Kissing
-
ట్రంప్, పుతిన్‌ల బ్రొమాన్స్!
విల్నీయస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌లకు సంబంధించిన ఓ పేయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇరువురు ప్రముఖ నేతల గాఢ చుంబనాన్ని చూపిస్తున్న ఈ గ్రాఫిటీ పెయింటింగ్‌ను లిథువేనియా వీధుల్లో స్థానిక కళాకారుడు మిండాగస్ బొనాను వేసాడు. బార్బెక్యూ రెస్టారెంట్ సహ యజమాని డొమినికాస్తో కలిసి ఇటీవల ఆవిష్కరించిన ఈ పెయింటింగ్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు ఎరిక్ హోనెక్కర్, సోవియట్ లీడర్ లియోనార్డ్ బ్రెజ్నెవ్కు సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ ఆధారంగా.. 1990లో బెర్లిన్ గోడపై గ్రాఫిటీ కళాకారుడు దిమిత్రీ రూబెల్ వేసిన పెయింటింగ్‌తో ఈ చిత్రానికి పోలికలున్నాయి. అయితే 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించిన పుతిన్, ట్రంప్ ల చిత్రంపై నెటీజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్ ఒకరినొకరు అభినందించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై డొమినికస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతల మధ్య సారూప్యతల ఫలితంగా వచ్చిన ఆలోచన ఇదని తెలిపాడు. -
హల్చల్ చేస్తున్న లులియా- సల్మాన్ ఫోటో
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రియురాలు లులియా వాంటర్ సన్నిహితంగా ఉన్నఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రొమేనియన్ ముద్దుగుమ్మ లులియా, సల్మాన్ ను ముద్దాడుతున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో వీళ్లిద్దరు కలిసినపుడు ఈ ఫోటో చిక్కినట్టు సమాచారం. ఈ మధ్య సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇటీవల చాలా సందర్భాలలో సల్మాన్, లులియా కలిసి దర్శనమిచ్చిన వార్తల్లో నిలిచారు. మరోవైపు రొమానియన్ రియాల్టీ షోలో లులియా పాల్గొన్న వీడియోనొక దాన్ని సల్మాన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాదు.. తనకు కూడా ఇలాంటి షో చేయాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే. ఆ వయసు దాటేసాను. కానీ పిల్లల్ని కనాలని ఉంది.. ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఓ ఇంటర్యూలో చెప్పాడు. కాగా టాప్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా కథ మాత్రం పెళ్ళి పీటల దాకా వెళ్ళలేదు. ప్రసుతం రోమానియా నటి లులియా వాంటర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఉన్నా, సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు. -
ఇద్దరమ్మాయిలు ముద్దుపెట్టుకున్నారని..
హవాయి: బహిరంగంగా ఓ షాపింగ్ మాల్లో ముద్దు పెట్టుకున్నామని తమను అరెస్టు చేశారని ఇద్దరు హవాయి మహిళలు(లెస్బియన్స్) పోలీసులపై కోర్టులో దావా వేశారు. తాము ఎంత చెప్తున్నా వినకుండా అక్కడే తమను విసిగించారని, వేధింపులకు గురిచేసి అవమానించారని, అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ ఎంజెల్స్ కు చెందిన కార్ట్నీ విల్సన్, టేలర్ గ్వెర్రెరో హవాయి ద్వీపంలోకి సరదాగా గడిపేందుకు వచ్చారు. అక్కడే ఓ ఫుడ్ లాండ్ స్టోర్‌లో అందరూ చూస్తుండగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని బహిరంగంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి పోలీసు అధికారి హే అమ్మాయిలు.. మీరు ఇక్కడ అలాంటి పనులు చేయొద్దంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీంతో తాత్కాలికంగా వారు ఆపేసినా ఆ అధికారి వెళ్లిన తర్వాత షాపింగ్ చేస్తూనే తిరిగి మరోసారి ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసు.. వారిని బలవంతంగా షాపింగ్‌లో నుంచి ఈడ్చి బయటపడేశారు. అనంతరం అరెస్టు చేసి వదిలి పెట్టారు. దీంతో వారు తీవ్ర అవమానంగా భావించి కోర్టులో దావా వేశారు. హవాయిలో స్వలింగ సంపర్కులకు సాధారణ వ్యక్తుల్లాగే అన్ని రకాల హక్కులు ఉన్నా బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో ఇలాంటి పనులను సహించరు. -
ముద్దుతో కేన్సర్
సిడ్నీ: స్త్రీ, పురుషులు పరస్పరం పెదవులపై ముద్దు పెట్టుకోవడం వల్ల తల, మెడ కేన్సర్లు వచ్చే ప్రమాదం దాదాపు 70 శాతం ఉందని ఆస్ట్రేలియాలోని రాయల్ డార్విన్ హాస్పటల్లో హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ప్రముఖ డాక్టర్ మహిబాన్ థామస్ వెల్లడించారు. ఈ కేన్సర్లకు కారణమయ్యే ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ)’ ముద్దు ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందని ఆయన తెలిపారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ వైరస్ సోకిన వారికి కేన్సర్ వచ్చే ప్రమాదం 250 సార్లు ఎక్కువని ఆయన వివరించారు. పొగతాగడం, మద్యపానం సేవించిన వారికి తల, మెడ కేన్సర్లు ఎక్కువ వస్తాయన్నది వైద్య వర్గాల్లో ఇప్పటి వరకున్న విశ్వాసమని, కానీ ముద్దు ద్వారా సంక్రమించే పాపిల్లోమా వైరస్ వల్ల కేన్సర్ సంక్రమించే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనాల్లో తేలినట్లు ఆయన చెప్పారు. తల, మెడ కేన్సర్ల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో థామస్ తాజా వివరాలను వెల్లడించారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ఇద్దరిలో సమానంగా తల, మెడ కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వంద రకాల వైరస్లలో మొత్తం ఎనిమిది రకాల వైరస్‌లే ఇలాంటి కేన్సర్లకు కారణమవుతున్నాయని, ముద్దు ద్వారా సంక్రమించే పాపిల్లోమా వైరస్ వల్ల కేన్సర్ ప్రమాదం మరింత ఎక్కువని అన్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ కిస్సింగ్ (గాఢ సుదీర్ఘ చుంబనం) వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. ఆస్ట్రేలియాలో ఏటా దాదాపు నాలుగువేల మంది పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల తల, మెడ కేన్సర్లకు గురవుతుంటే ముద్దు ద్వారా కేన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన థామస్ తెలిపారు. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియాలో 13వ ఏటనే పిల్లలకు హెచ్‌పీవీ వాక్సినేషన్ ఇవ్వడం తప్పనిసరైందని చెప్పారు. అమెరికాలో తల, మెడ కేన్సర్లు వస్తున్న వారిలో 70 శాతం మందికి హెచ్‌పీవీ వల్లనే వైరస్ వస్తున్నట్టు తేలిందని ఆయన వివరించారు. -
పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!
బీజింగ్: బహిరంగ చుంబనాలకు దిగితే చర్యలు తప్పవని చైనా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సబ్ వేలో హద్దులు దాటితే దండన తప్పదని ప్రకటించారు. పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటే విచారిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వద్దంటున్నారు... వాయువ్య చైనాలోని లియోనిన్ ప్రావిన్స్ షన్ యాంగ్ సబ్ వే ట్రైయిన్ లో ఓ యువజంట ముద్దులాడుకుంటూ వీడియోకు చిక్కింది. ఈ వీడియో ఇంటర్నెట్ కు ఎక్కడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో కాస్త మర్యాద పాటించండి అంటూ హితవు పలికారు. పబ్లిగ్గా చుంబనాలకు దిగితే చుట్టూవున్న చిన్నపిల్లల పరిస్థితి ఏంటని మరో నెటిజన్ ప్రశ్నించారు. దీంతో స్పందించిన పోలీసులు 'కిస్సింగ్' జంటను పట్టుకునే పనిలో పడ్డారు. పబ్లిగ్గా ఇలాంటి పనులకు దిగితే దర్యాప్తు ఎదుర్కొవాల్సివుంటుందని హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రేమ పక్షులు మాత్రం కెమెరాలకు చిక్కకుండా చాటుగా చుంబనాలు సాగిస్తున్నారు. -
లాలాజల ప్రళయం
ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అన్న పాట సరే... కానీ పెదవితో పెదవి కలిపి అధరామృతాన్ని గ్రోలుతూ పెట్టుకునే ముద్దుతో వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు పరిశోధకులు. అధరామృతం అన్న మాటలో అది అమృతం ఎంతమాత్రం కాదని చెబుతున్నారు. మన నోట్లోనూ, గొంతులోనూ అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో ఫేరింజియల్ బ్యాక్టీరియా అంటారు. ఒకసారి పెదవులతో పెదవులు కలిపి 10 సెకన్ల పాటు ముద్దు పెడితే ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి దూరిపోయే బ్యాక్టీరియా సంఖ్య అక్షరాలా ‘ఎనిమిది కోట్ల’ పైమాటే. ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఉండదు గానీ ఒకవేళ ఎవరి నోట్లోనైనా ఎప్స్టీన్బార్ వైరస్ అనే తరహా సూక్ష్మక్రిమి ఉంటే దాని వల్ల ‘కిస్సింగ్ డిసీజ్’ వస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్ అని కూడా అంటారు. దీనికే ఫీఫర్స్ డిసీజ్ అనీ, ఫిలటోవ్స్ డిసీజ్ అని కూడా పేర్లున్నాయి. ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ వ్యాధి వచ్చిన వారిలో లింఫ్ గ్రంథులు వాచి, జ్వరం వస్తుంది. ఈ జ్వరానికి ‘గ్లాండ్యులార్ ఫీవర్’ అని పేరు. ఈ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్‌లో వ్యాప్తి చెందే వైరస్లు తెల్ల రక్తకణాల్లోని ఒక బి-లింఫోసైట్లో నివాసం ఏర్పరచుకున్న తర్వాత వచ్చిన వ్యాధి ఒక్కోసారి కొన్ని రకాల ప్రాణాంతక జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. పైగా ముద్దు పెట్టుకునే వారిలో చాలామందికి ‘క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్’ అని నిత్యం అలసటగా ఉండే వ్యాధి కూడా రావచ్చు. అందుకే అధరామృతం బదిలీ అయ్యే గాఢమైన ముద్దులకు బదులు, పొడి పొడి ముద్దులే ముద్దు అంటున్నారు పరిశోధకులు. -
ఎవరి కిస్‌లో కిక్కు..!
ముద్దంటే చేదా... ఆ ఉద్దేశం లేదా... అంటూ దాని కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారే ఎక్కువ. కానీ... కిస్ల్లోనూ కొలవూనాలుంటాయుని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పదం చిన్నదే అయినా... సబ్జెక్టు పెద్దదంటున్నారు రసిక ప్రియులు. బాలీవుడ్ భామలు సన్నీ లియోన్... ఆలియూభట్ల్లో ఎవరి ముద్దులో కిక్కెక్కువన్నది ఇప్పుడు వారి ప్రశ్న. బిగ్స్క్రీన్పై కిస్ల పంట పండించినవారిలో టాప్ వీళ్లే. ఓ సినివూలో అర్జున్ కపూర్‌కు లిప్ కిస్ ఇచ్చి ఆలియూ.. సహ నటి సంధ్యా మదుల్ పెదాలు కొరికి సన్నీ సంచలనం రేపారు. ఇక టాప్ ఎవరనే చాయిస్ మీదే..! బ్యాక్ టు పెవిలియన్..! సక్సెస్నిచ్చిన సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్లో పిల్లిమొగ్గలేసిన ఆసిన్‌కు ఇప్పటికి జ్ఞానోదయుమైనట్టుంది. అక్కడ తన సినివూలన్నీ బాక్సాఫీసుల్లో బోల్తా పడటంతో పెట్టేబేడా సర్దుకొని మళ్లీ దక్షిణాదికి వస్తోందట. త్వరలోనే ఇక్కడ ఓ సినివూ చేయబోతోందని ఆమె సోషల్ నెట్వర్క్ పేజీలో పోస్టింగ్ సారాంశం. ఏదిఏమైనా సౌత్‌లో బేస్ క్యాంప్ ఎత్తేసి ముంబైకి షిఫ్ట్ అయిన ఈ అమ్మడికి... సౌత్‌పై ప్రేమ కంటే అక్కడి ఫ్లాప్‌ల ఎఫెక్టే ఎక్కువనేది ఇక్కడి సినీజనుల టాక్. డేటింగ్లో అప్డేట్..! డేటింగ్లో కూడా ‘అప్డేట్’ ఉంటేనే మజా అంటోంది పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్. బాయ్ ఫ్రెండ్ డేవిడ్ లుకాడో తనను చీట్ చేశాడని తొలిసారి ప్రకటించిందీ భావు. ‘నా ప్రియుడు నన్ను మోసగించాడని మీకు తెలుసని నాకు తెలుసు’ అంటూ లాస్‌వెగాస్‌లో ఓ షో సందర్భంగా గోడు వెళ్లబోసుకుంది. ‘అయితే నాకు దీని వల్ల వుంచే జరిగింది. ఇప్పుడు సాధ్యమైనన్ని ఫస్ట్ డేట్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నా’ అంటూ అసలు విషయుం చెప్పేసిందీ స్వీటీ.