Justin Bieber
-
అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్
జస్టిన్ బీబర్ యువతను ఉర్రూతలూగించే పాప్ స్టార్. గత కొద్ది కాలంగా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన బీబర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బార్సిలోనాలో షో చేయడానికి వెళ్లిన బీబర్ తనను తాకడానికి యత్నించిన అభిమాని ముఖం పగులగొట్టాడు. కారులో షో కోసం బయల్దేరి వెళ్తున్న బీబర్ ను చూసిన ఓ అభిమాని దాన్ని వెంబడించి ఆయన్ను తాకబోయాడు. చిర్రెత్తుకొచ్చిన బీబర్ సదరు అభిమాని ముఖంపై పిడిగుద్దు విసిరాడు. దీంతో ఆ అభిమానితో పాటు రోడ్డు పక్కనే బీబర్ కోసం నిల్చున్నవారు షాక్ కు గురయ్యారు. బీబర్ విసిరిన పంచ్ అభిమాని పెదాలకు బలంగా తాకడంతో అతని నోటి నుంచి రక్తం కారింది. కాగా ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ ఉన్న మీడియా చిత్రించింది. 2014లో నటుడు ఓర్లాండోతో కూడా బీబర్ కొట్లాటకు దిగాడు. ఘటనపై బీబర్ ప్రతినిధిని సంప్రదించగా.. షోకు వెళ్లే ముందు అభిమానులతో బీబర్ మాట్లాడినట్లు చెప్పారు. ఫోటో, ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు కోరగా.. అవి తనకు నచ్చవని బీబర్ చెప్పినట్లు పేర్కొన్నారు. అభిమానులు బీబర్ మాటలు వినకపోవడంతో అక్కడినుంచి బయల్దేరగా ఓ అభిమాని కారును వెంబడించినట్లు చెప్పారు. -
టుస్సాడ్ మ్యూజియంలో బీబర్ విగ్రహం
లండన్: లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కొత్త మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వారంలో లండన్ లోని ఓ2 అరేనా స్టేడియంలో అంతర్జాతీయ ప్రదర్శన ఇవ్వబోతున్న సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. బీబర్ చొక్కాలేకుండా ఉండే మైనపు ప్రతిమను ఆవిష్కంచారు. ‘రెయిన్ షవర్ ఫినాలే’ ప్రదర్శనలోని బీబర్ గెటప్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. బీబర్ 22వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ మ్యూజియం తొలిసారిగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కొత్తగా ఆవిష్కరించిన మైనపు ప్రతిమ రెండోది. 2017 జనవరి మూడో తేదీవరకు మాత్రమే ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతామని టుస్సాడ్ మ్యూజియం నిర్వాకులు తెలిపారు. -
సచిన్ కొడుకు ఎవరి పోలికో తెలుసా?
జస్టిన్ బీబర్ ముంబై ఎందుకొచ్చాడు? అతను సచిన్‌ను ఎందుకలా పట్టుకున్నాడు? ఈ ఫొటోను చూసి ఓ నెటిజన్ వ్యక్తం చేసిన సందేహం ఇది. నిజానికి ఆ నెటిజనే కాదు చాలామంది లెటెస్ట్ లుక్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్‌ను చూసి అతను జస్టిన్ బీబరేమోనని పొరపడ్డారు. అందుకు కారణం లేకపోలేదు. కెనడియన్ పాప్ మ్యూజిక్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ పోలికలు అర్జున్‌లో కొన్ని ఉండటమే. క్రికెట్ లెంజడ్ సచిన్ టెండూల్కర్ కొడుకైన అర్జున్ టెండుల్కర్ ఇటీవలే 17వ వసంతంలో అడుగుపెట్టాడు. సెప్టెంబర్ 24న తన ఇంట్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తండ్రితో అర్జున్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తండ్రి బాటలోనే క్రికెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న అర్జున్ ఫొటోను చూసిన చాలామంది నెటిజన్లు థ్రిల్ అయ్యారు. ఈ ఫొటో చూసిన చాలామంది మొదట బీబర్ అనుకున్నారంటే ఎంత అచ్చుగుద్దినట్టు పోలికలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది నెటిజన్లైతే.. బీబర్, అర్జున్ చిన్నప్పుడే తప్పిపోయిన సోదరులు అయి ఉంటారని, సినిమాలోలాగా వాళ్లు మళ్లీ కలుసుకోవచ్చంటూ చమత్కరించారు. ఇంకొందరు సురేశ్-రమేశ్ అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు. -
మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!
కొంతకాలం ప్రేమించుకొని.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న యువ పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్- సెలెనా గోమెజ్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మాజీ ప్రేమికులు తాజాగా ట్విట్టరెక్కి రచ్చచేశారు. ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్నారు. తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫియా రీచి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆపకుంటే.. తన అఫీషియల్ పేజీని మూసివేస్తానని ఈ నెల 14న బీబర్ అభిమానులను హెచ్చరించాడు. ఈ పోస్టుపై సెలెనా ఘాటుగా స్పందించింది. 'నువ్వు అభిమానుల నెగిటివ్ వ్యాఖ్యలను భరించలేకపోతే.. నీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను పోస్టు చేయడం మానేయ్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం. అంతేకానీ అభిమానుల మీద వీరంగం వేయకు. వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు' అని సెలెనా కామెంట్ చేసింది. అనంతరం ఈ కామెంట్ ను తొలగించినప్పటికీ బీబర్ మాత్రం సెలెనా మీద కారాలు మిరియాలు నూరాడు. 'ఒకప్పుడు నన్ను ఉపయోగించుకొని ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు ఇప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఇది నిజంగా ఫన్నీగా ఉంది' అంటూ సెలెనాను విమర్శించాడు. దీంతో 'హ్యాండ్స్ టు మై సెల్ఫ్' సింగర్ సెలెనా మళ్లీ కామెంట్ చేసింది. బీబర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు అతను తనను ఎన్నోసార్లు మోసం చేశాడని పేర్కొంది. అతడి మోసాలను క్షమించి.. మద్దతుగా నిలిచిన తన మీదనే బీబర్ విమర్శలు చేస్తున్నాడని వాపోయింది. అయినా, అభిమానులు అనేవాళ్లు పిచ్చివాళ్లని, ఏం చేసినా అభిమానిస్తూనే ఉంటారని పేర్కొంది. కొంతకాలంపాటు ప్రేమలో మునిగిపోయి.. చాలా సన్నిహితంగా మెలిగిన బీబర్-సెలెనా 2014లో వేరయిన సంగతి తెలిసిందే. -
సింగర్‌ను దెప్పిపొడిచిన పాప్ సింగర్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ సోషల్ మీడియాలో లేడీ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌ను దెప్పిపొడిచాడు. ఓ వీడియోలో అతడి ఫొటోను, ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కాల్విన్ హ్యారిస్, ర్యాపర్ కెన్యె వెస్ట్ ది, టేలర్ ఫొటోను ఇన్ స్టాగ్రమ్ లో పెట్టి ఇప్పుడేం జరిగింది అని ప్రశ్నిస్తున్నట్లు ఓ ట్యాగ్ లైన్ తో పోస్ట్ చేశాడు. అయితే, అసలు అతడి ఉద్దేశం ఏమిటనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాగా, గత కొన్నాళ్లుగా స్విప్ట్ కు బీబర్ కు వివాదాలు ఉన్నాయి. టేలర్ సలహాలు విన్నతర్వాతే బీబర్ మాజీ ప్రియురాలు సెలెనా గోమెజ్ అతడిని పక్కకు పెట్టిందట. ఈ నేపథ్యంలో ఆమెను అవమానించేందుకే టేలర్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఫొటోను పోస్ట్ చేశాడని పలువురు చెవులుకొరుక్కుంటున్నారు. -
హీరోగా వెళ్లి.. జీరో అయ్యాడు!
లాస్ ఏంజెలిస్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. బుధవారం ఎన్బీఏ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ గోల్డెన్ వారియర్స్, క్లీవ్ లాండ్ కవాలీర్స్ జట్ల మధ్య జరిగింది. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి హీరో తరహాలో వెళ్లిన పాప్ స్టార్ చివరికి జీరో అవ్వాల్సి వచ్చింది. క్లీవ్ లాండ్ కవాలీర్స్ జెర్సీ ధరించి మ్యాచ్ చూసిన బీబర్ ఆ తర్వాత బయటకు వచ్చి స్మోక్ చేశాడు. ఎందుకో తెలియదు కానీ, బాస్కెట్ బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అసహనంగా కనిపించిన బీబర్ ఓ వివాదంలో తలదూర్చాడు. స్డేడియం లోపల ఉన్న ఓ కాంప్లెక్స్ లోకి తిరిగొచ్చిన బీబర్ ఓ వ్యక్తితో అనవసరంగా తగాదా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన బలాన్ని ప్రదర్శించాలని చూసి భంగపడ్డాడు. తొలుత అవతలి వ్యక్తిపై మూడు, నాలుగు పంచ్ లు విసిరాడు. అయితే దెబ్బతిన్న ఆ వ్యక్తి వెంటనే తేరుకుని డిఫెన్స్ చేశాడు. బీబర్ కు కూడా నాలుగు పంచ్ లు ఇచ్చాడు. అతడి పంచ్ దాటికి బీబర్ వెంటనే కింద పడిపోగా, అక్కడే ఉండి ఈ విషయాన్ని గమినిస్తున్న కొందరు ఆ ఇద్దరిని విడదీశారు. పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. -
మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ..
లండన్: తన మాజీ ప్రేయసిని ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి ఫాలో అవుతున్నాడు. ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ఇన్‌స్టాగ్రమ్‌లో మరోసారి ఆమె వెంటపడుతున్నాడు. జస్టిన్ బీబర్‌కు సెలెనా గోమెజ్ అనే ప్రేయసి ఉన్న విషయం తెలిసిందే. ఆమెతో అతడు 2014 డిసెంబర్లో తెగదెంపులు చేసుకున్నాడు. దాంతో అప్పుటి నుంచి ఎవరికి వారే మాజీ ప్రేమికులుగా ఉండిపోయారు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం వారు ఒకసారి కలుసుకున్నట్లు, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించినట్లుగాని లేదు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ప్రేమికులను ఎప్పటి నుంచో తీక్షణగా చూస్తున్న అభిమానులకు ఒకేసారి బీబర్ షాకిచ్చాడు. ఈ నెల 5 నుంచి తన మాజీ ప్రేమికురాలు సెలెనాను ఫాలో అవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ 23 ఏళ్ల అందాల్ పాప్ సింగర్‌పై బీబర్ కు ఇంకా ప్రేమ తగ్గలేనట్లుందని అతడి అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. -
పాప్ స్టార్ మరోసారి మాట తప్పాడు..
లాస్ ఏంజెలిస్: పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఈ ఏడాది మరోసారి మాటతప్పాడు. స్మోకింగ్ కు దూరంగా ఉంటానని బహిరంగంగానే ప్రకటించిన పాప్ సంచలనం బీబర్.. కొన్ని రోజులకే పొగతాగుతూ కెమెరాకు చిక్కి తొలిసారి మాట తప్పాడు. ఈ న్యూ ఇయర్ నుంచి స్మోక్ చేయనని నిర్ణయించుకున్నానని చెప్పిన కొద్ది రోజులకే.. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. మరోసారి తాను పదేపదే చెప్పిన మాట తప్పాడు బీబర్. అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగనని చెప్పిన బీబర్.. మే 10న ఓ హోటల్ మేనేజర్ తో సెల్ఫీలు దిగాడు. దీంతో రెండోసారి మాట తప్పినట్లయింది. బోస్టన్, మసాచుసెట్స్ లో హాయిగా పర్యటిస్తున్న బీబర్ గతంలో తానిచ్చిన నో సెల్ఫీ ప్రామిస్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మేనేజర్ తో సెల్ఫీ దిగడం, అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఫ్యాన్స్ తనను కలిసినప్పుడు కనీసం పలకరించరని, కేవలం ఫొటోలకు మాత్రమే ఫోజులిస్తారని కాస్త అప్ సెట్ అయ్యాడు. అయినా సరే అభిమానులు కోరడంతో సెల్ఫీలకు సై అంటున్న పాప్ స్టార్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. -
'నాకు నేను జంతువులా కనిపిస్తున్నాను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ తన ఫ్యాన్స్ పై మరోసారి మండిపడ్డాడు. ఇక వారితో ఏ మాత్రం ఫొటోలకు ఫోజు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. 22 ఏళ్ల ఈ పాటల దిగ్గజం ఇన్ స్టాగ్రమ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తన అభిమానులు వచ్చి అలా ఫొటోలు దిగుతుంటే తనకు తాను జూలో జంతువులా కనిపిస్తున్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అంటూ ఎగబడటం.. వెంటనే ఫొటోల కోసం ఎగబడటం తనకు నచ్చలేదని చెప్పారు. తనను చూసిన వారు కనీసం గుర్తించరని హాయ్ కూడా చెప్పరని.. కేవలం ఫొటోలు మాత్రమే దిగుతారని.. దాంతో తాను జూలో జంతువుగా భావిస్తున్నాని చెప్పారు. అయితే, తన నిర్ణయం అభిమానులకు ఇబ్బంది పెడుతుందని తనకు తెలుసని అయినా తప్పదని చెప్పాడు. -
క్లబ్బులో తన్నుకున్న సింగర్లు!
లాస్ ఏంజిల్స్: పాప్ సూపర్ స్టార్ జస్టిన్ బీబర్ మరోసారి గొడవల్లో తలదూర్చాడు. ఓ క్లబ్బులో నైటౌట్ సందర్భంగా యువ ర్యాపర్ 'డిజినర్'తోతగువుకు దిగాడు. ఈ గొడవ క్లబ్బులో రచ్చరచ్చ చేసింది. బ్రూక్లిన్ లో తన కన్సర్ట్ ముగిసిన అనంతరం న్యూయార్క్ లోని వన్ ఓక్ క్లబ్బుకు 22 ఏళ్ల బీబర్ వెళ్లాడు. అక్కడ హిప్ హాప్ సింగర్ డిజినర్ ప్రదర్శన ఇస్తున్నాడు. అతను పాడుతూ.. చిందులు వేస్తూ వేదిక మీద నుంచి దిగి.. జనంలో కలియదిరిగాడు. ఈ క్రమంలో వీఐపీ ఏరియాలో ఉన్న బీబర్ వద్దకు అతను దూసుకెళ్లాడు. అతని వద్ద చిందులు తొక్కుతూ.. అతని కాళ్లను పలుసార్లు తొక్కాడు. దీంతో చిరాకుపడ్డ బీబర్ అతన్ని గట్టిగా తోసేశాడు. ఇది చిన్నపాటి గొడవకు దారితీసి..క్లబ్బులో రభస చేసింది. బాగా జనంతో నిండిన క్లబ్బులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా హాలీవుడ్ గాసిప్ వెబ్ సైట్ టీఎంజెడ్ పబ్లిష్ చేసింది. ప్రస్తుతం ర్యాపర్ కేన్ వెస్ట్ బృందంలో పనిచేస్తున్న 19 ఏళ్ల డిజినర్ ను వెంటనే అక్కడి నుంచి భద్రత మధ్య తరలించారు.డిజినర్ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేయడంపై క్లబ్బులోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ గొడవపై బీబర్ ఇంతవరకు స్పందించలేదు. -
ఇది దేవుడి దయే: బీబర్
లాస్ ఏంజెల్స్: పాప్ సెన్సేషనల్ జస్టిన్ బీబర్‌కు అవార్డుల పంట పండింది. బీబర్ అందుకున్న అవార్డుల్లో ఒకటి మేల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అయితే ఇంకొటి బెస్ట్ ఫ్యాన్ ఆర్మీ ప్రైజ్.. దీంతో గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీబర్‌కు ఊరట లభించింది. కాలిఫోర్నియాలో జరిగిన ఐ హార్ట్ రేడియో అవార్డుల ప్రధానోత్సవంలో బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గత ఏడాది చేసిన స్పిరుచ్యువల్ ఆల్బమ్ కి అందుకున్నాడు బీబర్. అవార్డును అందుకునేందుకు వేదిక పైకి వెళుతూనే.. 'థ్యాంక్స్ గాడ్! ఇప్పటివరకు చాలా కఠిన సమయాలను చూశాను. అవన్నీ ఎదుగుదలలో నేర్చుకునేందుకేనని తెలుసు' అని భగవంతుడికి ధన్యవాదాలు తెలిపాడు. ఆల్బమ్‌ల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతుండటంతో కుటుంబసభ్యులతో గడపడానికి వీలు చిక్కడం లేదని, తన చెల్లెలు, తమ్ముడు త్వరగా ఎదుగుతున్నారని బీబర్ అన్నాడు. -
ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది!
మాజీ ప్రియురాలిని ముద్దాడుతున్న ఫొటోను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే.. సహజంగా అది విమర్శలకు దారితీస్తుంది. ఆ మాజీ ప్రియురాలు కూడా సదరు వ్యక్తిపై కోప్పడే అవకాశముంటుంది. కానీ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు ఇలాంటి ఫొటోనే బాగా కలిసొచ్చింది. కొద్దికాలం కిందటే పాప్ చిన్నది సెలెనా గోమెజ్‌తో బీబర్‌కు బ్రేకప్ అయింది. ప్రణయబంధంలో చాలాకాలం పీకల్లోతు కూరుకుపోయిన ఈ జంట ఉన్నట్టుండి వేరయింది. దీంతో బీబర్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండగా, సెలెనా తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల బీబర్ ఓ చిలిపి పని చేశాడు. సెలెనాను తమకంగా పెదవులపై ముద్దాడుతున్న ఓ పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో సెలెనాకు కోపం తెప్పించకపోగా.. అతనిపై తనకున్న ప్రేమను గుర్తుచేసినట్టుంది. అందుకే వెతుక్కుంటూ మరీ సెలెనా బీబర్ కన్సర్ట్కు వెళ్లింది. బుధవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని స్టాప్లెస్ సెంటర్లో జరిగిన బీబర్ కాన్సర్ట్‌లో సెలెనా దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగింది. ప్రేక్షకుల మాదిరిగా ఓ మూలకు నిలబడి సెలెనా బీబర్ కాన్సర్ట్‌ను వీక్షించింది. బీబర్ సెలెనాను గుర్తించినప్పటికీ పెద్దగా ఉద్వేగపడలేదు. ఆమె గురించే రాసిన పలు పాటలను బీబర్ ఆలకించాడు. అన్నట్టు 2014లో దిగినట్టు భావిస్తున్న ఈ కిస్సింగ్ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల లైకులు వచ్చాయి. -
మా నాన్నకు ఎంగేజిమెంట్ అయ్యింది!
యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ సంగతి ఏమో గానీ.. అతడి తండ్రికి మాత్రం ఇప్పుడు మళ్లీ పెళ్లవుతోంది. ఎంతోకాలంగా తాను ప్రేమిస్తున్న చెల్సీ రెబెలో (28) అనే అమ్మాయితో బీబర్ తండ్రి జెరెమీ ఎంగేజిమెంట్ అయ్యింది. గత వారం సెయింట్ బార్ట్స్ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు జెరెమీ ఆమెకు ప్రపోజ్ చేశారు. తామిద్దరికీ ఎంగేజిమెంట్ అయ్యిందన్న విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోకాళ్ల మీద కూర్చుని రెబెలోకు వెడ్డింగ్ రింగ్ అందిస్తున్న ఫొటో కూడా పెట్టారు. చెల్సీ రెబెలోతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని రాశారు. జస్టిన్ బీబర్ పుట్టిన పది నెలలకే అతడి తల్లి పేటీ మాలెట్తో తనకున్న ఐదేళ్ల బంధాన్ని జెరెమీ తెంచుకున్నారు. ఆయనకు తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎరిన్ వాగ్నర్‌తో మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు'
లండన్: పాప్ సింగర్స్‌ను ఏ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోరాదని హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ అన్నాడు. ముఖ్యంగా తనను ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని, అది ఏ ఒక్కరికి మంచిది కాదని చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో తనకు స్టార్ డమ్ అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. తనను మరొకరు అనుసరించడం నచ్చదని అన్నాడు. 'నేను నిజంగా జనాలకు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపై ఏ మాత్రం నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతిసారి నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను. ఇది కొంత ఆందోళనగా అనిపించినా ఈ విషయం చెప్పక తప్పదు. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను ఎవరి సమస్యలను తీర్చగల సమర్థుడిని కాదు. నేను పర్ ఫెక్ట్ కాదు. చాలా తప్పులు చేశాను. నా ఉద్దేశం ప్రకారం మనుషులను పూజించడం అనేది మంచి పద్దతి కాదు' అని బీబర్ అన్నాడు. -
మరో మంకీపై ముచ్చటపడుతున్న సింగర్
లాస్ఏంజిల్స్: గ్రామీ అవార్డు విన్నర్, యువ పాప్ సంచలనం జస్టీన్ బీబర్వన్నీ విచిత్రమైన కోరికలు. 'సారీ' హిట్‌మేకర్ ఇప్పటికే ఓ కోతిని పెంచుకున్నాడు. కాపుచిన్ జాతికి చెందిన కోతికి 'ఓజీ మ్యాలీ' అని పేరు పెట్టి.. ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడు. అలా 2013 మార్చిలో జర్మనీకి 'మ్యాలీ'తో కలిసి వెళ్తుండగా.. అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఆ కోతిని అతడి నుంచి వేరుచేసి జూకు తరలించారు. అప్పటినుంచి పెట్ లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్న ఈ 21 ఏళ్ల సింగర్ తాజాగా మరో కోతిని పెంచుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అతని ప్రకటనపై జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కోతిని పెంచుకోవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచిస్తున్నాయి. కోతిని అతడు సరిగ్గా సంరక్షించలేడని, అందుకు బదులు ఏదైనా పెంపుడు జంతువును అతడు ఎంచుకోవచ్చునని చెప్తున్నాయి. 'మరోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. నీ ప్రైవేటు నివాసంలో కోతిని పెంచుతూ దాని అవసరాల్నీ తీర్చడం అంతగా సాధ్యం కాదు. ఇది కోతికి, నీకు ప్రమాదకరం. నీ అభిమానులను కూడా ఇబ్బందిపెట్టే అంశం.' అని నార్త్ అమెరికా ప్రిమేట్ సాంచ్యురీ అలయెన్స్ (ఎన్ఏపీఎస్ఏ) ఓ ప్రకటనలో బీబర్‌కు సలహా ఇచ్చింది. బీబర్ మాత్రం తన ఓజీ మ్యాలీ దూరమవ్వడంపై బాధ వ్యక్తంచేస్తూ.. మళ్లీ దానిని ఎలాగైన తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. లేకపోతే మరో కోతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానని చెప్తున్నాడు. -
మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!
లండన్: ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి. దేహం నిండా ఉన్న ఆ పచ్చబోట్లతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఓ టాటూను చూసి మాత్రం పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తెగ ఇదయిపోతున్నాడు. ఆ టాటూ ఎవరికంట పడకుండా దాచాలనుకుంటున్నాడు. ఇంకుతో కవర్ చేసి.. ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకూ ఆ బొమ్మ ఎవరిదంటే సింగర్ సెలెనా గోమెజ్ది. ఈ ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు బ్రేకప్ అయింది. అప్పట్లో ప్రేమగా తన చేతిపై పచ్చపొడుచుకున్న ఆ ముద్దుగుమ్మ బొమ్మను ఇప్పుడు చెరిపేయాలని బీబర్ భావిస్తున్నాడు. మాజీ ప్రియురాలి టాటూను కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు 21 ఏళ్ల బీబర్ చెప్పాడు. ఈ బొమ్మను ఇంకుతో కప్పివేయడానికి ప్రయత్నించానని, అయినా ప్రజలు ఈ పచ్చబొట్టు ఎవరిదో గుర్తుపడుతున్నారని అతను చెప్పాడు. 'వాట్ డూ యూ మీన్' ఆల్బంతో తాజాగా హిట్ కొట్టిన ఈ యువ సంచలనం ఇప్పుడు హేలీ బల్ద్విన్తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రణయ సల్లాపాల్లో మునిగి తేలుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు సింగర్ సెలెనా గోమెజ్ మాత్రం ఒంటరిగా గడుపుతూ.. తన స్నేహితురాళ్లతో వాలెంటైన్స్ డే జరుపుకున్నదట. -
'అతడు నా లవర్ కాదు'
లాస్ ఎంజిలిస్: యువ సంచలనం జస్టీస్ బీబర్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. జస్టీస్ బీబర్ తన బాయ్ ఫ్రెండ్ కాదంటూ అతని ప్రియురాలు, మోడల్ అయిన 19 ఏళ్ల హెయిలీ బాల్డ్విన్ స్పష్టం చేసింది. దాంతో పాటు రిలేషన్ షిప్స్ చాలా కఠినంగా ఉంటాయంటూ వేదాంతం చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో తమకు నచ్చినవాళ్లతో గడుపతారని, అయితే అందరూ అనుకున్నట్లుగా మేం లవర్స్ కాదని వివరించింది. యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇటీవల తన కొత్త ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలా సందర్భాల్లో కనిపించిన మాట వాస్తవమే. 21 ఏళ్ల యువ సంచలనం బీబర్.. మోడల్ అయిన హెయిలీ బాల్డ్విన్ ను ఘాటుగా ముద్దాడుతున్న ఫొటోను బ్లర్ చేసి గత నెలలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ క్లారిటీ ఇచ్చారని అభిమానులు సంబరపడ్డారు. బీబర్ కొత్త ఆల్బమ్ కంటే ఆ సింగర్ అభిమానులు ఎక్కువగా మోడల్ కు ముద్దిస్తూ దిగిన ఫొటో పోస్ట పైనే తమ దృష్టిసారించారు. సెయింట్ బార్ట్స్ గేట్ వే లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఈ జంట పాల్గొంది. ఈ ముద్దు, ముచ్చట్లు, రొమాన్స్ అన్నీ ఆ వేడుకల్లో భాగంగా వారిద్దరి మధ్య నడిచాయి. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న మరిన్ని ఫొటోలు నెట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో బీబర్ తన బాయ్ ఫ్రెండ్ కాదని మోడల్ హెయిలీ బాల్డ్విన్ అంటోంది. -
'అతనితో ఇంటర్వ్యూ చాలా వరెస్ట్'
లాస్ఏంజిల్స్: యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ప్రపంచంలో పెద్ద స్టార్ సింగర్ కావొచ్చు కానీ, అతనితో తాను చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఓ పీడకల అంటోంది చెల్సియా హండ్లర్. టీవీ ప్రజెంటర్ అయిన ఆమె 2015లో బీబర్‌ను ఇంటర్వ్యూ చేసింది. అప్పట్లో అతని వయస్సు 15 ఏండ్లే. కానీ అతను తనను ఫ్లర్ట్ (సరసమాడటానికి) చేయడానికి ప్రయత్నించాడని, దీంతో తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపింది. 'చెల్సియా లేట్లీ' షోలో భాగంగా అతన్ని చేసిన ఇంటర్వ్యూనే తన జీవితంలో చేసిన అత్యంత చెత్త ఇంటర్వ్యూ అని పేర్కొంది. 'అతను తనదైనశైలిలో గిమ్మిక్కులు చేశాడు. అతను మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తే ఓ పిల్ల ఆకతాయి అని మీరు తోసిపుచ్చవచ్చు. కానీ నాకు అతను అలా అనిపించలేదు. చాలా అసౌకర్యంగా తోచింది' అని ఆమె చెప్పింది. -
మాట తప్పిన జస్టిన్ బీబర్
లాస్ ఏంజెలెస్: పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్ పొగతాగుతూ కెమెరాకు చిక్కాడు. జనవరి 9న సాయంకాలం ఓ హోటల్ బయట సిగరెట్ కాలుస్తూ దొరికి పోయాడు. కొత్త సంవత్సరంలో స్మోకింగ్ మానేయాలని నిర్ణయించుకున్నానని చెప్పిన కొద్ది రోజులకే అతడు పొగతాగుతూ కనబడడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ధూమపానం మానేస్తున్నట్టు 'ది బెర్త్ షో' సందర్భంగా బీబర్ చెప్పాడు. 'ఇక నుంచి స్మోకింగ్ వదిలేస్తున్నా. ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు. పొగ తాగే అలవాటున్న వారిని చెడ్డవారంటారు. అలా అనిపించుకోవాలనుకోవడం నాకు ఇష్టం లేద'ని బీబర్ పేర్కొన్నాడు. ఇలా ప్రకటించిన వారం రోజులకే మళ్లీ చేతిలో సిగరెట్ తో కలిపించాడీ హిట్ మేకర్. తాను నివసిస్తున్న హోటల్ బయటే పొగతాగుతూ కనిపించాడు. అయితే బీబర్ స్మోక్ చేయలేదని హోటల్ సిబ్బందిలో ఒకరు తెలిపారు. -
జస్టిన్ బీబర్.. ఓ ఘాటుముద్దు!
యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరో సంచలనానికి తెరతీశాడు. తన కొత్త ప్రియురాలితో ఘాటు ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫొటోను స్వయంగా బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ ఫొటో బీబర్ కొత్త ఆల్బమ్ కంటే ఎక్కువ కిక్కిస్తుంది అభిమానులకి!. 21 ఏళ్ల యువ సంచలనం బీబర్..మోడల్ అయిన 19 ఏళ్ల హెయిలీ బాల్డ్విన్ ను ముద్దాడుతున్న ఫొటోను బ్లర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సెయింట్ బార్ట్స్ గేట్ వే లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఈ జంట పాల్గొంది. ఈ ముద్దు, ముచ్చట్లన్నీ ఆ వేడుకల్లోనివే. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న మరిన్ని ఫొటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు మేం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటున్న ఈ జంట ఇప్పుడు కొంత క్లారిటీ ఇచ్చినట్టే ! -
చిచ్చరపిడుగుకు యూట్యూబ్ కిరీటం
వాషింగ్టన్: 'మినీ బియాన్స్'గా పేరొందిన నాలుగేళ్ల చిచ్చరపిడుగు ఈ ఏడాది యూట్యూబ్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అదరిపోయే తన స్టెప్పులతో ఈ చిన్నారి పెట్టిన డ్యాన్స్ వీడియో 2015 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సాధించింది. ర్యాపర్ సైలెంటో పాడిన 'వాచ్ మి' పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్పులకు వీక్షకుల నుంచి అదరహో అనే రెస్పాన్స్ వచ్చింది. 'హేవన్ కింగ్'గా పేరొందిన ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 116 మిలియన్ల (16.6 కోట్ల) మంది చూశారని, ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన వీడియో ఇదేనని గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్ ప్రకటించింది. ఇక రెండోస్థానంలో నటుడు లియాన్ నీసన్ నటించిన 'క్లాష్ ఆఫ్ క్లాన్స్' వీడియో గేమ్ నిలిచింది. దీనిని 83 మిలియన్ల (8.3 కోట్ల) మంది చూశారు. 'హేవన్ కింగ్' చిన్నారి వీడియో పోల్చుకుంటే రెండోస్థానంలో ఉన్న వీడియోకు సగం వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం. యూట్యూబ్ ప్రముఖుడిగా పేరొందిన ప్రంక్‌స్టర్ రోమన్ అట్వూడ్ తీసిన 'క్రేజీ ప్లాస్టిక్ బాల్' వీడియో మూడోస్థానంలో నిలించింది. దీనిని 56 మిలియన్ల (5.6 కోట్ల) మంది వీక్షించారు. యాడ్ కౌన్సిల్ జారీచేసిన 'లవ్ హజ్ నో లేబుల్', జస్టిన్ బీబర్ వీడియో, డెలవేర్ పోలీసులు పెట్టిన 'కన్ఫెషనల్' వీడియో టాప్ వీడియోల్లో చోటుసంపాదించాయి. పదో పుట్టినరోజు జరుపుకుంటున్న యూట్యూబ్‌కు 2015 ఎంతో అద్భుతమైన సంవత్సరమని, యూట్యూబ్ అభిమానులు ఈ ఏడాది ఎన్నో వినూత్నమైన డ్యాన్సులు ప్రవేశపెట్టారని, జీవవైవిధ్యం, సమ్మిళిత అభివృద్ధి, ఆధునిక కార్లు వంటి ఎన్నో అంశాలపై యూట్యూబ్ వేదికగా చర్చించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆ మిస్టీరియస్ గర్ల్ స్పందించింది!
యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ దృష్టిని ఆకర్షించిన ఇన్స్టాగ్రామ్ మిస్టీరియస్ గర్ల్ ఎట్టకేలకు స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా తన కోసం ఆరాతీస్తుండటం, ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపు మళ్లడంతో మనస్సును ఉద్వేగ పరుస్తున్నది అని ఆమె తెలిపింది. ఇన్స్టాగ్రామ్ లో 'వోల్ఫీసిండీ' పేరిట కనిపించిన ఆమె ఫొటో చూసి జస్టిన్ బీబర్ ఫిదా అయిపోయాడు. చూడచక్కని సొగసైన కళ్లతో అచ్చం రష్యా మోడల్ ఇరినా ష్యెక్ లా ఉన్న ఈ అమ్మాయిని చూసి 'ఓమై గాడ్! ఎవరు ఈమె? ఎక్కడ ఉంటుంది?' అంటూ ఆయన తన అకౌంట్ లో ఆరా తీశారు. ఆమె గురించి వివరాలు ఏమైనా తెలిస్తే తనకు తెలియజేయాలని అభిమానులను కోరారు. దీంతో అందరి కళ్లు ఈ సుందరిపైనే పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి ఆరా తీయడం మొదలైంది. దీంతో చాలామంది బీబర్ మహిళ అభిమానులు 'మేమే ఆ అమ్మాయి' అంటూ ఆయనకు నకిలీ మెసెజ్ లు పెట్టారు. దీంతో బీబర్ కొంత కలత కూడా చెందాడు. ఈ నేపథ్యంలో సిండీ కింబర్లీ పేరుతో ట్విట్టర్ లో ఓ అమ్మాయి ఉంటుందని, ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సెల్ఫీలు పెడుతుందని అభిమానులు ఆరా తీసి కనుకొన్నారు. చివరకు 'వోల్ఫీ సిండీ' పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్పందించింది. తన ఆచూకీ గురించి అందరూ ఆరాతీయడం భావోద్వేగానికి గురిచేస్తున్నదని, దీని గురించి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని పేర్కొంది. తనకు ఇన్స్టాగ్రామ్, టంబ్లర్ లో మాత్రమే అకౌంట్లు ఉన్నాయని, ట్విట్టర్ లో గతంలో ఉన్న అకౌంట్ ను డియాక్టివేట్ చేశావని, మిగతా సోషల్ వెబ్ సైట్లలో తన గురించి ఉన్న అకౌంట్లన్నీ నకిలీవని ఆమె స్పష్టం చేసింది. 'వోల్ఫీ సిండీ' పేరుతో టంబ్లర్ లో ఉన్న అకౌంట్ లో ఆమె వయసు 17 ఏళ్లు అని ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఇదేపేరుతో ఉన్న అకౌంట్ కు 2.50 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. -
చప్పట్లు సరిగ్గా కొట్టలేదని కచేరి ఆపేశాడు!
పాప్ యువ సంచలనం జస్టిన్ బీబర్ మరోసారి వింతగా ప్రవర్తించాడు. తాను పాడుతున్నప్పుడు.. ఆ బీట్‌కు అనుగుణంగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టలేదనే వింత కారణంతో ఈ సింగర్ మధ్యలోనే మ్యూజిక్ కన్సర్ట్ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో నివ్వెరపోవడం ప్రేక్షకుల వంతయింది. గత నెల 28న స్పెయిన్‌లో జస్టిన్ బీబర్ సంగీత కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. గతంలోనూ ఓసారి ఇదేవిధంగా పెద్దగా కారణాలు లేకుండానే జస్టిన్ బీబర్ మధ్యలోనే కన్సర్ట్ ఆపేశాడు. స్పెయిన్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌లో జస్టిన్ 'వాట్ డూ యూ మీన్' పాటపాడుతూ.. పాట బీట్‌కు అనుగుణంగా చప్పట్లు కొట్టమని ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అతను ఇలా రెండు, మూడుసార్లు చెప్పి.. కనీసం మీరు బీట్‌కు అనుగుణంగా చప్పట్లు కొట్టడం లేదు.. ఆపండి అంటూ ప్రేక్షకులపై అరిచాడు. ఇంకా నేనెందుకు పాడాలి అనుకున్నాడేమో పాట మధ్యలోనే అతను వేదిక దిగిపోయాడు. -
కొత్తటాటూతో యువ పాప్ స్టార్
లాస్ ఎంజిల్స్: హాలీవుడ్ ప్రముఖ యువ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఓ కొత్త టాటూతో ముందుకొచ్చాడు. ఈసారి తాను కొత్తగా విడుదల చేయనున్న ఆల్బం పేరుతో పచ్చబొట్టుపొడిపించుకున్నాడు. 'పర్పోజ్' పేరిట బీబర్ కొత్త ఆల్బం రూపొందించాడు. అయితే, ఇలా, టాటూలు వేయించుకోవడం జస్టిన్ బీబర్‌కు కొత్తేం కాదు. తాను ఆల్బం విడుదల చేసిన ప్రతిసారి దాని పేరిట తన ఒంటిపై టాటూ వేయించుకోవడం అతడికి ఓ సరదా. తాను రూపొందించిన ఆల్బంను ఎంత ప్రేమిస్తానో అనే విషయం ఈ టాటూ ద్వారా చెప్తాడని అంటుంటారు. తొలిసారి విడుదల చేసిన బిలీవ్ అనే ఆల్బం పేరిట టాటూను 2012లో కుడిచేతిపై వేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఆల్బంలకు సంబంధించి హిప్స్ పై వేయించుకొని విమర్శలపాలయ్యాడు. కానీ నెలలు తిరగకుండానే మరో నెలలో నవంబర్ 13న పర్పోజ్ ఆల్బం విడుదల కానుండగా దానిని తన బొడ్డుపై భాగంలో రివర్స్‌లో ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొని చర్చల్లో నిలిచాడు. -
'లిప్ టూ లిప్ కిస్ పెట్టబోయింది'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ఓ అమ్మాయి షాక్ ఇచ్చింది. ఓ కార్యక్రమానికి హాజరైన అతడి పెదాలపై ఓ అమ్మాయి బలవంతంగా ముద్దుపెట్టుకోబోయింది. దీంతో తొలుత అవాక్కయిన అతడు తర్వాత తేరుకుని ఆమెను తన చెంపలపై ముద్దు పెట్టేందుకు అనుమతించి అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఇప్పటికే తన పాప్ గీతాలతో హాలీవుడ్ ప్రపంచంలో యువకులను హుషారెత్తించే బీబర్ అంటే అక్కడి యువతకు మహా పిచ్చి. ఇతడు మంచి అందగాడు కావడంతో అమ్మాయిలు తెగ ఇష్టపడిపోతుంటారు. లాస్ ఎంజెల్స్‌లో తన ఫ్యాన్స్‌తో చిన్న కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ఒకమ్మాయి బీబర్ ను ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో దూరం జరిగిన ఆయన నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నావా? అయితే లిప్ టు లిప్ కుదరదు.. చెంపపై మాత్రం పెట్టవచ్చు అని చెప్పాడు. దీంతోపాటు తన అభిరుచులను ఫ్యాన్స్‌కు చెబుతూ తనకు కాటన్ క్యాండీ, తుల్సా ఐస్ క్రీంలు అంటే ఇష్టమని, ఓక్లామా తనకు ఇష్టమైన టూరింగ్ స్పాట్ అని తెలిపారు.