టార్. ఆయన ఇటీవల నటించిన సినిమా సర్కారువారి పాట. ఈ మూవీలో ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు మహేశ్. ఈ సినిమా చూసేందుకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లింది. పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్‌లో మహేశ్ మూవీ చూసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో తననెవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్‌తో తన ముఖాన్ని కప్పుకుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ముఖానికి మాస్క్ ధరించి ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడుతూ ఫోన్లో సంభాషిస్తూ వడివడిగా నడుచుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె సింప్లిసిటీకి ముచ్చటపడుతుంటే మరికొందరు మాత్రం హీరోయిన్‌కు కాస్త ప్రైవసీ ఇవ్వొచ్చుగా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM — Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022 చదవండి: ఆర్జే కాజల్ హోం టూర్ వీడియో, దీంట్లో ఓ స్పెషల్ ఉంది! -
మేకింగ్ ఆఫ్ మూవీ - సర్కారు వారి పాట
-
ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే
Sarkaru Vaari Paata OTT Platform: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
SVP: సుదర్శన్ థియేటర్లో నమ్రత సందడి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
-
SVP: సుదర్శన్ థియేటర్లో నమ్రత సందడి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
Namrata Shirodkar Watches Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మే 12న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుడుతూ దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలైనప్పటినుంచే మహేశ్ బాబు అభిమానులతో థియేటర్ హాల్లు కిక్కిరిసిపోయాయి. తాజాగా ఈ మూవీని మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వీక్షించారు. 'సర్కారు వారి పాట' సినిమాను తిలకించేందుకు నమ్రతా శిరోద్కర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌కు వెళ్లారు. ఈ థియోటర్ అభిమానులతో సందడిగా మారింది. అధికజనంతో కిక్కిరిసిపోయింది. వారందరి మధ్య ఒక ప్రేక్షకురాలిగా నమ్రత సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే ఫుల్ క్రౌడ్ ఉన్న ఆ థియేటర్లలో సందెట్లో సడేమియాలా జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఓ వ్యక్తి జేబులో నుంచి పర్సు కొట్టేశారు. అందులో రూ. 2800 నగదు ఉన్నట్లు సమాచారం. తర్వాత అక్కడ కొద్దిసేపు పలువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చదవండి: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ .. మూవీ యూనిట్‌కి శుక్రవారం విందు ఏర్పాటు చేసింది. (చదవండి: 'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ పార్టీలో మహేశ్‌బాబు, నమ్రతలతో పాటు దర్శకుడు పరశురామ్, సుకుమార్, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని నమ్రత రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. తాజాగా మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటీనటులు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ పరశురామ్ రూ.10 కోట్లు తీసుకోగా మహేశ్‌బాబు రూ.35 - 50 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ను బట్టి మహేశ్ తీసుకునే రెమ్యునరేషన్ లెక్కలు కూడా మారతాయట. అయితే ఈ సూపర్ స్టార్ తను ఎంత డబ్బు తీసుకున్నా దాని సాయంతో చిన్నారుల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాడని, అలాంటప్పుడు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్. ఇక సర్కారువారిపాట సినిమా విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Bang! SUPERSTAR Box office bang 💵🔥#SVP SMASHED magical $1.5Million gross mark in the USA 🧨🧨#SVPUsaSandhadi #SarkaruvaariPaata @urstrulyMahesh @KeerthyOfficial@ParasuramPetla @GMBents @MythriOfficial @14ReelsPlus @FlyHighCinemas @ShlokaEnts#BlockbusterSVP pic.twitter.com/vGiT5iJ94T — SarkaruVaariPaata (@SVPTheFilm) May 14, 2022 Box Office Veta Shuru 💥💥 ALL TIME RECORD for #SVP 75 Crores gross worldwide on Day 1 for #SarkaruVaariPaata#BlockbusterSVP #SVPMania Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/ohgWExyDSt — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్. ఈ మాటను మరోసారి నిజం చేసాడు మహేశ్‌బాబు. సర్కారువారి పాట పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచాడు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. (చదవండి: మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!) మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. సర్కారు వారి పాట రెండు రోజులు కలెక్షన్స్ వివరాలు(ఏపీ & తెలంగాణ) ► నైజాం - రూ.17.44 కోట్లు ► సీడెడ్ - రూ.6.15 కోట్లు ► ఈస్ట్ - రూ.4.33 కోట్లు ► వెస్ట్ - రూ.3.19కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.5.38 కోట్లు ► గుంటూరు- రూ.6.34కోట్లు ► కృష్ణా - రూ.3.47 కోట్లు ► నెల్లూరు - రూ.1.97 కోట్లు ► మొత్తం రూ.48.27 కోట్లు -
మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో చాన్స్ అంటే హీరోయిన్స్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అన్నట్లే లెక్క. పైగా ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మూవీలో కనిపించే హీరోయిన్స్ కు మాస్ ఇమేజ్ వచ్చేస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. అంతకు ముందు రష్మిక, ఇప్పుడు కీర్తిసురేశ్..ఇద్దరికి సరికొత్త ఇమేజ్ వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీ వరకు రష్మిక ఇమేజ్ వేరు..ఆ తర్వాత ఆమె అందుకున్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు క్యూట్ గా స్వీట్ గా కనిపిస్తూ వచ్చిన రష్మిక, సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ సాంగ్ తో ఒక్క సారీగా మాస్ ఇమేజ్ అందుకుంది. మైండ్ బ్లాక్ సాంగ్ లో రష్మిక లుక్ వేసిన స్టెప్స్ ఆమెకు మరింతగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. పుష్పలో అల్ట్రా మాస్ క్యారెక్టర్ శ్రీవల్లి పాత్రలో నటించేందుకు కాన్ఫిడెన్స్ అందించాయి. మహానటితో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది కీర్తిసురేశ్. ఆ తర్వాత అలాంటి సీరియస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కాని సర్కారు వారి పాటలో మ.. మ.. మహేషా సాంగ్ తో కీర్తి వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మహానటి వేసిన మాస్ మూవ్ కు ఫిదా అయ్యారు. సర్కారు వారి పాటతో అందివచ్చిన మాస్ ఇమేజ్ ను కీర్తీ సురేష్ కంటిన్యూ చేయాలనుకుంటోంది.నేచురల్ స్టార్ నానితో కలసి నటించబోయే కొత్త సినిమా ‘దసరా’లో మరో సారి మాస్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేస్తానంటోంది. -
‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata First Day Collection: సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ నుంచి వచ్చిన సినిమా ఇది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ) తెరపై సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ. 12.24 కోట్లు ► సీడెడ్ - రూ. 4.7 కోట్లు ► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు ► వెస్ట్ - రూ. 2.74 కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు ► గుంటూరు- రూ. 5.83 కోట్లు ► కృష్ణా - రూ. 2.58 కోట్లు ► నెల్లూరు - రూ. 1.56 కోట్లు ► మొత్తం రూ.36.69 కోట్లు #SVP AP/TG Share 36.63Cr ALL TIME RECORD for Regional Film🤘💥#BlockbusterSVP #SarkaruVaariPaata https://t.co/QyE7gPFZIp — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం
‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌ని మహేశ్‌గారి లాంటి సూపర్ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్‌గారి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు. చదవండి: బాలీవుడ్‌పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్‌లో మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే -
ప్రీమియర్ కలెక్షన్స్‌తో సర్కారువారి పాట రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా?.. ఈ డైలాగ్ మహేశ్‌బాబుకు సెట్టయినంతగా మరెవరికీ సెట్ కాదేమో! ఎందుకంటే రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. 'సర్కారువారి పాట'లో డిఫరెంట్ స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి ఇంకా వయసు తగ్గినట్లుగా మరింత యంగ్‌గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇక మహేశ్, కీర్తి సురేశ్‌ల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో ఎక్కువగా కథ.. బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొట్టే బడా బాబుల గురించి తిరుగుతుంది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్. కేవలం వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనం ఆధారంగా సినిమా కథను రాసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి, అందరికీ కనెక్ట్ అవుతుందని పేర్కొన్నాడు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. 'బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు, డైరెక్టర్ పరశురామ్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టే చిత్రంగా సర్కారువారి పాట నిలుస్తుంది. రెండువారాల్లోనే ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి' అని తెలిపాడు. మరో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మళ్లీ ఇప్పట్లో ఇలాంటి ఎనర్జిటిక్ రోల్లో మహేశ్‌ను మనం చూడలేము' అన్నాడు. చదవండి: 'సర్కారువారి పాట' పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే? -
‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈరోజు విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా గురువారం(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో మహేశ్ నటన, కామెడీ పంచ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖుల తమ రివ్యూను ప్రకటిస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట మూవీ చూసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మహేశ్‌పై ప్రశంసలు కురింపించారు. చదవండి: దిక్కుతోచక ఏటీఎమ్ రూమ్‌లో నిద్రించేవాడిని: బుల్లితెర నటుడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎనర్జీటిక్గా నటన... కామెడీ పంచ్‌లు, డైలాగ్ డైలివరి అద్భుతం’ అంటూ కితాబు ఇచ్చారు. అనంతరం సర్కారు వారి పాట టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని ఆయన అన్నారు. Superstar @urstrulyMahesh delivered a superb and energetic performance with fantastic comic timing in #SarkaruVaariPaata Congratulations to the entire team. — Raghavendra Rao K (@Ragavendraraoba) May 12, 2022 -
సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని సదరు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని కూడా సాయిరెడ్డి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు. All the best to #MaheshBabu #wishes #greetings. — Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022 -
'సర్కారువారి పాట' పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మమ.. మహేశా, కళావతి, పెన్నీ సాంగ్స్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు సినిమా థియేటర్లలో రిలీజవడంతో ఫ్యాన్స్ హడావుడి అంతాఇంతా కాదు. మరి అభిమానులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి? అన్నది సాక్షి ఆడియన్స్ పోల్‌లో తెలుసుకుందాం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే.. త్వరలో పెళ్లి, ఇంతలో నగ్న ఫొటోలు షేర్ చేసిన సింగర్ -
‘సర్కారు వారి పాట’పై అమెరికా ఆడియన్స్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో నుంచి సినిమా రావడంతో మహేశ్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. దీంతో అక్కడ కూడా పలు థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆడియన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆ రోజు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ రోజు (మే 12న) విడుదలైంది. ఈ మూవీ చూసేందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కుడుతున్నారు. యాక్షన్-కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ ఇదిలా ఉంటే మూవీ విడుదలకు కొద్ది గంటల ముందు ‘సర్కారు వారి పాట’ మూవీ టీం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చిత్రం బృందం కోరింది. అలాగే ఎవరైనా, ఎక్కడైనా మూవీ పైరసీకి పాల్పడినట్లు మీ దృష్టికి వస్తే 89786 50014,99124 25159, 88811 08888 నంబర్లకు వాట్సాప్ ద్వారా, యాంటిపైరసీ.కామ్ (antipiracysolution) సమాచారం ఇవ్వాలని పేర్కొంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు #SarkaruVaariPaata Anti Piracy Control Room: Report piracy at claims@antipiracysolutions.org Whatsapp: 8978650014 9912425159 8881108888 — Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022 -
మహేశ్ బాలీవుడ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయిన నిర్మాత
Mukesh Bhatt on Mahesh Babu: బాలీవుడ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలె ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత ముకేశ్ భట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఆయనకు కావాల్సిన సౌకర్యం బాలీవుడ్ ఇవ్వలేకపోవచ్చు అని అనుకోవడంలో తప్పులేదు. మహేశ్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో. మహేశ్ అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్
-
‘సర్కారు వారి పాట’ రివ్యూ
టైటిల్ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్ సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: మే 12, 2022 భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మహి అలియాస్ మహేశ్(మహేశ్ బాబు) ‘మహి ఫైనాన్స్ కార్పోరేషన్’ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు . తన దగ్గరు ఫైనాన్స్ తీసుకున్నవారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్దం చెప్పి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది కళావతి(కీర్తి సురేశ్). ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేశ్.. ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒక రోజు మహేశ్‌కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తను అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, `మా నాన్న ఎవరో తెలుసా? నీకు పైసా కూడా ఇవ్వను` అని మహేశ్‌ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్(సముద్రఖని) విఖాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బులు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేశ్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది 10 వేల డాలర్లు కాదని, రూ. పదివేల కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల రూపాయాల కథేంటి? మహేశ్ బాబు గతం ఏంటి? చివరకు రూ.10వేల కోట్లను మహేశ్ ఎలా వసూలు చేశాడు అనేదే ‘సర్కారు వారి పాట’ మిగతా కథ. ఎలా ఉందంటే... బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు.. దానికి కమర్షియల్ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి.. ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిశోర్‌పై మహేశ్ వేసే పంచులు.. కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం 10వేల డాలర్ల కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా.. హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో ‘కాలు వేసి నిద్రించే’ కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేశ్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ శ్రీను కామెడీ, ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరికి ఆలోచింపజేస్తాయి. మహేశ్ ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలు ఈ చిత్రంలో బోలెడు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే... అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఫైట్స్‌తో పాటు డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు.తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఆకతాయి అమ్మాయి కళావతిగా కీర్తి సురేశ్ మెప్పించింది. ఇక మహేశ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజేంద్రనాథ్ పాత్రకు ప్రాణం పోశాడు ఆయన. వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. కళావతి, మ.. మ.. మహేశా పాటలు అయితే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ని కిర్రెక్కిస్తాయి. మది సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సర్కారు వారి పాట’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍 Thaman’s BGM was only effective in a few places and thought it could’ve been in some portions especially in the first half and fights #SVP — Venky Reviews (@venkyreviews) May 11, 2022 మహేశ్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్ సీన్స్‌కి తమన్ బీజీఎం అంతగా వర్కౌట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half🔔 :Good 👍 Mahesh Anna in Never before Style 🔥🔥🔥🥵🥵🤙🤙 One man show SSMB Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1 — ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022 ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌 Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP — Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022 మహేశ్ అన్న ఎంట్రీని అయితే తమన్ తనదైన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #SarkaruVaariPaata What a come back to see the @urstrulyMahesh in big screen. The energy and vibe he carries throughout is amazing. Romance and comedy timing is wow till interval right mix of action, romance and comedy 🤩😍❤️🥰💐👏🙌 — Madhusudhanan Varadarajulu (@Madhusu76425277) May 12, 2022 #SarkaruVaariPaata 1st half Routine Rotta...@/petla 💦 Deeniki pokiri range elevations entraa baabu 🤮leaves zero excitement for 2nd half — Nandha (@Nandha95807957) May 11, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪😎 — Madhav Singh 💙 (@Send4Madhav) May 12, 2022 Okka Expression ledhu Oka proper Plot ledhu Konni konni saarlu idi comedy na Anipinchindi ra thu worst lo worst 1.5 /5 Disaster . Disappointed.#SarkaruVaariPaata — V$K (@RtsChestunta) May 12, 2022 #SarkaruVaariPaata Final Report : NON RRR INDUSTRY HIT. 👉Rating : 3.75/5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ 👉BOXOFFICE WILL BLAST 🔥 🌊 👉#MaheshBabu Performance 👉Interval Block 👉Blockbuster First Half & Second Half 👉Mass Fights & #MaMaMahesha Song#SarkaaruVaariPaata #SVP — M@h€$h V@m$i (@maheshvamsi9) May 12, 2022 #SarkaruVaariPaata ...first half average..@KeerthyOfficial scenes and love track is nice...👌@urstrulyMahesh comedy timing..😂👌 — M@HaR$Hi (@MaharshiGollap1) May 12, 2022 #SarkaruVaariPaata 1st off 🔥 2 fights 💣 2 song's 🔥 Comdey 😊 Love 😘 Next level 💥#BlockBusterSarkaruVaaripaata — VEMULA MB 🔔 (@maheshbabu_jr) May 12, 2022 Superb first half @urstrulyMahesh screen presence outstanding, pre- interval 20 minutes 👏👏👌👌 SSMB comedy timing and charm this film 🙏🙏 #SarkaruVaariPaata — Raghava (@Raghava4mahesh) May 12, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022 #SarkaruVaariPaata First half is very good Mahesh babu 👌👌👌👌 Scenes with keerthy suresh in first half and second half are 👌👌👌👌👌👌 Villan role and performance is biggest minus for the movie — Mithun Y (@mithun_y11) May 12, 2022 -
Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం!
కీర్తీ సురేష్ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తా’’ అంటున్నారు కీర్తి. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘గుడ్ లక్ సఖి’, తమిళ చిత్రం ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’), మధ్యలో ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలి పాత్ర. వీటికి భిన్నంగా ‘సర్కారువారి పాట’లో కనిపించడం గురించి? ‘సర్కారువారి పాట’లో మాస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాను. కాస్ట్యూమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హెయిర్ స్టయిల్ కూడా భిన్నంగా ఉంటుంది. మేకప్ కొత్తగా ఉంటుంది. ఈ తేడా నాకు చాలా నచ్చింది. నాది సరదా పాత్ర. ఇప్పటివరకూ తెలుగులో చేసిన పాత్రలన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది. ► అందుకేనేమో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘కళావతి..’ (‘సర్కారువారి పాట’లో కీర్తి పాత్ర) నాకు మంచి గిఫ్ట్ అన్నారు. అవును. రేపు సినిమా చూశాక నాకు ఈ పాత్ర మంచి బహుమతి అని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. తమిళంలో చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ► మరి.. ‘మహానటి’ లాంటి భారీ పాత్ర చేసిన మీకు ‘కళావతి’లాంటి మాస్ క్యారెక్టర్ చేయడం ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా? లేదు. కళావతి కూడా చాలెంజింగ్ రోలే. ఈ పాత్రలో ఫన్ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్. పైగా డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్ చెప్పాను. ఏ పాత్ర సవాల్ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్ ‘మహానటి’ది.. కళావతి సవాల్ కళావతిది. అంతే.. ► ‘లవ్ ట్రాక్’ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని మహేశ్‌బాబు అన్నారు... సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్ ఉంటుంది. ఇలా లవ్ ట్రాక్ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది. ► ఈ మధ్యే ‘చిన్ని’లో డీ గ్లామరస్‌గా కనిపించి, వారం తిరిగే సరికల్లా గ్లామరస్‌గా కనిపించడం గురించి.. ‘చిన్ని’లో సాదా సీదా బట్టలు, చింపిరి జుట్టుతో, చెవికి పోగులు కూడా లేకుండా కనిపిస్తాను. ఆ సినిమా విడుదలై వారం అయింది. వెంటనే ‘సర్కారువారి పాట’లో ఆ పాత్రకు భిన్నంగా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఇలా వెంట వెంటనే రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపించడం అనేది పెద్ద సవాల్. ఇలాంటి చాలెంజ్‌లు నాకిష్టం. ► తమిళంలో మాస్ సాంగ్స్‌కి డాన్స్ చేశారు.. ఇప్పుడు ‘మ..మ.. మహేశా..’ పాటకు మాస్ స్టెప్స్ వేయడం ఎలా అనిపించింది? ఈ పాట చాలా ఇష్టపడి చేశాను. ‘మ..మ.. మహేశా..’ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ సాంగ్. థియేటర్ అదిరిపోతుంది. సీట్లలోంచి లేచి మరీ ఫ్యాన్స్ డాన్స్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మాస్ సాంగ్స్ తమిళ్లో చేశాను. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ► ‘మహానటి’తో అందరూ మిమ్మల్ని మహానటి అన్నారు. ‘సర్కారు వారి..’తో మాస్ హీరోయిన్ అంటారా? ఏమో.. నిజానికి ‘మహానటి’కి చాన్స్ వచ్చినప్పుడు నేనలాంటి సినిమా చేయగలనని అనుకోలేదు... చేసేశా. ఇప్పుడు ‘సర్కారువారి..’లో మంచి మాస్ పాత్ర చేశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి. అప్పుడే పరిపూర్ణత ఉంటుంది. ► ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలిగా చేశారు. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్ లేదా? అలా ఆలోచించలేదు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ పాత్రలను ఇష్టపడి చేశాను.