-
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
మాయ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్పోజింగ్ డ్రెస్లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు. ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది. మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి. అసలిదేమిటి? వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది. ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే.. నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడంమందుల్లేవు, థెరపీనే మార్గం..వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు. అతి గారాబమూ కారణమే..కొన్ని కుటుంబాలలో హెచ్పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు. హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎలాగంటే..రోజూ వ్యాయామం చేయడం తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది హెచ్పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!) -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్‌లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త!
కూరలను బాగా నూనె పోసి వేయించి ఉప్పూకారం మసాలా దట్టించినందువల్ల నోటికి రుచిగా ఉండచ్చేమోగాని ఆ కూరలలోని పోషక విలువలన్నీ చచ్చిపోయి నిస్సారమవుతాయి. త్వరగా జీర్ణం కావు. నూనె ఎక్కువైనందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం రావటం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతంగా ఉడకబెట్టినా అంతే... సారం లేని పదార్థాన్ని తిన్నట్టే. అది తినడం వల్ల ఆ ఆహారం మన ఒంటికి పట్టదు. అసలు మనం ఎలాంటి కూరలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం వంటబట్టాలంటే నూనెలో వేయించిన కూరలను తినే అలవాటును మానుకోవాలి. ఉడికించిన కూరలలో కొద్దిగా తాలింపు వేసుకుని తినే విధంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు అన్నింటిలోను అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. వాటి మోతాదుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అందువల్ల మనకు అన్నీ అవసరమే. అయితే అన్నీ అందరికీ ఒకే రీతిలో అవసరం కావు. ఉదాహరణకు పాలు తాగే పసిపిల్లలకు ఒకరకమైన పోషకాలు కావాలి. చిన్న పిల్లలయితే మరొక రకమైన పోషకాలు కావాలి. యుక్తవయస్కులకు ఇంకొక రకం పోషకాలు కావాలి. అదేవిధంగా గర్భిణులకు ఒక రకమైన పోషకాలు, పెద్దవారికి, వృద్ధులకూ మరొక రకమైన పోషకాలూ కావాలి. అంటే అవసరాలనుబట్టి పోషకాలు మారతాయి. కాబట్టి తీసుకోవలసిన ఆహారం కూడా మారుతుంది. అదే విధంగా ఆహార చికిత్సా ప్రక్రియలో కూడా వ్యాధిని బట్టి, రోగిని బట్టి తీసుకోవలసిన ఆహారం మారుతుంది. ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఇదే.నిజానికి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అనుకున్నంత తేలికకాదు. పోషకాలను బట్టి పరిశీలిస్తే గింజధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని, ఆకు కూరలు, పండ్లు, దుంపలతో సహా బాదం, ఖర్జూర మొదలైన ఎండు ఫలాలలో ఏదో ఒక పోషక విలువ లోపించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. కేవలం ఈ కారణం వల్ల గింజధాన్యాలను మాత్రమే తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.అవి త్వరగా జీర్ణంకావు. అందువల్ల, గింజధాన్యాలతోబాటు తప్పనిసరిగా త్వరగా జీర్ణం అయ్యే ఆకు కూరలు, పండ్లు కూడా అవసరం. ఇవి అన్నీ తెలిసినప్పుడే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం సులభం అవుతుంది. ఈ విషయంలో మనలో చాలామందికి ఉన్న సాధారణ ఆహార విజ్ఞానం సరిపోదు. పోషకాహార నిపుణులతో లేదా ప్రకృతి వైద్యులతో సంప్రదించి, వారి సలహా తీసుకోవటం అవసరం.సమీకృత ఆహారం.. కొన్ని సూచనలు..ఎటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని అలా ఉంచితే సాధారణ ఆరోగ్యం దృష్ట్యా ఈ కింది సూచనలను పాటించటం మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. రోజూ ఉదయం పచ్చికూర ముక్కలు (వెజిటబుల్ సలాడ్) తీసుకోవటం మంచి అలవాటు. దంతాల పటుత్వం లేని వారు కూర ముక్కలను మిక్సీలో వేసుకుని చిన్న చిన్న ముక్కల రూపంలోగాని, లేక జ్యూస్ రూపంలోగాని తీసుకోవచ్చు. అన్నిరకాల, అన్ని రంగుల పండ్లను లేదా పళ్లరసాలను తీసుకోవాలి. ఆ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఫలాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో కనీసం 30 లేక 40 శాతం పండ్లు ఉంటే మంచిది. దంపుడు బియ్యం లేక మర పట్టని ముతకబియ్యం శ్రేష్ఠం. చిరుధాన్యాలు వాడటం మంచిది. మొలకెత్తిన గింజలు, కొబ్బరి, ఖర్జూర ప్రతిరోజూ తీసుకోవటం మంచిది.ఇలా తీసుకోవాలి..కనీసం వారానికి నాలుగు రోజులు ఆకుకూరలను ఇగురు లేదా పప్పు రూపంలో తీసుకోవాలి.కాఫీ, టీ తాగే అలవాటును నెమ్మదిగా మానుకోవటం మంచిది, అలా మానుకోవడం సాధ్యం కాకపోతే, కనీసం మోతాదును తగ్గించాలి. రోజుకి ఒకటి లేక రెండుసార్లకు మించి తీసుకోరాదు.పొగాకు, జర్దా, ధూమపానం, మత్తుపానీయాలను పూర్తిగా మానుకోవాలి.కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన, నిల్వ ఉన్న బేకరీ వస్తువులు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), చాక్లెట్లు, ఫాస్ట్ఫుడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది.ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే, మన శరీరానికి అవసరమైనంత ఉప్పు మనం తీసుకునే పండ్లు, కూరగాయలలోనే ఉంటుంది.ఆహారం ఎంపికలో మరొక ప్రధాన సమస్య అమ్లయుతమైన ఆహారం, క్షార యుతమైన ఆహారం, ఆమ్లాలు, క్షారాలు రెండూ మనకు అవసరమే అయినా, వాటి నిష్పత్తిలో తేడా ఉంది. ఆమ్లాల కన్నా క్షారాలు మనకు అధికంగా కావాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదేవిధంగా ఉండాలి. అంటే ఆమ్లయుతమైన పదార్థాలు తక్కువగా, క్షారయుతమైన పదార్థాలు. ఎక్కువగా ఉండే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.అదేవిధంగా రోగగ్రస్థుల విషయంలో వ్యాధినిబట్టి ఆహార ఎంపిక ఉంటుంది. ఇది. అయితే ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.ఇవి చదవండి: మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్.. -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకు చేస్తారంటే.. పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
స్మార్ట్ డివైసెస్ కంట్రోల్లో మనం చిక్కుకున్నామని.. తెలుసా!
ఇప్పుడన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నాయి.. ఇదివరకు ఫోన్.. కమ్యూనికేషన్ టూల్..! కానీ నేడు మనిషిని ఎంగేజ్ చేసే ఎంటర్టైన్మెంట్ వాల్.. అవసరమైనప్పుడు మాత్రమే కమ్యూనికేషన్.. ఎప్పుడూ ఎంటర్టైన్మెంటే!! మునుపు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఒక తెరపిగానే వినోదం ఉండేది..! ఇప్పుడు వినోదమే రోజువారీ ఒత్తిడిగా మారింది! ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్ మీద ప్లే అయిన జోక్సే.. స్మార్ట్‌ఫోన్‌కి మనం ఎంత అడిక్ట్ అయ్యామో చెబుతూ! వాటిని చూసి నవ్వుకుంటాం. కానీ అడిక్షన్ గురించి ఆలోచించం. ఎందుకంటే ఆ లిస్ట్‌లో మనం లేమని మన ధీమా! కానీ ఎవ్వరం ఈ అడిక్షన్కి అతీతులం కాదని ఒక్క క్షణం మనల్ని మనం తరచి చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ కథనం చదవబోతున్న పాఠకులకు ఒక విజ్ఞప్తి.. ఒక్క అయిదు నిమిషాలు మీ స్మార్ట్‌ఫోన్‌ను మరచిపోండి.. నోటిఫికేషన్స్ టోన్ వినబడుతున్నా పట్టించుకోకుండా! వెల్కమ్ "బ్యాక్ టు దిస్ పేజ్.. " ఉండగలిగారా అయిదు నిమిషాలు.. స్మార్ట్‌ఫోన్‌ని పట్టించుకోకుండా! కాస్త కష్టమైంది కదా! ప్రపంచాన్నంతా ఇముడ్చుకుని మన అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ ఎట్సెట్రా స్మార్ట్ డివైసెస్ మన జీవితాలను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయో కదా... జెన్ జెడ్‌కి తెలీదు కానీ మిలేనియల్స్‌కి గుర్తుండే ఉంటుంది.. ప్రైవేట్ టీవీ చానెల్స్ వచ్చిన కొత్తలో.. ఎవరైనా ఎవరింటికైనా వెళితే.. ‘రండి.. రండి..’ అంటూ పలకరించి ఆ అతిథికి గ్లాసుడు మంచినీళ్లిచ్చేంత తీరిక ఆ ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. అందరూ టీవీకి అతుక్కుపోయి కూర్చునేవారు. అంతేకాదు ప్రైవేట్ చానెళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల మోహంలో పడి.. ఇంట్లో ఇల్లాళ్లు తిండి కూడా పెట్టట్లేదు.. కమర్షియల్ బ్రేక్స్‌లోనే వంట అయినా.. తిండి అయినా అంటూ వాపోయిన కుటుంబ సభ్యులూ ఉన్నారు. ఇవీ పైన ఉదహరించిన తీరులో వారపత్రికల్లో కార్టూన్లుగా.. సినిమాల్లో హాస్య సన్నివేశాలుగా కనిపించిన దాఖలాలున్నాయి. దాన్ని మించిన వ్యసనమైంది ఈ స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ డివైసెస్ వాడకం. నిరంతర వీక్షణ స్రవంతి.. ఇదివరకు లేవగానే చాలామంది భగవంతుడి ఫొటోనో.. లేకపోతే తమకిష్టమైన కుటుంబ సభ్యుల మొహమో.. లేదంటే తమ అరచేతులను తామే చూసుకునేవారు. ఇప్పుడు లేవగానే కళ్లు మూసుకునే పడక మీద ఫోన్ వెదుక్కునే పరిస్థితి. కళ్లు తెరవగానే కుడిచేయి దంతధావనం కోసం బ్రష్ పట్టుకోవడానికి సిద్ధమవదు. చూపుడు వేలు స్మార్ట్ ఫోన్ మీద స్క్రోల్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇదివరకు న్యూస్ పేపర్ చదివితే కాని రోజు మొదలయ్యేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ స్టేటస్‌ల నుంచి స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లోని అప్డేట్స్ చూస్తేగానీ డే స్టార్ట్ అవట్లేదు. చూశాక అక్కడితో ఆగదు.. ఆ వీక్షణ స్రవంతి నిర్విరామంగా.. రాత్రి పడుకునే వేళదాకా సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి దాటినా.. ఇంకా ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. తెల్లవారి పనో.. ఆఫీస్ టాస్కో హఠాత్తుగా గుర్తొచ్చి.. బలవంతంగా నిద్రకు ఉపక్రమించాల్సిందే తప్ప ఫోన్లో వీక్షణలు చాలు అనిపించి మాత్రం కాదు. ‘డిన్నర్ రెడీ.. ’ అని అమ్మ పిలిస్తే ఎవరూ పట్టించుకోరు. అందరూ తమ సెల్‌ఫోన్ వాట్సాప్ చాట్స్‌లో నిమగ్నమై ఉంటారు. వాళ్ల వాలకం చూసి ‘డిన్నర్ రెడీ.. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే తినొచ్చు’ అని వాట్సాప్‌లోని వాళ్ల ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టగానే అందరూ చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు. ఒక అబ్బాయి రోడ్ మీద ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తుంటాడు. వెనుక నుంచి బైక్ మీద వచ్చిన ఇంకో కుర్రాడు అమాంతం అతని ఫోన్ తీసుకుని ఉడాయిస్తాడు. హాల్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉంటారు. కలసి కబుర్లు చెప్పుకోకుండా.. ఎవరికి వారే అందరూ వాళ్ల వాళ్ల ఫోన్స్‌లో నిమగ్నమై ఉంటారు. ఇంకొక ఇంట్లో.. భోజనాల వేళ.. అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని.. అందరికీ ప్లేట్స్‌లో సెల్ ఫోన్స్ సర్వ్ చేస్తుంటుంది. ఇంకో చోట.. డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా.. టేబుల్ మీదున్న బౌల్లో ఫోన్స్ పెడితే గానీ వాళ్ల కంచాల్లో అమ్మ భోజనం వడ్డించదు. ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్పీకర్ మాట్లాడుతుంటాడు. మిగిలినవాళ్లంతా ఫోన్స్‌లో జోక్స్ షేర్ చేసుకుంటూనో.. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూనో.. మీమ్స్ సెండ్ చేసుకుంటూనో.. చాట్ చదువుకుంటూనో.. యూట్యూబ్ షార్ట్స్ ఎంజాయ్ చేస్తూనో ఉంటారు! బ్రెడ్ అండ్ బటర్.. ‘ఒక్క అయిదు నిమిషాలు ఇన్‌స్టాలో రీల్స్ చూసి.. సీరియస్‌గా చదువుకుంటాను ఇక’.. ‘అబ్బ వర్క్‌తో తల వేడెక్కింది కాసేపు యూట్యూబ్ చూసి.. రిఫ్రెష్ అయితే మళ్లీ వర్క్‌లో పడొచ్చు’.. ‘పావు గంట నుంచి వాట్సాప్ చెక్ చేసుకోలేదు. ఒక్కసారి చెక్ చేసుకుని ఇంటి పనిలో పడిపోతా’ .. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఊరించేవే! ఆ అయిదు నిమిషాలు.. రిఫ్రెష్మెంట్.. చెక్ చేసుకోవడానికి అంతే లేకుండా చేస్తాయి. చూస్తున్న కొద్దీ పుట్టుకొస్తుంటాయి అక్షయ పాత్ర మాదిరి. తలాతోకా లేని విషయాల నుంచి తలలు పగలకొట్టుకునే చర్చల దాకా యూజర్స్‌ని అందులో ఎంగేజ్ చేస్తాయి. వాటి తీరే అది. అవి బతుకున్నదే వాటి మీద. ఎలాగైనా.. ఎక్కడిదాకా వెళ్లయినా సరే యూజర్స్‌ని నిమగ్నం చేయాలి. అందుకే అస్ట్రాలజీ నుంచి అంతరిక్షం దాకా.. వంటింటి చిట్కాల నుంచి పాలెస్తినా, ఇజ్రాయేల్ దాకా, రైమ్స్ అండ్ రిడిల్స్ నుంచి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం దాకా, కుల, మతాలు, కంట్రీ పాలిటిక్స్ నుంచి ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్‌ల దాకా.. కుట్లు, అల్లికలు, జడలు, మేకప్ నుంచి పారిస్ ఫ్యాషన్ దాకా.. లోకల్ స్ట్రీట్ సింగర్ నుంచి కొరియన్ పాప్ బాండ్స్ దాకా.. నెలల పిల్లల నుంచి సెంచరీకి దగ్గరగా ఉన్న వృద్ధుల దాకా.. డాన్స్, యాక్టింగ్, కామెడీ, సీరియస్, థియేటర్, సినిమా, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, మెన్, విమెన్, ఎల్జీబీటీక్యూ.. ఒక్కరేమిటీ.. ఒక్కటేమిటీ.. ఎన్నిటినో కలబెట్టడం.. ఎందరినో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చి వీక్షకులను ఏమార్చడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి బ్రెడ్ అండ్ బటర్..! 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గేమింగ్ వ్యసనంగా మారిందని వాపోతున్నారు. 70 శాతం పేరెంట్సేమో తమ పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారని భయపడుతున్నారు. – ‘బాటు టెక్’ తాజా సర్వే. ఆ నెట్‌వర్క్‌లో.. మంచినీళ్ల వసతి ఉన్నా లేకపోయినా కూల్‌డ్రింక్ ఫెసిలిటీ లేని పల్లెలు ఎలా లేవో.. ఇంట్లో సరకులున్నా లేకపోయినా స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదిప్పుడు. అంత ఎసెన్షియల్ కమొడిటీ అయిపోయింది అది. కమ్యూనికేషన్ నుంచి వాలెట్, నేవిగేటర్, న్యూస్ జర్నల్ వంటి అత్యవసరాలే కాక వినోదాన్ని పంచే సాధనంగా కూడా మారిపోయే! అలాంటప్పుడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చిక్కకుండా ఎలా ఉంటాడు మనిషి?! దైనందిన జీవితం నుంచి జ్ఞాన సముపార్జన వరకు అన్నీ.. అన్నిటికీ ఇంటర్నెట్.. దానితో అనుసంధానమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్సే సోర్స్ అయిపోయే! డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్రామం నుంచి ఇంకా సూక్ష్మంగా మార్చి అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కూర్చింది. దానికి మనిషిని నిలువెత్తు బానిసను చేసింది. ఒక రోబోలా మార్చింది. దాంతో మనిషి ప్రాక్టికాలిటీలో కన్నా డిజిటల్ వరల్డ్‌లోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రపంచంతో ఉన్న స్పర్శను కోల్పోయి.. డివైసెస్తో పెనవేసుకుపోతున్నాడు. ఒకరకంగా అవి మనిషికి అవిభక్త కవలలయ్యాయి. అవసరం కాదు వ్యసనం.. హఠాత్తుగా ఇంటర్నెట్ ట్రాఫిక్.. డిజిటల్ ట్రాఫిక్ జామ్ అయి ప్రపంచమంతా స్తంభించిపోయి.. డిజిటల్ డివైసెస్ అన్నీ స్క్రాప్‌గా మారిపోతే.. మనిషి పరిస్థితి ఏంటీ? మానసిక వైకల్యం వచ్చేస్తుందేమో! చూపుడు వేలిని గాల్లో స్క్రోల్ చేస్తూ నడుస్తాడేమో! చుట్టూ ఉన్న పరిసరాల పరిజ్ఞానం అప్పుడు మొదలవుతుందేమో! అతిశయోక్తేం కాదు.. ఆ స్థితీ ఎంతో దూరంలో లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకదా.. దేన్నయినా అవసరాన్ని మించి వాడితే దేనిమీదైనా అవసరం కన్నా ఎక్కువ ఆధారపడితే.. అది వ్యసనమే అవుతుంది. ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. చంటి పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్ ముందుంటేనే ముద్ద మింగుతున్నారు. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఉండాలి. అయితే ఆ అప్డేట్ కాలాన్నే మరచిపోనివ్వవద్దు కదా! కానీ నేటి స్టేటస్ దీనికి భిన్నంగా ఉంది. డిజిటల్ డివైసెస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌కి ఎంతలా కండిషన్డ్ అయ్యామంటే మనం చేసే ప్రతి చిన్న పనికీ అవతలి వాళ్ల లైకులు, షేర్లు, కామెంట్లతో ఆమోదం కోరుకోనేంతలా! ఇది మన పని మీద.. నైపుణ్యం మీద.. ఇందాక చెప్పుకున్నట్టు మానసిక ఆరోగ్యం మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఆందోళనకు కారణమవుతోంది. డిప్రెషన్‌కి దారితీస్తోంది. చుట్టూ ఉన్న ప్రపచంతో డిస్కనెక్ట్ చేస్తోంది. ఫాస్టింగ్.. అదే ఉపవాసం..! ఏదైనా వ్యసనంగా మారితే ఏం చేస్తాం.. డీఅడిక్షన్కి ట్రై చేస్తాం. తిండి కూడా వ్యసనమైతే కంట్రోల్ చేయడానికి మొదట డైట్ ప్లాన్ తీసుకుంటాం. అందులో ఫాస్టింగ్ని ఇన్క్లూడ్ చేస్తాం. అలాగే ఈ డిజిటల్ అడిక్షన్ని పోగొట్టుకోవడానికీ ఉపవాసం ఉంది. అదే డిజిటల్ ఫాస్టింగ్ లేదా డిజిటల్ డిటాక్స్. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ను పక్కనపెట్టి.. సోషల్‌మీడియా యాప్స్ నుంచి వారంలో ఒకరోజో.. పక్షానికి ఒకరోజో.. లేదా నెలలోనో ఇలా వీలును బట్టి బ్రేక్ తీసుకోవడమన్నమాట. ఇప్పుడు అదే ట్రెండ్.. ఇప్పుడున్న ప్రపంచానికి ఏ మంచినైనా అలవాటు చేయాలంటే దాన్ని ముందు ట్రెండ్‌గా వైరల్ చేయాలి. డిజిటల్ స్లేవరీలో అదీ ఒక భాగమే. సరే విషయానికి వస్తే.. ఇప్పుడు డిజిటల్ డీఅడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అవసరానికి తప్ప మిగిలిన సమయాల్లో.. సందర్భాల్లో డిజిటల్ డివైసెస్‌ని దూరంగా ఉంచడం.. రియల్ వరల్డ్‌తో అంటే చుట్టూ ఉన్న మనుషులు.. పరిసరాలతో మమేకం అవడం.. ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోకుండా.. స్వయంగా శోధించడం.. టెక్నికల్ సపోర్ట్‌తో కాకుండా సొంతంగా ప్రయత్నించడం.. సరికొత్త జీవన శైలిగా మారింది. ఇప్పుడు ఇదే వెల్నెస్ ట్రెండ్ అయింది. దీన్ని ప్రాక్టీస్ చేస్తోంది సెకండ్ యూత్ అనుకునేరు.. కాదు.. యువతే! ఒక పూటో.. ఒక రోజో భోజనం మానేయడానికి ఈ రోజుల్లో అంత విల్ పవర్ అక్కర్లేదు. కానీ డిజిటల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కావడానికి చాలా విల్ పవర్ అవసరం. అదంత ఈజీ కాదు. కాసేపు ఫోన్ కనిపించకపోతేనే ఊపిరి ఆగిపోతుందేమో అని గాభరాపడే ప్రాణాలు మనవి! అలాంటిది ఒక పూటో.. ఒక రోజో ఆ డివైసెస్‌కి దూరంగా.. ఇంటర్నెట్ నుంచి లాగౌట్ అవడమంటే నిజంగా సాహసమే! అందుకే మొదట్లో మాటి మాటికీ ఫోన్‌ని వెదుక్కోవాలనిపిస్తుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. ఒంటరైపోయామనే భావన వెంటాడుతుంది. వీటన్నిటినీ అధిగమించి ఉపవాస దీక్షను విజయవంతం చేసుకోవడమంటే విల్ పవర్‌కి పరీక్ష పెట్టడమే! డిజిటల్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు.. చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. పనిలో నాణ్యతా పెరుగుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే విస్తృతమైన సమాచారం ఎనలేని ఆనందాన్నే ఇస్తుండొచ్చు. కానీ అవసరం లేని అదనపు సమాచారమేదైనా మెదడుకు భారమే తప్ప పనికొచ్చే వ్యవహారంగా ఉండదు. పైగా లేనిపోని కన్ఫ్యూజన్లోకీ నెడుతుంది. అందుకే అప్పుడప్పుడూ డిజిటల్ ఫాస్టింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి పొంది రీచార్జ్ అవుతాం. రాత్రివేళల్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్ వంటివి చూడటం వల్ల వాటి స్క్రీన్ లైట్స్ కళ్ల మీద పడి.. మెదడు ఇంకా రాత్రి కాలేదేమో అనే భావనలో ఉండిపోయి నిద్రను దూరం చేస్తుంది. దాంతో సహజంగా ఉండే స్లీప్ – వేకప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్రలేమి చెంత చేరుతుంది. డిజిటల్ డివైసెస్ వ్యసనం వల్ల గనక నిద్రలేమి దరి చేరితే దానికి ఒకటే మార్గం.. ఇంటర్మిటెంట్ డిజిటల్ ఫాస్టింగ్. దీనివల్ల మంచి నిద్ర కంటికి చేరి.. ఉదయాలు ఫ్రెష్‌గా మొదలవుతాయి. ఆ రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. డిజిటల్ వరల్డ్‌కు దూరంగా ఉంటే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ను ఆలోచించడానికి మెదడు మొగ్గు చూపుతుంది. సృజన వికసిస్తుంది. ఈ రోజుల్లో.. బంధాలు, అనుబంధాలు బలహీన పడటంలో డిజిటల్ డివైసెస్దే ప్రధాన పాత్ర అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. మునుపటిలా బంధాలు బలపడి.. అనుబంధాలు వెల్లివిరిసి, స్నేహానురాగాలను ఆస్వాదించాలను కుంటే దానికి సింపుల్ వే.. డిజిటల్ డివైసెస్‌కి డైవోర్స్ ఇవ్వడమే అని చెబుతున్నారు. కుటుంబం, బంధుమిత్రులతో గడిపిన క్షణాలు.. సందర్భాలు.. ఏ డిజిటల్ మీడియం ఇవ్వలేని అసలైన వినోదాన్ని.. ఆనందాన్నిస్తాయి. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మలుస్తాయని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. మన దగ్గర 9 –17 ఏళ్లలోపు పిల్లల్లో 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువే సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గడుపుతున్నారని నిరుడు నవంబర్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎలా స్టార్ట్ చేయాలి.. ముందు ఈ డిజిటల్ వరల్డ్ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో నిర్ధారించుకోవాలి. పని మీదే ఫోకస్ చేసి.. నైపుణ్యం పెంచుకోవడానికా? ఆందోళన తగ్గించుకోవడానికా? లేదంటే కళ్లముందున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికా? ఇలా దేనికోసం డిస్కనెక్ట్ కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలిస్తేనే ఫాస్టింగ్ ఈజీ అవుతుంది. అలాగే రోజంతా ఉండాలనుకుంటున్నారా? రోజులో కొన్ని గంటలు మాత్రమే చాలనుకుంటున్నారా? ముందు గంటల నుంచి మొదలుపెట్టి.. రోజులకు పెంచుదామనుకుంటున్నారా.. అనేదాన్ని డిజిటల్ డివైసెస్ యూసేజ్.. దానికి అలవాటుపడిన తీవ్రతను బట్టి నిర్ణయించుకోవాలి. థసౌకర్యాన్ని బట్టి ఫాస్టింగ్ టైమ్‌ని నిర్ధారించుకుని వారం.. వర్జ్యం.. మీనం.. మేషం లేక్కపెట్టకుండా తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏరోజు.. ఏ పూట డిజిటల్ ఫాస్టింగ్ ఉండబోతున్నారో.. ఆ సమాచారాన్ని కుటుంబం, ఆప్తులు, సన్నిహితులు.. బాస్.. కొలీగ్స్ ఇలా మీ సర్కిల్లో ఉన్న వారందరికీ తెలియజేయాలి. మీ స్మార్ట్ ఫోన్, ఇతర డివైసెస్లోని నోటిఫికేషన్ ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయడం.. వీలైతే సోషల్ మీడియాను అన్‌ఫ్రెండ్ చేయాలి. ఇంకా కుదిరితే ఫోన్‌తోపాటు మిగతా డివైసెస్లోని సోషల్ యాప్స్ అన్నిటినీ తాత్కాలికంగా అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. భోజనం చేసేటప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు.. పని వేళల్లో స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండాలి. మాటి మాటికీ ఫోన్ చెక్ చేయాలనుకునే టెంప్టేషన్కి డిలిట్ ఫరెవర్ కొట్టేయాలి. అయినా టెంప్ట్ అవుతుంటే డిజిటల్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నామో పదే పదే గుర్తుతెచ్చుకోవాలి. సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అవడం వల్ల దొరికిన విలువైన సమయాన్ని రీడింగ్.. ఎక్సర్సైజెస్.. లేదా చిరకాల అభిరుచుల కోసం వినియోగించుకోవాలి. చేయాలనుకుని చేయలేకపోయిన.. ఎంతోకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తూన్న పనుల కోసమూ కేటాయించుకోవచ్చు. లేదా ఇతర ఆసక్తుల మీదా వెచ్చించొచ్చు. బిఫోర్ లాగౌట్.. కళ్లముందు మంచి నీటి ప్రవాహం ఉన్నా.. గుక్కెడు నీళ్లు మాత్రమే దాహాన్ని తీరుస్తాయి. వెల్లువ ఉంది కదాని దాన్ని పొట్టలో నింపేయలేం కదా! ఈ డిజిటల్ ఇన్ఫో కూడా అంతే! ఆ అజీర్తి నుంచి బయటపడేసే ఏకైక మెడిసన్ డిజిటల్ ఫాస్టింగ్. ఈ ఉపవాస దీక్షవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అన్నీ అనుకూల ప్రభావాలే! కాబట్టి.. మీ డిజిటల్ ఫాస్టింగ్ గోల్స్‌ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూడా పంచుకుని.. ఫాస్టింగ్ వైపు వాళ్లనూ ప్రోత్సహించాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న సపోర్ట్సిస్టమ్ మీ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించేలా చేస్తుంది. లక్ష్యానికీ త్వరగా చేరుస్తుంది. సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేఖ్, అమిత్ సాద్, ఇషా గుప్తా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా డిజిటల్ ఫాస్టింగ్ చేస్తుంటారు. బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా డిజిటల్ ఫాస్టింగ్‌లో ఉంటుందని వెబ్‌సైట్స్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ ఊళ్లో.. మాహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా.. వడ్గాంలో ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్థులంతా తమ ఇళ్లళ్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత గం.8.30 నిమిషాలకు మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచాన్ చేసుకుంటారు. ఈ గంటన్నరపాటు వాళ్లంతా కుటుంబంతో.. ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ.. పిల్లలను ఆడిస్తూ.. చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు రెండేళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గాంను డిజిటల్ డీటాక్స్ విలేజ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మూడు వేల వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, సుగర్ ఫ్యాక్టరీ కార్మికులే! కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరై స్మార్ట్‌ఫోన్స్ వాడటంతో.. ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు అడిక్ట్ అయ్యారట. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్లతోనే ఆడుకుంటుండంతో ఇటు చదువులోనూ.. అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యాట. పెద్దవాళ్లూ ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్లూ టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని.. పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు.. గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డిటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికీ వెళ్లి చెక్ చేసేవారట.. ఫోన్లు, టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలనివ్వడంతో.. గ్రామస్థులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైసెస్‌ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మొహితే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవి చదవండి: కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త! -
కోహ్లీ భార్య అనుష్క శర్మకు ఏమైంది..?
బాలీవుడ్ నటి అనుష్కశర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు స్టార్ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్టార్ కపుల్ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్వీట్ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో వారితో సంభాషించిన ట్వీట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. విరాట్ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్‌లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు.అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే ఏం జరిగిందనేది విరుష్క అధికారంగా ప్రకటించాల్సి ఉంది. (చదవండి: స్లిమ్‌గా మారిన టాలీవుడ్ నటుడు సురేష్! ఆయన ఫాలో అయ్యే డైట్ ఇదే..!) -
హెల్త్ టిప్స్: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
ప్రస్తుతం మనం జీవిస్తున్న శైలిలో.. ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో కూడా మార్పులు సహజమే. ఆహారపు అలవాట్ల వలన గానీ, విరామం లేకుండా శ్రమించడం వలన గానీ.. శరీరంలో బరువు పెరగడం, చర్మ సమస్యలు, గుండె జబ్బులు రావడం, రక్తపోటుతో బాధపడటం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి. బరువును అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు రాత్రి నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవాలు గుండెకు మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి. ఇవి చదవండి: 'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..! -
చలికాలంలో ఇలా ఎందుకవుతుందంటే..? కారణం ఇదే!
'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.' చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే.. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి.. చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్‌డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు. ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది. వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు. ఇవి చదవండి: వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి! -
ఉత్తరకాశీ: కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్, స్టేట్ డిజాస్టర్ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!. మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు. ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు. అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. (చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెను మార్పులకు శ్రీకారం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్ డీసీజెస్) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. సంపూర్ణ రక్తహీనత నివారణ రాష్ట్రంలో జీరో అనిమిక్ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్ సప్లిమెంటేషన్ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్ కేర్ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్ కేర్) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 45 రోజుల తర్వాత కూడా.. మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. క్యాంప్‌లలో నలుగురు వైద్యులు హెల్త్ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో గైనిక్/పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి. ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ జానకి, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకట మురళీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా... (( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. ((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి. ((3)) మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు. ((4)) గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి. ((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు. -
‘చంద్రబాబును సాగనంపే దాకా నాకేం కాదు’
సాక్షి, కృష్ణా: తాను అనారోగ్యానికి గురయ్యానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తనపై నడుస్తున్న ప్రచారంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. శునకానందం కోసమే కొందరు ఇలా చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీని ఉద్దేశించి ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారాయన. మంగళవారం విజయవాడలో మీడియాకు ఎదురైన ఆయన స్పందిస్తూ.. నేను అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల నాకేం అవ్వదు. ఐటీడీపీ ద్వారా తెలుగు దేశం పార్టీ ఇలాంటి ప్రచారం చేయిస్తోంది. ఇది ఆ పార్టీ దిగజారుడు తననానికి నిదర్శనం. కానీ, చంద్రబాబు నాయుడ్ని రాజకీయాల నుంచి.. రాష్ట్రం నుంచి ఇంటికి సాగనంపే వరకు నేను ఈ భూమ్మీదే ఉంటా.. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ ఉంటా.. అంటూ ఘాటుగా స్పందించారాయన. ఇక.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వైఖరిపైనా కొడాలి నాని స్పందించారు. వాళ్లిద్దరూ మానసిక వికలాంగులని.. వాళ్లను మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. 2024 ఎన్నికల తర్వాత వాళ్లను ఆస్పత్రిలో చేరుస్తాం అంటూ సెటైర్ వేశారాయన. ఇక.. దమ్ముంటే తనపై పోటీకి దిగాలని నారా లోకేష్‌కు విసిరిన సవాల్‌ను ఆయన ప్రస్తావించారు. సవాల్ చేసి చాలారోజులైనా లోకేష్ మాత్రం స్పందించడం లేదని కొడాలి నాని అన్నారు. ఇదీ చదవండి: స్పృహ లేకుండా మాట్లాడడం.. పవన్‌కు అలవాటే కదా! -
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
మీ బ్రెస్ట్ ఇలా ఉంటే మీరు చాలా డేంజర్ లో ఉన్నట్లే
-
పిల్లలు మానసికంగా ఎదగకపోవడానికి, అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు ఇవే
-
ఆరోగ్యాధారిత వ్యవస్థలు బలోపేతం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్వర్క్, ఎకో సిస్టమ్‌ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు. దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్‌రెడ్డి కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్‌నెస్‌ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్‌లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది
తమ ప్రాణాలను పణంగా పెట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వివిధ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో ఒక్క ముంబైలోనే 821 మంది పోలీసులు మృతి చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి సగటున రెండు, మూడు రోజులకు ఒక పోలీసు మృతి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై నిత్యం వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంటుంది. ముంబైలో నివాసముంటున్న దాదాపు కోటిన్నర జనాభాకు రక్షణ కల్పించాలంటే పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. సాధారణంగా పోలీసులపై నేరాలను నియంత్రించడం, శాంతి, భద్రతలు కాపాడటం, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించడం తదితర కీలక బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నంలో పోలీసులు తమ ఆర్యోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదనంగా కొన్ని గంటలు విధులు నిర్వహించడం, పై అధికారుల ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి కారణాలతో పోలీసులు వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలతో ఐదేళ్లలో 821 మంది పోలీసులు మృత్యవాత పడ్డారు. ఇందులో అత్యధికంగా గుండెపోటుకు సంబంధించిన వేర్వేరు సమస్యలతో 168 మంది మృతి చెందారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ముంబై పోలీసు శాఖకు చెందిన 123 మంది చనిపోయారు. ఇదే ఐదేళ్ల కాలవ్యవధిలో 31 మంది పోలీసులు ఆత్యహత్య చేసుకున్నారు. అందుకు కుటుంబ కలహాలే ప్రధాన కారణం కాగా.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో కేన్సర్, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులున్నాయి. ఆత్మహత్యల్లో ఉరేసుకోవడం, భవనం పైనుంచి దూకడం, సరీ్వసు రివాల్వర్‌తో కాల్చుకోవడం, రైలు కింద పడటం లాంటి సంఘటనలున్నాయి. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! ఎప్పుడూ చర్చల్లోనే పోలీసులు.. ముంబై పోలీసుల ఆరోగ్య సమస్య అంశం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోంది. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు ఏకంగా 821 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడినట్లు అధికారికంగా లభించిన గుణంకాలు చెబుతున్నాయి. ముంబై నగరం ఎప్పుడు ఏదో కారణంతో బిజీగా ఉంటుంది. ఒకపక్క దేశ ఆర్థిక రాజధాని, మరోపక్క రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన నిలయం కావడంతో తరుచూ వీఐపీల రాకపోకలు, రాజకీయ సభలు, సమావేశాలు, ప్రముఖుల భేటీ వల్ల వారికి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉంది. అంతేగాకండా వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తారు. అలాగే పోలీసులకు రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. కానీ ప్రత్యక్షంగా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ముంబై జనాభాతో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో పోలీసులపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా వారి ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండే ఎండలూ కారణమే.. గత రెండు నెలల నుంచి ముంబైలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం కూడా పోలీసుల ఆరోగ్యంపై పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 43 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు డ్యూటీలో ఉండగానే మృత్యువాత పడ్డారు. పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు పోలీసు సంక్షేమ శాఖ తరఫున అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు, వర్క్‌షాపులు జరుగుతుంటాయి. కానీ అడపాదడపా చేపట్టడం వల్ల అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. 2020–2022 కాలవ్యవధిలో ముంబైలోని ప్రముఖ టాటా కేన్సర్ ఆస్పత్రి 2,738 మంది పోలీసులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించింది. 2023, ఫిబ్రవరిలో 15 రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో కేవలం 325 మంది పోలీసులు పాల్గొన్నారు. అదే నెలలో యునైటెడ్ వే తరఫున ఫస్ట్ ఎయిడ్ అంశంపై శిక్షణ శిబిరం జరిగింది. సుమారు 45 వేల మంది ముంబై పోలీసుల కోసం చేపట్టిన ఈ శిబిరం సఫలీకృతం కాలేదు. -
విరాట్ కోహ్లీకి అనారోగ్యమా? మైదానంలో ఇబ్బంది పడ్డాడా? రోహిత్ క్లారిటీ..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో అద్భుత శతకంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ. 186 పరుగులు చేసి కెరీర్లో 75 శతకం నమోదు చేశాడు. అయితే కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మైదానంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడని వార్తలొచ్చాయి. నాలుగో రోజు కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అక్షర్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. కోహ్లీ అనారోగ్యం విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే అతను ఇబ్బంది పడుతున్నట్లు తనకు అన్పించలేదని, వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు ఎలాంటి అసౌకర్యంగా కూడా కన్పించలేదని చెప్పుకొచ్చాడు. ఎండను కూడా తట్టుకుని గంటలపాటు క్రీజులో ఉండి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. తనకైతే కోహ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు అస్సలు అన్పించలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ చివరి రోజు కోహ్లీ రోజంతా ఫీల్డింగ్ చేశాడు. దీంతో అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది. కానీ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. కోహ్లీ కాస్త దగ్గుతున్నాడని రోహిత్ వెల్లడించాడు. కానీ అంతమాత్రానికే అనారోగ్యంగా ఉన్నట్లు కాదు కదా అని బదులిచ్చాడు. కోహ్లీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తనకు అన్పించిందని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణమని కొనియాడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడం వల్లే సిరీస్ మనం కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశాడు. చదవండి: Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను -
షాకింగ్ విషయం బయటపెట్టిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు ఈమధ్య కాలంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడగా, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తాజాగా మరో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది. ''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటన్నది మాత్రం ఆమె పూర్తిగా రివీల్ చేయలేదు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
సోషల్ మీడియా ఎఫెక్ట్: మెదడులో డోపమైన్ హార్మోన్ రిలీజ్.. అనర్ధాలు ఇవే..
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు రిప్లయ్ ఇవ్వలేదని తను ప్రేమించిన యువతిపైనే బహిరంగంగా దాడి చేశాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 2.30 గంటలకు మించి సోషల్ మీడియా సైట్లలో గడిపేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, వారు మరో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు తమ చదువు, వృత్తి కోసం కేటాయించిన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నట్టు గుర్తించారు. సాక్షి, అమరావతి: స్మార్ట్‌ఫోన్‌లో నెట్ రాకుంటే చిరాకు.. గంటపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే విసుగు.. పోస్టులకు లైక్‌లు, షేర్లు చేస్తూ కామెంట్లకు రిప్లయ్ ఇవ్వాలన్న కోరిక.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అదో మానసిక వ్యసనమే అంటున్నారు మానసిక వైద్యులు. ఇది మద్యపాన, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటిదేనంటున్నా రు. ఈ వ్యసనంపై చికాగో యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. మన దేశంలోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు తేల్చింది. ఆన్లైన్లో విహరించేవారి మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుందని, చేస్తున్న పని పదేపదే చేసేలే ఆ హార్మోన్ ఉత్తేజపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లనే ఒక్కసారి సో షల్ మీడియా సైట్లకు అలవాటుపడ్డవారు వదలలేకపోతున్నారు. ఇది ఒకస్థాయి వరకు ఇబ్బంది లేకున్నా పరిమితి మించినప్పుడు అనర్థాలకు దారితీస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు.. అలాంటివారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెనకకు వెళ్తేనే.. ముందుకు ఆన్లైన్ సెర్చింగ్ వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ ప్రకటించకున్నా వీరికి చికిత్స అందించే థెరపిస్టులు మాత్రం పెరుగుతున్నారు. అమెరికాలో సోషల్ మీడియా వ్యసనం 20 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. మన దేశంలోనూ ఈ సంఖ్య 4.7 శాతంగా ఉండగా, ఇది వచ్చే రెండేళ్లలో మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత పిల్లల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం అధికమైంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు సైకియాట్రిస్టులకు చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమం వ్యసనానికి చికిత్స కోసం అమెరికా, యూకేల్లో డి–అడిక్షన్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కాలిఫోర్నియా న్యూపోర్టు బీచ్‌లోని మీడియా సైకాలజీ రీసెర్చ్ సెంటర్లో డ్రైవింగ్, స్విమ్మింగ్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు ముందున్న పరిస్థితికి వెళ్లాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫోన్ ను పక్కనబెట్టి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ప్రత్యేక కోర్సు డిజైన్ చేశాం.. స్మార్ట్‌ఫోన్ వ్యసనం టీనేజ్ పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అదికూడా ఇంట్లో పెద్దవారే అలవాటు చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మరీ ఎక్కువైంది. చాలామంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడే అవకాశం ఉండదని స్కూళ్లకు కూడా వెళ్లడం లేదు. నావద్దకు వచ్చే పిల్లల్లో కొందరు 7 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారున్నారు. పిల్లల్లో కార్పెల్ టెన్నల్ సిండ్రోమ్‌తో మణికట్టు దెబ్బతింటుంది. అధిక సమయం తలను వంచి ఉంచడం వల్ల డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్ వస్తోంది. ఇటీవల పిల్లల్లో కొత్తగా వర్చువల్ ఆటిజం గుర్తించారు. గత పదేళ్లలో అమెరికాలో ఏడీహెచ్‌డీ బారిన పడుతున్న పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏకాగ్రత తగ్గిపోతోంది. హింసాతత్వం పెరుగుతోంది. భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. స్కూల్ పిల్లలను స్మార్ట్‌ఫోన్ నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిల్లలకు చూపిస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ పిల్లల్లో నూరు శాతం మార్పు వచ్చింది. హైస్కూల్ స్థాయి పిల్లల్లో కొందరు తీవ్రంగా ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. అలాంటి వారిని సైకియాట్రిస్టులకు చూపించాలని తల్లిదండ్రులకు సిఫారసు చేస్తున్నాం. – వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త. తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్ వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని సులువుగా తగ్గించుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. - మొదట మన స్మార్ట్ ఫోన్లో అతిగా వినియోగిస్తున్న యాప్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమ మార్గం. - పని సమయంలో, భోజనం, వినోద కార్యక్రమాల సమయాల్లో ఫోన్‌ను ఆఫ్ చేయాలి. - సోషల్ మీడియా యాప్స్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను ఆఫ్ చేయాలి. - పడకగదిలో ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను ఉంచకూడదు. - సాంకేతికతతో సంబంధం లేని కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలి. - సాధ్యమైనప్పుడుల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
సినిమాకు ఆభరణం: శ్రుతి లయలే జననీ జనకులు కాగా
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయాడు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించాడు. తెలుగు ముగ్గు తెలుగు సిగ్గు తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలిసిన తెలుగింటి వనితలు అతను లేక మరి తెరపైకి రారు. ఒక కీర్తన, తిల్లాన, జావళి, జానపదం గుండె ఝల్లుమనేలా గజ్జె ఘల్లుమనిపించడం మళ్లీ చూడగలమా అతడు చూపినట్టుగా! ఆకలేసినవాడు అమ్మా అని ఎలా అంటాడో దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఎలా అంటాడో తెలియడం చేతనే భావాల లోతును మనసుకు తాకించాడు. నరుడి బతుకు నటనే కావచ్చు. కాని అతణ్ణి తీసుకెళ్లిపోవాలనే ఈశ్వరుడి ఘటన మాత్రం రస హృదయుడైన తెలుగు ప్రేక్షకుడికి బాధాకరం. క్లేశమయం. ► టికెట్లకూ సంతకానికీ లింకు మద్రాసులో ఒక గవర్నమెంట్ ఆఫీసు. ఎవరిదో ఫైల్‌ను ఎవరో ఆఫీసరు సంతకం పెట్టాలి. ఎంతకీ పెట్టడు. ‘ఎంత కావాలో చెప్పమనండీ’ అన్నాడు బాధితుడు. ప్యూన్ పక్కకు తీసుకెళ్లి చెప్పాడు ‘ఆయన డబ్బు తీసుకోడు. స్ట్రిక్టు. శంకరాభరణం టికెట్లు సంపాదించి ఇవ్వగలిగితే ఇవ్వు. పనైపోతుంది’ అప్పటికి నాలుగు వారాలుగా శంకరాభరణం మద్రాసులో తండోపతండాల జనంతో కిటకిటలాడుతోంది. ఆ టికెట్లు దొరికేవి కావు. ఆ ఫైల్ సంతకం జరిగేదీ లేదు. ► చంద్రమోహన్‌కు ఆ ప్రాప్తం లేదు ప్రాప్తం కూడా ఒక మంచిమాటే. శంకరాభరణంలో నటించినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు నటుడు చంద్రమోహన్ కు 50 వేలు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమా బిజినెస్ అయితే ఇస్తాడు. బిజినెస్ కాదు. షోల మీద షోలు పడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు. బాగుంది అంటున్నారు. ఎవరూ కొనడం లేదు. ఈ సినిమా రిలీజైతే తప్ప గడ్డం తీయను అని కె.విశ్వనాథ్ గడ్డం పెంచుతున్నాడు. గడ్డం పెరుగుతున్నది తప్ప సినిమా రిలీజ్ కావడం లేదు. ఈలోపు ఏడిదకు ఒక ఆలోచన వచ్చింది. చంద్రమోహన్ ను పిలిచి ‘నీ రెమ్యూనరేషన్ బదులు తమిళనాడు రైట్స్ ఇస్తాను తీసుకో’ అన్నాడు. చంద్రమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘రిలీజ్ కాని సినిమా నాకు అంటగడతావా. నా డబ్బు నాకు ఇవ్వు’ అన్నాడు. కొన్ని రోజులకు తమిళ నటి మనోరమ, తమిళనటుడు సౌందరరాజన్ తో శంకరాభరణం ప్రివ్యూ చూసింది. సినిమా అయ్యాక ఉద్వేగంతో విశ్వనాథ్ కాళ్ల మీద పడబోయింది. ‘ఈ సినిమా ఒక్కరు చూడకపోయినా పర్వాలేదు. నేను కొంటాను’ అంది. కొన్నది. చంద్రమోహన్ కు ప్రాప్తం లేదు. ► తపస్సు అలా మొదలైంది 1955లో సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ తీశాడు. భారతదేశంలో పార్లల్ సినిమాకు అంకురార్పణ చేశాడు. సత్యజిత్ రేకు గొప్ప పేరు, ఖ్యాతి దక్కాయి. కాని అది బెంగాలి వాళ్లకు చెల్లింది. హిందీలో కాని, సౌత్‌లో కాని సినిమా వ్యాపార కళ. వ్యాపారం ఎక్కువ, కళ తక్కువ అనుకునే సినిమాలు తీశారు. వినోదం చూపి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఆలోచన, అనుభూతి కృత్రిమ స్థాయి వరకే అంగీకారం. వాస్తవిక వాదంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల సత్యజిత్ రే వేసిన అడుగు పదేళ్ల పాటు బెంగాల్ దాటలేదు. కాని 1973లో ఎం.ఎస్.సత్యు తీసిన ‘గరం హవా’ వచ్చింది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాకు జేజేలు పలికారు. శ్యాం బెనగళ్ ఆ మరుసటి సంవత్సరమే ‘అంకుర్’ తీశాడు. ఇంకోవైపు తమిళంలో కె.బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు మిడిల్ క్లాస్ డ్రామాను గట్టిగా పట్టుకున్నారు. 1976లో బాలచందర్ ‘అంతులేని కథ’ వచ్చింది. అదే సంవత్సరం దాసరి ‘ఓ మనిషి తిరిగి చూడు’ లాంటి ప్రయోగాత్మక సినిమా తీశారు. అంత వరకు ‘శారద’, ‘జీవన జ్యోతి’ వంటి స్త్రీ కథాంశాలపై దృష్టి పెట్టిన కె.విశ్వనాథ్ అంతకు కాస్త అటు ఇటుగా దారి వెతుక్కునే క్రమంలో పడ్డారు. అదే సమయంలో దేశ సంస్కృతిలో వస్తున్న మార్పును చూసి మొత్తుకునే దర్శకులు కూడా వచ్చారు. 1971 లో దేవ్ ఆనంద్ హిప్పీల వేలంవెర్రిని ‘హరే రామా హరే కృష్ణ’గా తీశాడు. తెలుగునాట చూస్తే వర్తమానంలో సాంస్కృతిక అకాడెమీలు నామ్ కే వాస్తేగా మారాయి. తెలుగువాడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ మద్రాసులో అస్థిత్వం పొందాల్సి వచ్చింది. వీటన్నింటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం కె.విశ్వనాథ్ మీద ఉంది. 1976 నాటికి తీసిన ‘సిరి సిరి మువ్వ’ ఆయనకు దారి చూపింది. 1980లో తీసిన ‘శంకరాభరణం’ ఏ పునాది మీద తాను సినిమా తీయాలో, ఏ సంస్కృతి పట్ల తనకు అనురక్తి ఉందో, ఏ ప్రాభవాల కోసం తన గుండె కొట్టుకులాడుతుందో ఆయన తెలుసుకున్నారు. ఇంతవరకూ చేసింది సినిమా రూపకల్పన. ఇక మీదట చేయాల్సింది తపస్సు. ► ఆ ముగ్గుర్ని నమ్ముకునే... ‘శంకరాభరణం’ ముహూర్తం రోజున కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తిలను పిలిచి కొత్త బట్టలు పెట్టి ‘మిమ్మల్ని నమ్ముకునే ఈ సినిమా తీస్తున్నాను’ అన్నాడు విశ్వనాథ్. నిజమే. అంతకు మించి నమ్ముకోవడానికి సినిమాలో హీరో లేడు. హీరోయినూ లేదు. శంకరశాస్త్రి పాత్రను వేస్తున్నది నాటకాలు వేసుకునే గవర్నమెంట్ ఆఫీసరు జె.వి.సోమయాజులు. తులసి పాత్రను వేస్తున్నది వేంప్‌గా ముద్రపడిన మంజుభార్గవి. చంద్రమోహన్ ది సపోర్టింగ్ రోల్. ఎవరిని చూసి ఈ సినిమా కొనాలి? ఎవరిని చూసి ఈ సినిమా ఆడాలి? పై ముగ్గురినే. కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తి... వీరు విశ్వనాథ్ అంచనాని వమ్ము చేయలేదు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని వేటూరి రాస్తే రిక్షా లాగే కార్మికుడు కూడా శాస్త్రీయ సంగీతం ఆస్వాదించేలా కె.వి.మహదేవన్, పుహళేంది పాటలు చేశారు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే శాస్త్రీయ సంగీతం తెలిసిన ఏ మంగళంపల్లో కావాలి. కాని స..ప..స..లు నేర్వలేదని చెప్పుకునే బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. భారతీయ కళలు మరపున పడవచ్చు, మసి బారవచ్చు కాని వాటి తేజస్సు జాజ్వల్యమైనది... వాటి ఆధారంగా ఏర్పడిన పరంపరలు, వ్యక్తిత్వాలు, అహంభావాలు ఎవరికీ తల వంచనివి.. ఎవరు ఏం చేసినా అవి ఒక తరం నుంచి మరో తరానికి ఏదో ఒక మూల కొనసాగుతూనే ఉంటాయి... అని ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్ చెప్పారు. మరి జనం చూస్తారా? ► మొదట ఖాళీ... ఆ తర్వాత కిటకిట 1980 ఫిబ్రవరి 2. అతి కష్టమ్మీద అతి కొద్ది థియేటర్లలో ‘శంకరాభరణం’ రిలీజ్ అయ్యింది. నేల, బెంచి, కుర్చీ... ఖాళీ. ఒక దిక్కూ మొక్కూ లేని అమ్మాయి కోసం ఒక మహా విద్వాంసుడు నిలబడ్డాడు. అయినవారు అతణ్ణి వెలి వేశారు. ఈ కథేదో కొత్తగా ఉందే అనుకున్నారు కొందరు. కాలగమనంలో చితికిపోయిన ఒక గొప్ప కళాకారుడు తన అభిజాత్యం కోల్పోకుండా పోరాడుతున్నాడే... ఇదీ బాగుందనుకున్నారు మరి కొందరు. ‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’ శివుని ఎదుట నర్తిస్తున్న ఈ నిష్కళంకుడు ఇంతకు ముందు ఏ కథలోనూ కనిపించలేదే. మొదట కుర్చీ నిండింది. తర్వాత బెంచీ నిండింది. తర్వాత నేల కిటకిటలాడింది. ఆ తర్వాతదంతా చరిత్ర. ‘ఎంటర్ ది డ్రాగన్ ’ వచ్చి దేశంలో కరాటే స్కూల్స్ తెరిచింది. ‘శంకరాభరణం’ వచ్చి తెలుగునాట సంగీత పాఠాలను, నృత్యపాఠశాలలను పునరుద్ధరించింది. ► దొరకునా ఇటువంటి సేవ! ‘శంకరాభరణం’లో శంకరాభరణ రాగమే లేదు అని విమర్శించాడు మంగళంపల్లి. కె.విశ్వనాథ్ భావధార పట్ల ఇలాంటివే కొన్ని అభ్యంతరాలు కొందరికి ఉండవచ్చు. కాని సినిమాను ఒక కళగా, దృశ్య శ్రవణ మాధ్యమంగా, రసస్పందన కలిగించే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు చూపినవాడు కె.విశ్వనాథ్. సినిమాను తపస్సుగా భావించాడు. నిర్వాణ సోపానంగా కూడా. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రాల్లో కొన్ని టైటిల్స్‌తో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఈ విధంగా... శంకరాభరణం శంకరుడు అంటే శివుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వనాథ్ సినిమాల్లో దాదాపు శివుడి మీద ఏదో ఒక పాట ఉంటుంది. మరి.. విశ్వ నాథుడు శివభక్తుడా? అంటే... ఆయనకు దైవభక్తి ఎక్కువే. ఏదో ఒక పవర్ ఉంటుందనే నమ్మకం ఆయనది. విశ్వనాథ్ సినిమాల్లోకి వచ్చాక శివుడి పాట ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగినదే. అనుకోకుండా ఆ సినిమాలో శివుడికి సంబంధించిన పదమో, సందర్భమో రావడం అనేది భగవదేచ్ఛ అని, కావాలని ప్రయత్నించినది కాదని విశ్వనాథ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అంతెందుకు ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రిని విశ్వనాథ్ అడిగారు. దేవులపల్లి ఏమో ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతాగంగమ్మ వాన’ అని రాశారు. విశ్వనాథ్ ‘శ్రీ’తో రాయమని అడిగారే తప్ప శివుడి మీద రాయమని అడగలేదు. అయినా శివుడి మీద పాట వచ్చేసింది. ఇక చిన్నప్పుడు శివాలయానికి వెళ్లేవారు విశ్వనాథ్. ఆ సమయంలో ఒక వ్యక్తి మాస్కు వేసుకుని జడిపిస్తే, మూడు రోజులు జ్వరంతో పడుకున్నారు. అలా తెలిసీ తెలియని వయసు నుంచీ సినిమాల్లోకి వచ్చాక, ఆ తర్వాత కూడా విశ్వనాథ్ జీవితంలో శివుడు ఉన్నాడని అర్థమవుతోంది. అమ్మ మనసు తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. విశ్వనాథ్‌ది కూడా సేమ్ ఫీలింగ్. ఇష్ట దైవం ఎవరంటే తన తల్లిదండ్రుల గురించి చెప్పేవారు. అమ్మానాన్నలు చేసిన పుణ్యం, పూజలే ఫలించాయని, కాపాడాయన్నది విశ్వనాథ్ నమ్మకం. కళాతపస్వి తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకు జ్యోతిష్యం బాగా వచ్చు. అయితే కొడుకు తీసిన ఏ సినిమాకీ ముహూర్తం పెట్టలేదాయన. సినిమా అనేది ఊహకందని వ్యాపారం కాబట్టి తానో ముహూర్తం పెట్టించి, సినిమా ఆడకపోతే ‘ఆయన అనవసరంగా చెప్పారు’ అంటారనే మాట అనిపించుకోవడం ఇష్టంలేక కొడుకు సినిమాలకు ముహూర్తం పెట్టలేదు. స్వతహాగా మితభాషి అయిన సుబ్రహ్మణ్యం తనయుడి విజయాలకు లోలోపల ఆనందించేవారు. తన పుస్తకాల్లో ‘శంకరాభరణం ఈరోజున ఈ నక్షత్రం, ఈ ఘడియల్లో రష్ చూశాను. దీనికి ఈ యోగం ఉంది’ అని రాసుకున్నారు. ఇలా తనయుడి సినిమాల గురించి రాసుకున్నారు. ఇక విశ్వనాథ్ తల్లి సరస్వతి అయితే తనయుడి విజయాలను ఆస్వాదించేవారు. సాధారణంగా కోడలు ఇంటికొచ్చాక ఇంటి పరిస్థితి కాస్త మారుతుంది. అయితే కొడుకు మనసు ఎరిగిన తల్లిగా సరస్వతి కోడలిని బాగా చూసుకున్నారు. చెల్లెలి కాపురం విశ్వనాథ్‌కి ఇద్దరు చెల్లెళ్లు. పెళ్లయి, చెన్నై వడపళనికి మకాం మార్చినప్పుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను కూడా తీసుకెళ్లారు విశ్వనాథ్. ఆ చెల్లెళ్లు తమకు పెళ్లయ్యేంతవరకూ అన్నా వదిన దగ్గరే ఉన్నారు. తోడబుట్టినవాళ్లను అత్తగారింటికి పంపించాక కూడా వారి బాగోగులను చూసుకున్నారు. వాళ్ల శ్రీమంతాలు, కాన్పులు కూడా చెన్నైలోనే. సోదరుడు తండ్రితో సమానం అంటారు. విశ్వనాథ్ తన చెల్లెళ్లకు ఒక తండ్రిలానే ఉన్నారు. అయితే ఆయన సతీమణి జయలక్ష్మి సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. విశ్వనాథ్ తన సినిమాలతో తీరిక లేకుండా ఉంటే.. ఆడపడుచులను చూసుకున్నారు జయలక్ష్మి. అలాగే చెల్లెళ్లనే కాదు.. తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను కూడా బాగా చూసుకున్నారు విశ్వనాథ్. చివరికి వాళ్ల పిల్లలు కూడా వీళ్ల ఇంట్లోనే ఉండి, చదువుకోవడం విశేషం. స్వాతిముత్యం ‘స్వాతిముత్యం’లో శివయ్య (కమల్‌హాసన్ పాత్ర పేరు) అమాయకుడు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడు. మరి.. చిన్నప్పుడు విశ్వనాథ్ ఎలా ఉండేవారు అంటే.. మహా అల్లరి. విజయవాడలో చదువుతుండగా కాలువ దాటి స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చేది. వీళ్ల ఇంటి ఎదురుగానే కాలువ ఉండేది. వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం నీళ్లే ఉండటంతో బ్రిడ్జి మీద నుంచి కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి, కాలువలోంచే నడుచుకుంటూ వెళ్లేవారు. అయితే ఇంట్లోవాళ్లకి చెబితే తిడతారని భయం. నిక్కర్లు పైకి మడుచుకుని కాలువలో దిగిన విశ్వనాథ్‌ని చూసిన ఆయన మేనమామ కూతురు ఇంట్లో విషయం చెప్పేసింది. అంతే.. విశ్వనాథ్ తండ్రి అక్కడికి వెళ్లి ‘రేయ్’ అని అరిచారు. ఆ భయానికి విశ్వనాథ్ చేసిన పనులన్నీ నీళ్లలోనే కలిసిపోయాయి (ఓ సందర్భంలో విశ్వనాథ్ నవ్వుతూ చెప్పిన విషయం). అంతే.. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిన కొడుకుని ‘రాస్కెల్’ అని, బట్టలు మార్చుకోమన్నారు విశ్వనాథ్ తండ్రి. ఇక ఆ తర్వాత ఆ కాలువ వైపు వెళ్లలేదు. అలాగే చిన్నప్పుడు తండ్రి మూడు చక్రాల సైకిలు కొనిపెడితే, దాన్నే మెర్సిడెస్ బెంజ్‌గా ఫీలయి, టింగుటింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ వెళ్లేవారు విశ్వనాథ్. స్వయంకృషి కె. విశ్వనాథ్‌ను ఇంజినీర్ చేయాలనుకున్నారు ఆయన తల్లిదండ్రులు. ఆయనకు మాత్రం సంగీతం పై మక్కువ ఎక్కువ. బీఎస్సీ పూర్తి చేశాక తండ్రి అనుమతితో చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరారు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువగా డబ్బింగ్ స్టూడియోలు ఉండేవి కావు. దీంతో లొకేషన్లోనే ఆర్టిస్టుల మాటలను రికార్డ్ చేయవలసి వచ్చేది. సంభాషణలు సరిగ్గా పలకడం తెలియని నటీనటులకు దగ్గరుండి డైలాగులు నేర్పించారు విశ్వనాథ్. ‘సౌండ్ రికార్డిస్ట్’గా నిజాయతీగా చేసిన పని ఆయన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఎదిగేలా చేసింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో చేసినప్పుడు విశ్వనాథ్ పని తీరు చాలామంది దృష్టిలో పడింది. అలా అక్కినేని నాగేశ్వరరావు ‘ఆత్మగౌరవం’తో దర్శకుణ్ణి చేశారు. అప్పట్నుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ వరకూ రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేసిన రోజులే ఎక్కువ. ఆయన స్వయంకృషియే విశ్వనాథ్‌ని తెలుగు పరిశ్రమ శిఖరాగ్రాన నిలిచేలా చేసింది. శుభప్రదం దాదాపు 75 సంవత్సరాలు సినిమాలే లోకంగా జీవించారు విశ్వనాథ్. ఇక కుటుంబానికి సమయం కేటాయించాలని దర్శకుడిగా సినిమాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ నటుడిగా మాత్రం చేశారు. సినిమాలు తగ్గించాక ఆయన లైఫ్‌స్టయిల్ ఎలా సాగిందంటే.. ఉదయాన్నే నిద్ర లేవడం.. అల్పాహారం, భార్యతో కబుర్లు చెప్పుకోవడం, గడిచిన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఓసారి స్ఫురణకు తెచ్చుకుని హ్యాపీగా ఫీలవ్వడం... ఇలానే విశ్వనాథ్ దినచర్య సాగుతుండేది. టీవీల్లో వచ్చే వంటల కార్యక్రమాలను చూసేందుకు ఇష్టపడేవారు విశ్వనాథ్. జయలక్ష్మికి ఏమో ప్రవచనాలు వినడం ఇష్టం. ఉదయం పదకొండు గంటలవరకూ ఆవిడ ఆ కార్యక్రమాలు చూసేవారు. ఆ తర్వాత రిమోట్ విశ్వనాథ్ చేతికి దక్కేది. ఇక అప్పుడు ఆయన వంటల ప్రోగ్రామ్స్ చూసేవారు. ఇలా కాలక్షేపం చేశారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు కాగా, చిన్న కుమారుడికి ఇద్దరు అమ్మాయిలు. ఆయన అల్లుడు, కుమార్తె చెన్నైలో ఉంటారు. వీరికి ఓ పాప. మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపారు విశ్వనాథ్. వయోభారం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఆయన పెద్దగా ఇబ్బంది పడిందిలేదు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘శుభప్రదం’. ఆయన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం కూడా సంపూర్ణం.. శుభప్రదమే. ప్రశాంతంగా వెళ్లిపోయారు కళాతపస్వి. శుభలేఖ పందొమ్మిదేళ్లకే విశ్వనాథ్‌కి పెళ్లయింది. రెండు పెళ్లి చూపులకు వెళ్లారు. ఒకటి ఆయన మేనమామ తెచ్చిన పెళ్లి సంబంధం. అప్పటికే చెన్నైలో ఉంటున్న విశ్వనాథ్ ఆ సంబంధం కోసం తెనాలి వెళ్లారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత రెండో పెళ్లి సంబంధం కోసం చెన్నై వెళ్లి, అక్కడ జయలక్ష్మిని చూశారాయన. ఆ సంబంధం ఖాయం అయింది. అప్పటికి జయలక్ష్మికి 14 సంవత్సరాలు. చిన్న వయసులో అత్తింట్లో అడుగుపెట్టిన జయలక్ష్మి ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఇద్దరు ఆడపడుచులు, అత్తమామలు, వచ్చే పోయే బంధువులతో జయలక్ష్మికి క్షణం తీరిక ఉండేది కాదు. పైగా విశ్వనాథ్ చేసినవి ఎక్కువగా రిస్కీ ప్రాజెక్ట్స్ కాబట్టి నిర్మాతల దగ్గర పారితోషికం ఇంత కావాలని డిమాండ్ చేయలేకపోయారు. పెద్ద స్థాయిలో పారితోషికం కూడా వచ్చేది కాదు. దీంతో దర్శకుడిగా మారిన పదేళ్ల తర్వాతే కారు కొనగలిగారు. అలాగే ఫలానా నగ బాగుందని భర్తతో జస్ట్ అనేవారు కానీ ఏనాడూ నాకిది కావాలని జయలక్ష్మి అడిగింది లేదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటుటారు. నా విజయం వెనక నా భార్య జయలక్ష్మి ఉంది. సినిమా పనులతో నేను బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నా తరఫు బంధువులందరూ నాకన్నా ఎక్కువగా తననే అభిమానిస్తుంటారు. అంత ఆప్యాయంగా జయలక్ష్మి వారిని చూసుకుంటుంది’ అని భార్య గొప్పతనం గురించి పలు సందర్భాల్లో చెప్పారు విశ్వనాథ్. భర్తని అర్థం చేసుకున్న జయలక్ష్మి, భార్యని అర్థం చేసుకున్న భర్తగా ఈ దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా సాగింది. బాలూ అలిగితే నటుడయ్యాడు కె.విశ్వనాథ్ ప్రాథమికంగా నటుడు. కాని దాసరిలాగా విశ్వనాథ్ తన సినిమాల్లో పాత్రలు చేయలేదు. బాలూ వల్ల చేయాల్సి వచ్చింది. ‘శుభ సంకల్పం’ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మాత. గొల్లపూడి, విశ్వనాథ్ కలిసి స్క్రిప్ట్ తయారు చేశారు. కమల హాసన్ హీరో. హీరోయిన్గా ఆమని. స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫలానా పాత్రకు ఫలానా అని రఫ్‌గా భావిస్తూ రాసుకున్నారు– ఒక్క రాయుడు పాత్రకు తప్ప. అది సినిమాలో కమలహాసన్‌కు యజమాని పాత్ర. సరే... స్క్రిప్ట్‌ను బాలూకు చదివి వినిపించే రోజు వచ్చింది. విశ్వనాథ్ స్వయంగా చదివి వినిపిస్తూ ఒక సన్నివేశంలో రాయుడు ఎలా ఆవేదన చెందుతాడో గాద్గదికంగా చదివి వినిపించారు. బాలూకు ఆ పాత్రలో విశ్వనాథే కనిపించారు. గొల్లపూడికి చెప్తే ఆయన కూడా వత్తాసు పలికాడు. అదే ప్రస్తావన విశ్వనాథ్ దగ్గర తెస్తే ‘నేనేమిటి... నటించడం ఏమిటి’ అని తిరస్కరించారు. నటించాల్సిందే అని బాలు పట్టుపట్టాడు. నటించను అని విశ్వనాథ్ గట్టిగా చెప్పేశారు. బాలు అలిగి స్క్రిప్ట్ ఫైల్ విసిరి కొట్టి అలా అయితే సినిమానే చేయను అని వెళ్లిపోయాడు. చివరకు విశ్వనాథ్ బాలు కోరికను మన్నించారు. ‘శుభ సంకల్పం’ విడుదల తర్వాత హఠాత్తుగా తెలుగు వెండితెరకు మరో కేరెక్టర్ ఆర్టిస్టు దొరికినట్టయ్యింది.