-
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
సీమా హైదర్ కేసులో కొత్త మలుపు?
తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల కార్యకర్త ఒకరు పాక్‌లోని కరాచీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సీమా, సచిన్ మీనాల కేసును ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీరిని నోయిడా పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత 2023 జూలైలో ఈ జంటను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాటు రబుపురా ప్రాంతంలో రహస్యంగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె పిల్లలందరూ ఏడేళ్లలోపు వారే. సీమా, మీనాలను గత ఏడాది జులై 4న అరెస్టు చేసిన స్థానిక కోర్టు జూలై 7న వారికి బెయిల్ మంజూరు చేసింది. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గల జాకోబాబాద్‌కు చెందిన సీమా హైదర్ కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా గత ఏడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో సీమా భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. కాగా పాక్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ, సీమా భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఈ నేపధ్యంలో తాము భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటార్నీని పంపామని తెలిపారు. మానవ హక్కుల కార్యకర్త బెర్నీ ఒక ట్రస్ట్‌ను కూడా నడుపుతున్నారు. ఇది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురయిన పిల్లలను వెదికేందుకు పనిచేస్తుంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలకు సాయం అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. కాగా సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది. కాగా గులాం హైదర్ వాదన బలంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మత మార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు. సీమ ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని, వారు చిన్న వయస్సులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని, కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్‌కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు. భారతదేశంలోని సీమా హైదర్, సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని, దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు. -
వేధింపుల కేసులో భారతీయ అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు?
అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ డిపార్ట్మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితుని స్కూల్లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు. భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి, కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్‌కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్‌కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్‌లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్‌లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్‌లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
క్వాష్ పై బాబు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలేనా ?
-
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీం కోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించండి జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
చంద్రబాబు స్కాంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..!
-
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
హైకోర్ట్ తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపట్టు: రేవంత్
-
చంద్రబాబు తీర్పుపై ఉత్కంఠ
-
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు
-
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందో?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించి డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నాటి సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నోట్ల రద్దు అంశంపై రెండు వేర్వేరు తీర్పులుంటాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చే ఈ తీర్పులు ఏకీభవిస్తాయా, భిన్నంగా ఉంటాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ధర్మాసనంలో వీరితోపాటు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఉన్నారు. -
బిగ్ క్వశ్చన్ : సుప్రీం తీర్పుపై ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
-
అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు
కొచ్చి: గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్ కింద 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గర్భిణీ స్తీకి చట్టబద్దంగా విడాకులు తీసుకున్న లేదా వింతంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను ప్రెగ్నెన్సీని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్ తాను డిగ్రీ చదువుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొంది. వివాహం అనంతరం తన భర్త ఆమె తల్లి కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌గా ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరిచండమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ వీజీ అరుణ్ వింతంతువు లేదా చట్ట బద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టంలోకి గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో మార్పులు సంభవించిన మహిళలను కూడా చేరుస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాదు సదరు పిటిషనర్‌కి గర్భం తొలగించుకునేందుకు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు) -
ఆరేళ్ళ బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
-
న్యాయమైన ప్రయత్నం!
మరణశిక్షపై మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. ఒకే అంశానికి సంబంధించి ఒక్కో కేసులో ఒక్కో రకమైన తీర్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతి పెద్ద శిక్షల విధింపుపై ఆలోచన మొదలైంది. మరణశిక్ష తీర్పుల విషయంలో నిర్ణీత నియమాలు ఏర్పరిచే అంశాన్ని సుప్రీమ్ కోర్టు తనకు తానుగా చేపట్టి, అయిదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించింది. మరణశిక్షపై వాదనలు ఎప్పుడు, ఎలా వినాలనే దానిపై పరస్పర విరుద్ధ తీర్పులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ తెలిపింది. ఆలోచించి, అత్యంత సంయమనంతో విధించాల్సిన ఉరిశిక్షను నేరం రుజు వైన రోజే ప్రకటిస్తున్న కోర్టులు, కేసులు ఇప్పుడు అనేకం. అందుకే, శిక్ష పడ్డ వ్యక్తికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పద్ధతుల్లో మార్పు కోసం సుప్రీమ్ చేపట్టిన ఈ చర్య కచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఇప్పటికి 42 ఏళ్ళ క్రితం 1980లో బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం మరణశిక్షను సమర్థిస్తూనే, ‘అత్యంత అరుదైన’ సందర్భాల్లోనే ఉరిశిక్ష వేయాలంటూ రక్షణ కవచం ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాలలో అది ఎంత సమర్థంగా అమలైందంటే అనుమానమే. అరుదైన సందర్భాలంటే ఏమిటనే దానికి ఎవరి వ్యాఖ్యానం వారిది కావడమూ దానికో కారణం. తీవ్రవాద కేసుల్లో తప్ప మిగతావాటిలో మరణశిక్ష విధించరాదంటూ, 2015 నాటి లా కమిషన్ నివేదిక ఏకంగా ఉరిశిక్ష రద్దుకు సిఫార్సు చేసింది. ఇప్పటికే 144కి పైగా దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. భారత్‌లో మాత్రం దీనిపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. అంతకన్నా విచిత్రమేమిటంటే – కొద్దికాలంగా మన దగ్గర మరణశిక్ష తీర్పులు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అటు పూర్తి ఉరిశిక్ష రద్దుకూ, ఇటు ప్రతి చిన్న నేరానికీ ఉరిశిక్ష విధించే దూకుడుకూ మధ్య సమతూకం అవసరం. ఉరిశిక్ష విధింపునకు సంబంధించిన విధివిధానాలకు మరింత కట్టు దిట్టం చేసి, అంతటా ఒకే రకమైన ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం తప్పనిసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఏకరూప నియమావళిని రూపొందించే పనిని సుప్రీమ్ భుజానికి ఎత్తుకుంది. కులం, మతం, వర్గం లాంటి దుర్విచక్షణ ఉరిశిక్ష విధింపుపైనా ప్రభావం చూపుతోందనేది నిష్ఠురసత్యం. ఇది వివిధ అధ్యయనాల మాట. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన నేర సంస్కరణల అనుకూలవాద బృందం ‘ప్రాజెక్ట్ 39ఏ’ 2016లో 385 మంది ఉరిశిక్ష ఖైదీల వివరాలను విశ్లేషించింది. ఉరిశిక్ష పడ్డవారిలో 76 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలవారే. ఇక, నాలుగింట మూడొంతుల మంది ఆర్థికంగా వెనకబడ్డవారు. ఒక వర్గంపై సమాజంలో ఉండే చిన్నచూపు మరణశిక్ష విధింపులోనూ కొనసాగుతోందనిపిస్తోంది. ఇక, 2020లో ఆ బృందమే జరిపిన మరో అధ్యయనంలో ఇంకొక చేదునిజం బయటకొచ్చింది. 2000కూ, 2013కూ మధ్య ఢిల్లీలో కింది కోర్టులు 80 ఉరిశిక్షలు విధించగా, తర్వాత హైకోర్టులో 60 శాతానికి పైగా కేసుల్లో ఆ శిక్ష తగ్గడమో, రద్దవడమో జరిగింది. సమాజంలోని భావావేశాలు సైతం కొన్నిసార్లు ఉరిశిక్ష విధింపునకు దారి తీస్తున్నాయట. ఇలా వివిధ ప్రభావాలు, కోర్టు కోర్టుకూ తీర్పులు మారి పోవడంపై ఇప్పటికైనా నిజాయతీగా దృష్టి పెట్టి, సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నిజానికి, ముంబయ్ 26/11 దాడి, 2001లో పార్లమెంట్‌పై దాడి, ‘నిర్భయ’ లాంటి తీవ్రమైన కేసుల్లోనే నేరస్థులకు ఉరిశిక్ష అమలవుతోంది. కానీ, దిగువ కోర్టులు ఏటా పదులకొద్దీ కేసుల్లో ఉరి శిక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పించే భారత శిక్షాస్మృతిలోని 302వ సెక్షన్, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా), పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలకు సంబం ధించిన ‘పోక్సో’ చట్టం వగైరాలను అవసరానికి మించి అతి చొరవతో చేతుల్లోకి తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని విమర్శ. సంపన్న వర్గాలతో పోలిస్తే ఆర్థికంగా నిరుపేదలకు నాణ్యమైన న్యాయసేవలు అందవనేది జగద్విదితం. అలాంటి సందర్భంలో మరణశిక్ష పడ్డ అమాయకులు కోర్టులో తమ వాదనను సమర్థంగా వినిపించుకోలేక అన్యాయమైపోతున్నారు. అందుకే, సర్వోన్నత న్యాయ స్థానం సైతం నేరస్థుడి సామాజిక నేపథ్యం, వయస్సు, విద్యార్హతలు, కుటుంబ పరిస్థితులు, మానసిక స్థితి, శిక్షానంతర ప్రవర్తన లాంటివన్నీ చూడాలంటోంది. ఆ కీలక అంశాలను బట్టి నింది తుడికి ఉరిశిక్ష అమలుపై నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టులకు నొక్కి చెబుతోంది. ఆ అంశాల రీత్యా నిందితుడికి శిక్షలో ఉపశమన చర్యలు అందించే వీలు పరిశీలించాలనేదే భావం. చాలా సందర్భాల్లో సుప్రీమ్ మార్గదర్శకాల స్ఫూర్తిని దిగువ కోర్టులు అక్షరాలా పాటిస్తున్నాయ నుకోలేం. ఇప్పటికీ రాజద్రోహం లాంటి కాలం చెల్లిన చట్టాలపై సుప్రీమ్ చూపిన మార్గంలో దిగువ కోర్టులు వెళుతున్నట్టు లేదు. ఐటీ చట్టంలోని ‘సెక్షన్ 66ఏ’ లాంటివి సుప్రీమ్ కొట్టేసినా, కింది కోర్టు లకు అది పట్టినట్టు లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షల విధింపునకు స్పష్టమైన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడమే కాక, దిగువ కోర్టుల్లోనూ అది అమలయ్యేలా చూడాలి. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ, ఒక్క అమాయకుడికైనా శిక్ష పడకూడదనేది అంతటా అంగీకరించే న్యాయసూత్రం. ఉరిశిక్ష పడుతున్న ఖైదీల విషయంలో అది అమలు కావాలంటే, నింది తుడి తరఫు వాదనలూ సాకల్యంగా వినాలి. అందుకు న్యాయబద్ధమైన అవకాశమిస్తూ, మార్గదర్శ కాలు రూపొందించే ప్రయత్నమే ప్రస్తుతం జరగనుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మేలు. -
ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు తీర్పు
ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్ 8వ తేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ.. కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు తన తీర్పులో ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరిస్తూ.. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది. A single-judge bench of the Punjab and Haryana High Court upheld a minor's marriage, ruling that Muslim girls can marry of their own free will at 16. Read more: #ITCard #Muslims #Punjab #Haryana #HighCourt #News #India (@sardakanu_law @mewatisanjoo) pic.twitter.com/JGQsPpdcD5 — IndiaToday (@IndiaToday) June 20, 2022 ఇది కూడా చదవండి: మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ -
అబార్షన్ చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
వాషింగ్టన్: అబార్షన్ హక్కులపై అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు వాషింగ్టన్ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టారు. తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు. లీకైన ముసాయిదాలో ఏముందంటే.. అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగా లేదని లీకైన డాక్యుమెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. అబార్షన్ హక్కులపై తీర్పు లీకైన సమాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం కొందరు సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. చదవండి: నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్ -
10 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించనున్న నాంపల్లి కోర్టు
-
అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో నేడు తుది తీర్పు
-
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్‌పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022