-
సైన్స్ ఫిక్షన్లో...
అమెరికన్ నటుడు మహర్షెల్లా అలీ ఇక ఆకాశవీధిలో విహరించనున్నారట. మార్క్ ముండెన్ దర్శకత్వంలో హాలీవుడ్లో ‘సావరిన్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అలీ అంగీకరించారు. 21ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్, ఈ వన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఇందులో లీడ్ యాక్టర్‌గా ప్రతిభావంతుడైన మహర్షెలా అలీ దొరికినందుకు హ్యాపీగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన నిక్ మేయర్ తెలిపారు. ‘ఏ క్వైట్ ప్లేస్’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన స్కాట్ బేక్, బ్రియాన్ వుడ్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారట. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘గ్రీన్‌బుక్’లోని నటనకు గాను మహర్షెల్లా ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘మూన్లైట్’కి ఇదే విభాగంలో అవార్డు అందుకున్నారాయన. -
భలే చాన్సులే...
హాలీవుడ్లో సూపర్ హీరో సినిమాలకు ఫుల్ క్రేజ్. సూపర్ మేన్లే కాదు ఉమెన్ సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు ఆడియన్స్. గాల్ గోడాట్ హీరోయిన్గా గతేడాది రిలీజ్ అయిన సూపర్ ఉమెన్ ఫిల్మ్ ‘వండర్ ఉమెన్’ కూడా బాక్సాఫీస్‌ని భరతనాట్యం ఆడించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ‘వండర్ ఉమెన్ 1984’ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్యాటీæ జెనిక్స్. ఈ సూపర్ ఉమెన్ సినిమాలో వండర్ఫుల్ చాన్స్ కొట్టేశారు బాలీవుడ్ హీరోయిన్ సౌందర్యా శర్మ. ‘మీరుతియా గ్యాంగ్స్టర్స్, రాంచీ డైరీస్’ వంటి సినిమాల్లో కనిపించారు సౌందర్య. ప్రస్తుతం బాలీవుడ్లో బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి ఏకంగా హాలీవుడ్ చాన్స్ అంటే మాటలు కాదు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ లాంటి యాక్టర్స్ హాలీవుడ్‌కి హాయ్ హాయ్ చెబుతుంటే ఈ లిస్ట్‌లోకి సౌందర్య కూడా చేరారు. ‘‘కల నిజమైనట్లుగా ఉంది. ఇలాంటి పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను’’ అన్నారు సౌందర్య. ఈ సీక్వెల్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
కొత్త జాబ్!
ఇక్కడున్న ఫొటోలో తూకం వేయడానికి పచ్చి మిరపకాయలను తీసుకుంటూ పిచ్చి చూపులు చూస్తోన్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టే ఉంటారు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గాయం చేసిన అదా శర్మనే ఇలా కూరగాయలు అమ్మే అమ్మాయిగా మారారు. ఏదైనా కొత్త సినిమాలో డీ–గ్లామరస్ రోల్ చేస్తున్నారా? అంటే ఇంకా లేదు. డైరెక్టర్స్‌కు నచ్చితే చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆమెకు హాలీవుడ్ నుంచి చాన్స్ వచ్చిందట. అందుకే ఇలా లుక్ టెస్ట్ చేస్తున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అదా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన ‘1920’ హిందీ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి వచ్చారు అదా. ఆ తర్వాత సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారిపోయారు. ప్రస్తుతం తమిళంలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో కమాండో సిరీస్ థర్డ్ పార్ట్‌లో అదా హీరోయిన్గా సెలక్ట్ అయ్యారని బాలీవుడ్ టాక్. మరి..ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే ఆమె కెరీర్ మరో స్టెప్ పైకి వెళ్తుంది. ఈ తరం ఫేమస్ స్టార్స్‌లో ఇప్పటివరకు ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, రీసెంట్గా రాధికా ఆప్టే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లో నటించారు. మరి.. అదా కూడా వెళ్తారా? అనేది తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
అమెరికాలో సత్తా చాటుతున్న తెలుగు తేజం
-
అప్పట్లో ఒకడుండేవాడు
ఏదైనా కథ చెప్పాలంటే అనగనగా లేదా అప్పట్లో ఒకడుండేవాడు అని మొదలుపెడతాం. హాలీవుడ్ డైరెక్టర్ క్వెంటిన్ టరంటినో కూడా తన లేటెస్ట్ కథను ఇలానే చెప్పబోతున్నారు. బ్రాడ్ పిట్, ఆల్ పాచినో, లియోనార్డో డికాప్రియో ముఖ్య తారలుగా దర్శకుడు క్వెంటిన్ రూపొందించనున్న చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’. 1969 కాలంలో ఫేడవుట్ అయిపోయిన టీవీ సిరీస్ యాక్టర్, అతని బాడీ డబుల్ సర్వైవ్ అవ్వడానికి పడ్డ స్ట్రగుల్ ఏంటో ఈ సినిమాలో చూపించదలిచారట క్వెంటిన్. ఫేడవుట్ అయిన హీరోగా బ్రాడ్ పిట్, బాడీ డబుల్ క్యారెక్టర్లో లియొనార్డో డీ కాప్రియో నటించనున్నారు. 2019లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రక్తం ధారలై ప్రవహించకపోతే రుచించని క్వెంటిన్ ఒక ఫెయిల్డ్ యాక్టర్ జీవితాన్ని ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. -
32 ఏళ్ల తర్వాత..!
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ‘టాప్ గన్’ పట్టుకున్నారు. ఆయన గన్ పట్టుకోకుండా ఉన్న మూవీ ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. మరి.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా గన్ పట్టుకోవడం ఏంటీ? అని ఆలోచించకండి. అందుకనే కదా ‘టాప్ గన్’ అన్నాం. టోనీ స్కాట్ దర్శకత్వంలో 1986లో టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన చిత్రం ‘టాప్ గన్’. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ‘టాప్‌గన్ 2’ను స్టార్ట్ చేశారు. ఈ సీక్వెల్‌కు జోసెఫ్ కొసిన్సి్క దర్శకత్వం వహిస్తారట. ‘టాప్‌గన్’లో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టిన టామ్ క్రూజ్ ఇప్పుడు లేటెస్ట్ వెపన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్’ వచ్చే నెల 27న రిలీజ్ కానుంది. -
హాలీవుడ్లో లుంగీ డ్యాన్స్
‘ఆల్ ది రజనీ ఫ్యాన్స్...’ అంటూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూవీలో షారుక్ ఖాన్ లుంగీ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లుంగీ డ్యాన్స్ హాలీవుడ్ సినిమాలోనూ రిపీట్ కానుంది. విన్ డీజిల్ ‘ట్రిపులెక్స్’ సినిమాలో లుంగీ డ్యాన్స్ పాటతో ఎండ్ చేయాలనుకుంటున్నారట దర్శకుడు డిజే కరుసో. ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో దీపికా పదుకోన్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో భాగంలో దీపికా పదుకోన్ భాగం కారట. అందుకే ఇండియన్ ఫ్యాన్స్ నిరాశ పడకుండా దర్శకుడు లుంగీ డ్యాన్స్ ప్లాన్ రెడీ చేశాడు. ‘‘ట్రిపులెక్స్ నాలుగో పార్ట్‌ను లుంగీ డ్యాన్స్‌తో ఎండ్ చేయాలనుకుంటున్నా. ఆ పాటను దీపికా లీడ్ చేస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది కదూ’’ అని పేర్కొన్నారు దర్శకుడు. చివర్లో దీపికా లుంగీ డ్యాన్స్‌తో అలరిస్తారన్న మాట. -
ముందే చూడండి.. జురాసిక్ వరల్డ్ వచ్చేస్తోంది..!
‘జురాసిక్ వరల్డ్ :ఫాలెన్ కింగ్డమ్’ సినిమా కోసం ప్రపంచమంతటా సినిమా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్ 22న విడుదలవుతోందీ సినిమా. అంటే అటూ ఇటుగా ఇంకో నెలంత టైమ్ ఉంది. అంతవరకూ ఎదురుచూడక తప్పదు! కానీ వినండి.. సరిగ్గా వినండి.. జూన్ 22వరకూ ఈ హాలీవుడ్ సినిమాను చూడటానికి యూఎస్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూడాలి. మనం.. అంటే ఇండియన్ సినిమా ప్రేక్షకులం రెండు వారాల ముందే జురాసిక్ వరల్డ్‌ను హ్యాపీగా చూసుకోవచ్చు. అంటే జూన్ 7నే జురాసిక్ వరల్డ్ ఇండియాలో థియేటర్ల ముందుకు వచ్చేస్తోంది. గత మూడు దశాబ్దాలుగా జురాసిక్ పార్క్ సినిమాలకు, డైనోసర్ జంతువుకు ఇండియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. దీన్ని మనం ఒక హాలీవుడ్ సినిమాగా చూడకుండా ఇండియన్ సినిమానే అన్నట్టుగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా అభిమానుల టైమింగ్స్, సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, మనకు సమ్మర్ పూర్తయ్యే టైమ్‌కి జురాసిక్ వరల్డ్‌ను తీసుకొచ్చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న మేజర్ మార్కెట్స్‌లో ఇండియా ఒకటి. అందుకే హాలీవుడ్‌కు ప్రధాన మార్కెట్ అయిన యూఎస్‌లో కంటే రెండు వారాల ముందే ఇక్కడ సినిమా వచ్చేస్తోంది. గతంలోనూ ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కోసం హాలీవుడ్ సినిమాలను ఒక రెండు వారాలు ముందుగానే విడుదల చేయడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ కూడా ఈ బాట పట్టడం ఇండియన్ ఫ్యాన్స్‌కు పెద్ద న్యూస్. ఈ మధ్యే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో ఒక బాక్సాఫీస్ బెంచ్‌మార్క్ సాధించిపెట్టిన ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ (సుమారు 220 కోట్ల రూపాయలు)ను జురాసిక్ వరల్డ్ దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. 300 కోట్ల మార్క్ వరకూ ఈ సినిమా వెళ్లొచ్చని కూడా అనుకుంటున్నారు. 2015లో విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టిన ‘జురాసిక్ వరల్డ్’కు సీక్వెల్ ఈ ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేస్తోన్న ఈ సినిమాకు జె.ఎ. బయోనా దర్శకుడు. క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. జురాసిక్ పార్క్ ఫ్యాన్స్.. ఆలస్యం చేయకండి.. ముందే చూసేయండీ సినిమాను మరి.. అమెరికా కంటే ముందే..!! -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
‘2001ఏ స్పేస్ ఒడిసీ’.. స్టాన్లీ కుబ్రిక్స్ ప్రపంచానికి అందించిన అద్భుతం అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ అయి 50 సంవత్సరాలవుతున్నా ఇంకా సినిమాటిక్ హై ఇస్తూనే ఉంది. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్‌లో బెస్ట్ అంటూ చాలామంది డైరెక్టర్స్ కితాబు ఇచ్చిన ఈ సినిమా నాకు నచ్చలేదు అంటున్నారు ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కెమరూన్. ‘స్పేస్ ఒడిసీ’ ఎందుకు నచ్చలేదో కెమరూన్ వివరిస్తూ ‘‘2001 ఏ స్పేస్ ఒడిసీ’ సినిమా అంటే ఎప్పటికీ ఎనలేని ప్రేమ. కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని లైక్ చేయలేకపోతున్నాను. కుబ్రిక్స్ తీసిన ఈ మాస్టర్‌పీస్ నా మీద ఎనలేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆర్ట్ వర్క్ ఫామ్‌లో ఆ సినిమా మీద గౌరవం ఉంది. కానీ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లోపించింది. ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పరంగా ఈ సినిమా అంటే నాకు చాలా అభిమానం’’ అని ఆయన పేర్కొన్నారు. నచ్చింది అంటూనే నచ్చలేదూ అంటున్న కెమరూన్ ధోరణి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా అనిపిస్తుందంటున్నారు హాలీవుడ్ సినీప్రియులు. -
టార్చర్ అనుభవించా!
డకోటా జాన్సన్. ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ఫిల్మ్ సిరీస్ పేరు చెప్పగానే ఈ స్టార్ పేరే ముందు వినిపిస్తుంది. హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాల్లో మెయిన్ లీడ్‌గా నటించిన డకోటా జాన్సన్, ఇప్పుడు హాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా జానర్లో ‘ఫిఫ్టీ షేడ్స్’ ఒక బ్లాక్‌బస్టర్ అటెంప్ట్. తాజాగా ఈ సినిమాలకు పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటూ జాన్సన్ తన బాధలు చెప్పుకుంది. ‘అబద్ధం చెప్పట్లేదు. ఈ సినిమా ఒక రకంగా నన్ను చావగొట్టింది.’ అందామె. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో రొమాన్స్‌కు పెద్దపీట వేసిన ఈ అడల్ట్ డ్రామాలో ఒక్కో సీన్లో జాన్సన్ పాత్ర ఒక్కో రకమైన ఎమోషన్‌తో నడుస్తుంది. ఇవన్నీ ఆమెను మెంటల్‌గా విపరీతంగా డిస్టర్బ్ చేశాయట.ఇదే విషయాన్ని చెప్పుకొని పై మాటలు అంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ సిరీస్ పూర్తయ్యాక అందులో నుంచి బయటపడ్డానికి థెరపీకి వెళ్లాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ థెరపీ పూర్తయ్యాక అంతా సెట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ‘నాకు నచ్చిన పాత్రలు చేద్దామంటే అవకాశాలు రావట్లేదు. అందుకే నేనే ఆ అవకాశాలను సృష్టించుకోబోతున్నా..’ అంటూ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలుపెడుతున్నట్లు చెప్పుకుంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ పాపం ఎంతపేరు తెచ్చిందో, అన్నే కష్టాలు కూడా తెచ్చిపెట్టింది ఈ హాట్ భామకు!! -
డేంజరస్ డైనోసర్...
‘‘ఈ భూమ్మీద జీవించిన అతి భయంకరమైన జంతువు ఇది’. ఆ జంతువును బంధించి పెట్టారు. ఒక పెద్ద గదంత పెద్దగా ఉంది ఆ జంతువు. హీరో అందులో ఉన్నాడు. అతని భార్యా పక్కనే ఉంది. ఆ జంతువు వాళ్లను చూసింది. గట్టిగా అరిచింది. పట్టుకునేందుకు గాండ్రిస్తూ తిరిగింది. అంతే తిరుగులేని యాక్షన్ అడ్వెంచర్‌కు మూలం దొరికేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! ఆ జంతువు పేరు డైనోసర్. దశాబ్దాలుగా అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడుతూ వస్తున్న వారికి డైనోసర్ గురించి, జురాసిక్ పార్క్ గురించీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జురాసిక్ పార్క్‌కు రీబూట్లాగా జురాసిక్ వరల్డ్ సిరీస్ ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో కొత్త సినిమా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. జూన్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు, మూడు ట్రైలర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా, తాజాగా ఫైనల్ ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమా ఎలా ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ స్పష్టంగా తెలియజేస్తోంది. దర్శకుడు జె.ఎ.బయోనా, జురాసిక్ పార్క్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని, వాళ్లను ఆకర్షించే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కోరుకునే వారికి ఈ సినిమా పండగే అని తెలుస్తోంది. పిల్లలు, అడ్వెంచర్స్ ఇష్టపడే పెద్దలూ జురాసిక్ వరల్డ్ కోసం, ఈ ట్రైలర్ విడుదలయ్యాక ఇంకా పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ డేంజరస్ డైనోసర్ మనల్ని ఎలా భయపెడుతుందో, ఆకట్టుకుంటుందో చూడాలి!! -
అవెంజర్స్ ఎదుర్కోబోయే సూపర్‌విలన్ థానోస్
యంసీయు (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్)లో చాలా తక్కువ టైమ్‌లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న సూపర్ విలన్ థానోస్. ఇదివరకు ‘గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రన్స్’ సినిమాల్లో కనిపించారు. అది కూడా పూర్తి స్థాయి పాత్రలో కాదు... కేవలం లిమిటెడ్ రోల్లో కనిపించారు. కానీ, ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’లో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నారు థానోస్. అవెంజర్స్ అందరూ కలిసి ఈ విలన్ ఆకృత్యాలను అడ్డుకొని అతని మీద ఎలా గెలిచారన్నది ఈ సినిమా కథ. థానోస్ క్యారెక్టర్ గురించి కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ ప్లే చేసిన క్రిస్ ఈవన్ మాట్లాడుతూ – ‘‘అవెంజర్స్ ఎదుర్కోబోయే అతి పెద్ద సూపర్‌విలన్ థానోస్. అవెంజర్స్ ఫ్యాన్స్‌కు, థానోస్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉండబోతోంది. ఆ క్యారెక్టర్‌తో తలపడటాన్ని మేమెంతో ఎంజాయ్ చేశాం. అందరు సూపర్ హీరోస్ కలిసి ఒకే సినిమాలో కనబడటం మార్వెల్స్లో బెస్ట్ థింగ్’’ అని పేర్కొన్నారు. ‘అవెంజర్స్–ఇన్ఫినిటీ వార్’ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్లో థానోస్ క్యారెక్టర్‌కు హీరో రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పడం విశేషం. -
కబురు వచ్చింది
ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు రాధికా ఆప్టే. పరిసర ప్రాంతాలను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. ఓ సినిమా కోసం. అందులో ఆమె గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఒక యుద్ధ రహస్యాలను సేకరించే పని చేయనున్నారు. ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారామె. హాలీవుడ్లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్ పిల్చెర్ దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఉమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ఇందులో స్టానా కాటిక్, సారా మేగాన్ థామస్‌లతో పాటు రాధికా ఆప్టే నటించనున్నారు. లైనస్ రోచే, రోసిఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు అమ్మాయిలను స్పైలుగా ఫ్రాన్స్ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు వార్ సీక్రెట్స్‌ను ఎలా సేకరించారు? ఈ మిషన్‌లో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? అన్నదే సినిమా కథనంగా ఉంటుందట. వైర్లెస్ ఆపరేటర్‌ను యూజ్ చేయడంలో మంచి ప్రతిభ ఉండి, ఇండియన్ యాక్సెంట్ ఉన్న నూర్ ఇనయాత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే కనిపించనున్నారు. హిందీ, తమిళ, తెలుగులోనూ నటించిన రాధికాకు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కబురొచ్చిందన్నమాట. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు రాధికా ఆప్టే. ముందు ముందు ఇంకెంతమందో? -
బ్లాక్ పాంథర్‌లో పాండ్యా అదరగొట్టాడట!
సాక్షి, స్పోర్ట్స్ : హాలీవుడ్ ‘బ్లాక్ పాంథర్’ మూవీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టడం ఏంటని అనుకుంటున్నారా? పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు కదా! ఈ సినిమాలో అతనేందుకుంటాడనే సందేహం కలుగుతోందా? అవును పాండ్యా ఈ సినిమాలో ఏం నటించలేదు. టీ20 సిరీస్‌లో ఈ ఆల్‌రౌండర్ బిజీగా ఉన్నాడు. కానీ నెటిజన్లు ఈ సినిమాలో పాండ్యా నటించినట్లు సృష్టించారు. బ్లాక్ పాంథర్‌లో విలన్ పాత్ర పోషించిన మైఖేల్ బి జోర్డాడన్తో పాండ్యాను పోలుస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులిప్పుడు ట్రెండ్ అయ్యాయి. మైఖేల్ బి జోర్డాన్ హెయిర్ స్టైల్ పాండ్యా హెయిర్ స్టైల్ పోలిక ఉండటంతో అతని పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పాండ్యా నువ్వు అదుర్స్' అని ఒకరు ట్వీట్ చేస్తే.. "హాలీవుడ్ మూవీలను నేను పెద్దగా చూడను.. కానీ బ్లాక్ పాంథర్‌లో హార్దిక్ నటన మాత్రం అద్భుతం" అంటూ మరొకరు ట్వీట్ చేశారు. హెయిర్ స్టైల్, హావభావాలు, లుక్స్ సినిమాకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి అని ఇంకొదరు ట్రోల్ చేస్తున్నారు. ఇక పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు 93 పరుగులు మినహా అంతకు మించి పాండ్యా బ్యాట్‌కు పనిచెప్పలేదు. ఇటు బౌలింగ్లోను అంతగా రాణించడం లేదు. దీంతో మాజీ క్రికెటర్లు, సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. Hardik Pandya Was Lit In Black Panther🔥 pic.twitter.com/6FgJCiGygr — Preeyesh Babaria🇮🇳 (@Preeyesh07) 19 February 2018 -
లెక్కలు తిరగ రాస్తోంది!
బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. బ్లాక్‌పాంథర్.. హాలీవుడ్ సినిమా అభిమానులు వారం రోజులుగా ఈ సినిమా జపం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడం, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 18వ సినిమా కావడం, కెప్టెన్ అమెరికాలో సూపర్ అనిపించుకున్న బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ సినిమాగా రావడం, భారీ బడ్జెట్, భారీ రిలీజ్, సూపర్ రివ్యూలు.. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి మామూలుగా అన్ని సూపర్ హీరో సినిమాలకు, అన్ని పెద్ద స్టూడియోలు తీసే సినిమాలకూ ఉండే హంగామానే! బ్లాక్పాంథర్కు వీటన్నింటికీ మించి ఒక ప్రత్యేకత ఉంది. హాలీవుడ్లో ఒక రివల్యూషన్ ఇది. మెయిన్ లీడ్ చాద్విక్ బోస్మన్ సహా దాదాపు యాక్టర్స్ అంతా నల్లజాతివాళ్లు కావడమే ఆ ప్రత్యేకత. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ కూడా నల్లజాతీయుడే! ఒక నల్లజాతీయుడు సూపర్ హీరో క్యారెక్టర్‌గా సినిమా రావడం ఇదే మొదటిసారి. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం నల్లజాతీయులే ఉన్నా, కేవలం ఆడవాళ్లే ఉన్నా ఆ సినిమాలు పెద్దగా ఆడవన్న ఒక సెంటిమెంట్ ఉంది. ఇలాంటి సెంటిమెంట్లన్నీ బ్రేక్ చేస్తూ ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి అటూ ఇటుగా 200 మిలియన్ డాలర్లు (సుమారు 1300 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇండియాలో బ్లాక్‌పాంథర్ వసూళ్లు అదిరిపోయేలా ఉన్నాయి. లాంగ్ రన్లో సూపర్ హీరో సినిమా జానర్లో బ్లాక్‌పాంథర్ కొత్త రికార్డులే నెలకొల్పనుంది. -
హాలీవుడ్‌కి హలో
హీరోలంటే కేవలం నటనకే పరిమితం కాదని మంచు మనోజ్ ప్రతీసారి నిరూపిస్తున్నారు. మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటు చేసుకున్నారు మనోజ్. న టుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, స్టంట్ మాస్టర్‌గా.. ఇలా ప్రతీ సినిమాకు తనలో ఏదో ఒక కొత్త కోణాన్ని అభిమానులకు చూపిస్తున్నారు మనోజ్. ‘నేను మీకు తెలుసా’ సినిమాలో స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకోవడంతో పాటు ‘కన్ను తెరిస్తే జననమేలే’ పాటను కూడా రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘బిందాస్, కరెంట్ తీగ, వేదం, మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో తన పాత్రకు తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకున్నారు. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయాను...’ అని సరదాగా గొంతు కూడా సవరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మ్యూజిక్ డైరెక్టర్‌గా మరో కొత్త అవతారం ఎత్తారు మనోజ్. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్‌కి హలో చెబుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ బ్రీ లార్సన్ లీడ్ యాక్టర్‌గా నటించిన హాలీవుడ్ మూవీ ‘బాస్మతీ బ్లూస్’కి సంగీత దర్శకుడిగా మారారు మనోజ్. తన స్నేహితుడు, సంగీత దర్శకుడైన అచ్చుతో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో లక్ష్మీ మంచు ఓ కీలక పాత్ర పోషించారు. -
మార్వెల్ అద్భుతం.. బ్లాక్‌పాంథర్!
మార్వెల్ కామిక్స్ తవ్వుతూ పోతే ఎక్కడ తేలతామో ఎవ్వరికీ తెలీదు. అంతటి చరిత్ర ఉంది మార్వెల్ కామిక్స్‌కు. ఇందులో స్టాన్లీ సృష్టించిన బ్లాక్‌పాంథర్ పాత్ర 1966లో మొదటిసారి కామిక్స్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత అప్పట్నుంచి ఎన్ని సూపర్‌హీరో క్యారెక్టర్స్ సినిమాకెక్కినా, బ్లాక్‌పాంథర్ మాత్రం 2016 వరకూ తెరమీదకు రాలేదు. 2016లో ‘కెప్టెన్ అమెరికా : సివిల్ వార్’లో కనిపించే వరకూ బ్లాక్‌పాంథర్ పుస్తకాలకే పరిమితమైంది. ఇక ‘కెప్టెన్ అమెరికా’తో సూపర్ అనిపించుకున్న ఈ సూపర్ హీరో ఇప్పుడు తాజాగా మళ్లీ మెప్పించేందుకు సిద్ధమైంది. అదీ ఫుల్ లెంగ్త్ సూపర్ హీరో ఫిల్మ్ రూపంలో! ‘బ్లాక్‌పాంథర్’ పేరుతోనే తెరకెక్కిన ఈ కొత్త సూపర్ హీరో సినిమా ఫిబ్రవరి 16న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ వీకెండ్‌కే ఈ సినిమా 120 మిలియన్ డాలర్లు (సుమారు 760 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చద్విక్ బోస్మన్ బ్లాక్‌పాంథర్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. 2016వరకూ బ్లాక్‌పాంథర్ స్క్రీన్ మీదకు ఎందుకు రాలేకపోయింది? అని ఎవరైనా అడిగితే, మార్వెల్ స్టూడియోస్ వంద సాకులు చెప్తోందట. ఏదైతేనేం ఇప్పటికైనా వచ్చిందని సూపర్‌హీరో ఫ్యాన్స్ మాత్రం ఆల్ హ్యాపీ!! -
కొత్త టీజర్.. అజాతశత్రు సాహసయాత్ర
సాక్షి, సినిమా : సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం టీజర్ వచ్చేసింది. ‘ద ఎక్స్టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రంలో ధనుష్ లీడ్ రోల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. చిత్ర అనుభవాలను దర్శకుడు వివరిస్తుండగా.. ఓ బైట్‌ను విడుదల చేశారు. దీనిని ధనుష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. అజాతశత్రు లావాష్ పటేల్ పాత్రలో ధనుష్ ఇందులో కనిపించబోతున్నాడు. ముంబైకి చెందిన ఈ కుర్రాడికి లోకజ్ఞానం తెలీదు. ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచి ఉండలేని పటేల్ కొన్ని పరిస్థితుల రిత్యా ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కునే పరిస్థితులు.. సాహసాలు, మధ్యలో ప్రేమ కథ ఇలా సాగుతోంది సినిమా. ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు దర్శకుడు కెన్ స్కాట్ వివరించాడు. ధనుష్ లాంటి నటుడితో పని చేయటం నిజంగా మంచి అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు. ధనుష్ సరసన బెరనైస్ బెజో, అలెగ్జాండ్రా దడారియోలతో నటించారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్' పుస్తకం ఆధారంగా కెనడియన్ స్క్రిప్ట్ రైటర్ కమ్ డైరెక్టర్ కెన్ స్కాట్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, లిబియాలో షూటింగ్ జరుపుకుంది. వివిధ దేశాలకు చెందిన టెక్నీషియన్స్ పనిచేసినట్టు దర్శకులు తెలిపారు. మే 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తోపాటు ఫ్రెంచ్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. ధనుష్ ఎవరో తెలీదు... డైరెక్టర్ ఈ సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ కెన్ స్కాట్ ధనుష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధనుష్ అంటే తనకు ముందు ఎవరో తెలీదని ఆయన చెప్పారు. ‘ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూశాను. అప్పుడే ధనుష్ ని చూశానని.. ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించింది. ధనుష్ ఓ మంచి నటుడే కాదు. మేధావి కూడా.. ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై ఓ అభిప్రాయానికి వస్తాడు. సినిమాకు అతనే బలమని నా ఉద్దేశం. ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్‌లో ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయి అని తెలిపారు. -
వాలంటైన్స్ డే స్పెషల్ వచ్చేస్తోంది
అదొక సూపర్‌హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజ్. సూపర్‌హిట్ అనేకంటే అందరూ మాట్లాడుకునే, చర్చ పెట్టే, గొడవ పెట్టే ఫిల్మ్ ఫ్రాంచైజ్. రెండు సినిమాలొచ్చాయి ఇప్పటికి ఈ ఫ్రాంచైజ్‌లో! ఈ రెండు సినిమాలనూ ఇటు ఇగ్నోర్ చెయ్యలేరు.. అటు పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యనూలేరు. ఎరోటిక్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికైతే పండగే. యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయో, రొమాన్స్ అదే రేంజ్లో ఉంటుంది. ‘ఫిఫ్టీ షేడ్స్’ ఫిల్మ్ ఫ్రాంచైజ్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే (2015), ఫిఫ్టీ షేడ్స్ డార్కర్ (2017) రెండు సినిమాలే బాక్సాఫీస్ వద్ద దాదాపు బిలియన్ డాలర్ వసూళ్లు (సుమారు 6,500 కోట్ల రూపాయలు) రాబట్టాయి. తాజాగా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌లో మూడో సినిమా ‘ఫిఫ్టీ షేడ్స్ ఫ్రీడ్’ విడుదలవుతోంది. గత రెండు సినిమాల్లానే ఇది కూడా వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. కాకపోతే వాలెంటైన్స్ డేకి ఐదు రోజులు ముందుగానే.. అంటే ఫిబ్రవరి 9నే! ‘ఫిఫ్టీ షేడ్స్’ సిరీస్‌లో ఇది చివరి సినిమా అని ముందే అనౌన్స్ చేశారు కాబట్టి అభిమానులకు ఒక రకంగా ఇది స్పెషల్ సినిమా. అందుకు తగ్గట్టే ఇప్పట్నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోతున్నాయి. ఓపెనింగ్ వీకెండ్‌కే 40 మిలియన్ డాలర్లు (సుమారు 255కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఈసారి యాక్షన్‌కు పెద్దపీటే వేశారట. ట్రైలర్ చూస్తే అభిమానులు ఈ సినిమా నుంచి కోరుకునే అంశాలకు కొదవే లేదని స్పష్టమైపోతోంది. డకోతా జాన్సన్, జేమీ డోర్నన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జేమ్స్ ఫోలే దర్శకుడు. మరి 2015, 2017లో వాలెంటైన్స్ డే సెలెబ్రేషన్స్‌ను రెట్టింపు చేసిన ‘ఫిఫ్టీ షేడ్స్’ ఈసారి కూడా మెప్పిస్తుందా? చూడాలి!! -
మొత్తం కథే మారిపోయింది!
కెవిన్ స్పేసీ.. హాలీవుడ్ సినిమా అభిమానికి పరిచయం అక్కర్లేని పేరు. అవార్డులు, రివార్డులు, గొప్ప సినిమాల్లో నటించిన పేరు, గొప్ప నటుడన్న ప్రశంసలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, దర్శకులు తమ సినిమాలో ఆయన ఉంటే దానికి ఒక స్థాయి వస్తుందనుకునేలా తెచ్చుకున్న గౌరవం.. ఒక్కసారే ఇవన్నీ ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుందంటే విచిత్రంగా కనిపిస్తుంది కానీ, చిత్రంగా అదే నిజం!! హాలీవుడ్లో కొన్ని నెలలుగా బయటపడుతోన్న సెక్స్ స్కాండల్స్‌లో కెవిన్ స్పేసీ పేరు కూడా ఉంది. అక్టోబర్ 30న నటి ఆంతోని రాప్ ఒక ఇంటర్వ్యూలో గతంలో కెవిన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని చెప్పింది. ఆ రోజు నుంచే హాలీవుడ్ కెవిన్‌ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న టీవీ సిరీస్ ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ను మధ్యలోనే ఆపేశారు. ఈ ఏడాది ఆయనకు ఇవ్వాల్సిన ఎమ్మీ అవార్డునూ ఈ ఉదంతంతో వెనక్కు తీసేసుకున్నారు. ఇక వీటన్నింటికంటే మించి, రిడ్లీ స్కాట్ తన ‘ఆల్ ది మనీ ఇన్ ద వరల్డ్’ సినిమాలో కెవిన్ నటించిన సన్నివేశాలన్నీ తీసేసి, క్రిస్టఫర్ ప్లమ్మర్ను అదే పాత్రకు తీసుకోవడం గురించి చెప్పుకోవాలి. క్రిస్మస్ కానుకగా సోమవారం విడుదల కానున్న ఈ సినిమాలో కెవిన్ స్పేసీ ఉన్నాడన్న పేరుతోనే మొదట ప్రచారం జరిగినా, చివరి నెలలో కెవిన్ సన్నివేశాలన్నీ తీసేసి, ప్లమ్మర్‌తో రీషూట్ చేశారు. ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. విశేషమేంటంటే ప్లమ్మర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడం! కెవిన్ మిస్ చేసుకున్న పేరే కదూ!! ఒక ప్రముఖ నటుడు, అదీ అవార్డ్ విన్నింగ్ నటుడు, ఇలా ఒక సినిమాలో నటించడం, ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినా అవి తీసేసి వేరొక నటుడిని తీస్కోవడం.. పెద్ద అవమానమే! ఆ అవమానానికి కారణం స్వయంగా కెవినే! ఎంతటి నటుడైనా సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు పాల్పడితే పట్టే గతి ఇదని కెవిన్ ఉదంతమే చెప్పేస్తోంది!! -
స్టార్‌వార్స్ జస్ట్ ఓకే
హాలీవుడ్లో ‘స్టార్‌వార్స్’కు ఉన్న క్రేజ్ మరే ఇతర సిరీస్‌కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్‌లో బాక్సాఫీస్ వద్ద ‘స్టార్ వార్స్’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్ వార్స్’ సీక్వెల్ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్ వార్స్ : ది లాస్ట్ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో టాప్‌లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్‌వార్స్’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్‌వార్స్’ రేంజ్ కాదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్‌లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది. -
సమ్మర్లో సూపర్ హీరోల హంగామా!
‘స్పైడర్’ సినిమాలోని ‘బూమ్ బూమ్’ పాట గుర్తుందిగా? ‘గుర్తుంది సరే! హాలీవుడ్ సినిమా న్యూస్‌లోకి మహేశ్ ఎందుకొస్తాడు?’ అనేగా మీ డౌట్! అక్కడే ఉంది అసలు విషయం. ‘బూమ్ బూమ్...’ పాటలో ‘మార్వెల్ కామిక్సే వీణ్ని చూసినాక రాశారేమో!’ అనే లైన్ గుర్తుందిగా? మార్వెల్ కామిక్స్ అంత పాపులర్ మరి! ఆ కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన సినిమాలూ అంతే! సూపర్ హీరోలంతా ఓ దగ్గర చేరి చేసే హంగామా నుంచి పుట్టిన ‘అవెంజర్స్’కు మార్వెల్ కామిక్స్‌లో, సినిమాల్లో ఓ సెపరేట్ క్రేజ్ ఉంది. అవెంజర్స్ సిరీస్‌లో ‘ది అవెంజర్స్’ (2012) ‘ది అవెంజర్స్ – ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ (2015) సినిమాలకు సీక్వెల్‌గా 2018లో ‘అవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ అనే సినిమా వస్తోంది. ట్రైలర్‌తో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ ‘అవెంజర్స్’ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మే 4, 2018న సినిమా విడుదలవుతోంది. అంటే.. మనకు సరిగ్గా సమ్మర్ టైమ్. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని మనమే ముందు చూడబోతున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 27న ఇండియాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆంథోని, జాయ్ రుస్సో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాబర్ట్ డొనీ, జాష్ బొర్లిన్, మార్క్ రఫాలో తదితర స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
భయానికి తాళమేస్తారా?
ప్రేక్షకులు తాళమేశారు... తమకు తెలియకుండానే ‘ఇన్సిడియస్’ సిన్మాలొచ్చినప్పుడు భయపడుతూ, సిన్మా బాగుందంటూ తాళమేశారు! ‘ఇన్సిడియస్’ అంటే ‘తెలియకుండానే ఆవహించిన’ అని అర్థం! ఆ పేరుతో వచ్చిన మూడు సిన్మాలు హర్రర్ లవర్స్‌కు టెర్రర్ చూపించాయి. సిన్మా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు తెలియకుండానే వాళ్లలో భయం ఆవహించేసింది. ఇప్పుడీ ఫ్రాంచైజీలో చివరిది, నాలుగోది ‘ఇన్సిడియస్: ద లాస్ట్ కీ’ రెడీ! వచ్చే ఏడాది జనవరి 5న విడుదల కానుంది. ట్రైలర్లో మ్యాగ్జిమమ్ కథేంటో చెప్పేశారు. లిన్ షయే (ఎలైజ్ రైనీర్) అనే ముసలామె చిన్నప్పుడు నివసించిన ఇంట్లో పారానార్మల్ ఫినామినా (అతీత శక్తులు/దెయ్యాలు) గురించి ఎలా ఇన్వెస్టిగేట్ చేసిందనేది కథ. ఈ క్రమంలో ఆమెకు చిన్నప్పటి ఘటనలు గుర్తొస్తాయి. ఒంటరిగా చీకట్లో చూస్తే భయపెట్టేలా ఉందీ సిన్మా ట్రైలర్! కానీ, హర్రర్ సిన్మా ప్రేమికుల్లో చిన్న బాధ. లాస్ట్ కీతో ‘ఇన్సిడియస్’కి తాళమేస్తారా? ఇక, ఈ భయానికి తలుపులు వేసేస్తారా? అని!! -
హాలీవుడ్లో దక్షిణాది నటుడు
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీప్, కన్నడనాట స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ విలక్షణ నటుడ్ని మరో అద్భుత అవకాశం వరించింది. ఓ హాలీవుడ్ సినిమాలో సుధీప్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆస్ట్రేలియన్ దర్శకుడు ఎడ్డీ ఆర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైసెన్ అనే ఆంగ్ల చిత్రంలో సుధీప్ నటిస్తున్నాడు. సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లోనే సుధీప్ కనిపించటంతో హాలీవుడ్ సినిమాలో తమ అభిమాన నటుడిది కీలక పాత్ర అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో సుధీప్ న్యూయార్క్ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమెరికన్ స్టార్ హీరోయిన్ నికోలే స్కాల్మో హీరోయిన్ గా నటిస్తోంది. సాండల్‌వుడ్‌లో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న సుధీప్ ఈగ సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో కలిసి విలన్ అనే సినిమాలో నటిస్తున్న సుధీప్, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లోనూ కీలకపాత్రలో నటించనున్నాడు. -
అక్టోబరులో హాలీవుడ్‌కు..
తమిళసినిమా: నటుడు శింబుది సపరేట్ భాణీ. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేర్కొనే శింబు మరో రికార్డును సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అభిమానులు శింబుకు పోటీగా భావించే నటుడు ధనుష్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా శింబు కూడా అదే మార్గంలో పయనించడానికి సిద్ధం అయ్యారు. వ్యత్యాసం ఏమిటంటే ధనుష్ హీరోగా హాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంటే, శింబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. రెండు నెలల్లో తన చిత్రాన్ని విడుదల చేస్తానని శింబు ఆ మధ్య వెల్లడించారు. అందులో పాటలు ఉండవు, ఇంటర్వెల్ ఉండదు అని చెప్పారు గానీ అది హాలీవుడ్ చిత్రం అని తెలపకుండా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశారు. ఆయన చెప్పినట్లుగా అయితే ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లాల్సింది. కొందరు ప్రముఖ సాంకేతిక వర్గం ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల హాలీవుడ్ చిత్ర ప్రారంభం ఆలస్యం అయ్యిందని శింబు తాజాగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న దర్శకుడు గౌతమ్‌మీనన్ తన ధ్రువనక్షత్రం చిత్ర షూటింగ్‌తోనూ, కెమెరామెన్ సంతోష్‌శివన్ స్పైడర్ చిత్రంతోనూ బిజీగా ఉండటం వల్ల తన హాలీవుడ్ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం జరిగిందని చెప్పారు. ప్రస్తు తం వాళ్లు ఫ్రీ అవుతుండటంతో అక్టోబరులో హాలీవుడ్ చిత్రం ప్రారంభం కానుందని తెలిపారు. డిసెంబరు చివర్లోగా చిత్రాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఆంటోనీ ఎడిటింగ్, యువన్ శంకర్రా జా నేపథ్యం సంగీతం అందించనున్నారని తెలిపారు.