Fatima Sana Shaikh
-
దంగల్ నటికి బెదిరింపులు
న్యూఢిల్లీ : దంగల్ మేవీ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌కు కొద్దికాలంగా బెదిరింపులు వస్తున్నాయి. కొందరు పోకిరి వెధవలు.. ఏకంగా ఆమె ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అసభ్యకరంగా మెసేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పోస్ట్‌లకు ఫాతిమా కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. నాలుగైదు రోజులు కిందట సనా.. ఒక సెల్ఫీ తీసుకుని.. దానికి షేమ్‌లెస్ సెల్ఫీ అనే టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ ఫొటోపై విపరీతమైన, అభ్యంతరకర రీతిలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కొందరైతే.. నీవు ధరించి దుస్తులు.. నీమీద గౌరవాన్ని తగ్గిస్తున్నాయని అంటే.. మరొకరు.. నువ్వు నిజంగా షేమ్‌లెస్ కాబట్టే ఇటువంటి ఫొటో పెట్టావు అని మరొకరు కామెంట్లు పెట్టారు. కాగా ఈ ఫొటోను ఇప్పటివరకూ 80 వేల మంది లైక్ కొట్టగా.. 1300 కామెంట్లు వచ్చాయి. గతంలో కూడా సనా ఇటువంటి ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. పలు విమర్శలు పాలైంది. Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Oct 8, 2017 at 7:49am PDT A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Jun 6, 2017 at 10:20pm PDT -
వివాదంలో దంగల్ నటి
‘దంగల్’ ఫేం ఫాతిమా సనా షేక్ ‘స్విమ్ సూట్’ వివాదంలో చిక్కుకుంది. చెయ్యకూడని పని చేశావంటూ నెటిజన్లు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె.. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా షూటింగ్ నిమిత్తం ద్వీపదేశం మాల్టాలో ఉంది. అక్కడి సముద్ర తీరంలో స్విమ్‌సూట్ ధరించి సనా ఓ ఫొటోషూట్ చేసింది. హీరోయిన్లు ఇలాంటి షూట్లు చేయడం సహజమే కానీ ఫాతిమా సనా ముస్లిం కావడం, అందులోనూ ఇది రంజాన్ మాసం కావడం వివాదానికి దారితీసిన అంశాలు. ‘ఇస్లాంను పాటించే నువ్వు(ఫాతిమా సనా) పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫొటోలు దిగి మమ్మల్ని బాధపెట్టావు. ఈ ఒక్క నెలైనా నువ్విలాంటి పని చేయకుండా ఉండాల్సింది’ అంటూ కొందరు ఆమెపై కామెంట్ల దాడిచేయగా, మరికొందరు మాత్రం ‘ఇందులో తప్పేముంది? నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉంది’అని సనాను సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై అటు సనాగానీ, ఇటు ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ యూనిట్‌గానీ స్పందించలేదు. క్రేజీ ప్రాజెక్ట్ ఫాతిమా సనా షేక్ ప్రస్తుతం నటిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా ప్రఖ్యాత ‘కన్ఫెషన్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. దోపిడీదారులైన సయీద్ అమీర్ అలీ, అతని తండ్రి జీవితాల ఆధారంగా రచయిత ఫిలిప్ మిడోస్ 1839లో ఈ నవల రాశారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాలో అమితాబ, ఆమిర్‌లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. -
స్విమ్‌సూట్ ధరించడంతో నటిపై ఆగ్రహం!
‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ కూతురు గీతా ఫోగట్‌గా ఆకట్టుకున్న ఫాతిమా సనా షైక్ గుర్తుంది కదా. ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. స్విమ్‌సూట్ ధరించిన కొన్ని అందమైన ఫొటోలను ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసింది. మాల్దీవుల్లోని నీలిసముద్రపు తీరాల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన వీటిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగానే.. కొందరు మతరక్షకులు రంగంలోకి దిగారు. పవిత్ర మాసమైన రంజాన్‌లో ఇలా ‘అసభ్యకరమైన’ ఫొటోలు పోస్టుచేస్తావా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఆమెను కించపరుస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఎవరికైనా తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది. దానికి అభ్యంతరం చెప్పడం, కించపరచడం సరికాదని ఆమె అభిమానులు పలువురు ఫాతిమాకు అండగా నిలుస్తున్నారు. -
ఈ పాపులర్ నటిని గుర్తుపట్టగలరా..!
ఈ ఫొటోలో ఉన్న పాపులర్ నటి చిన్ననాటి ఫొటో చూసి ఆమె ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే మూవీలో ఆమె గెటప్.. రియల్ లైఫ్‌లో ఆమెను చూస్తే పోల్చుకోవడం అంత తేలికకాదు. అయితే ఆమె ఎవరో చెబితే మాత్రం నటి ఏ మూవీలో నటించిందో, ఏ పాత్ర పోషించిందో ఇట్టే చెప్పేస్తారు. ఇటీవల ఆమె నటించిన ఓ మూవీ భారతదేశ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా కోసం ఆమె ఆహార్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ నటి మరెవరో కాదు ఫాతిమా సనా షేక్. ఇంకా గుర్తుకురాలేదా.. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ తన కూతుళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దిన తీరును కథాంశంగా తీసుకుని తీసిన దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది. దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ చిన్నప్పటి పాత్రలో కశ్మీరీ నటి జైరా వసీం నటించగా, కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న పెద్ద గీతా ఫోగట్ పాత్రలో ఫాతిమా సనా షేక్ నటించింది. రెజ్లర్ పాత్ర కోసం ఫాతిమా ఎంతో శ్రమించిందని చెప్పవచ్చు. రెజ్లింగ్ మ్యాట్‌పై అద్భుతం చేసి భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన గీతా ఫోగట్ పాత్రలో నటించి క్యారెక్టర్‌కు జీవం పోసింది ఫాతిమా. అయితే దంగల్‌లో హెయిర్ కట్ చాలా చిన్నగా ఉండటంతో ఆమె రియల్ ఫొటోలను చూసి అంత తేలికగా ఆమెను గుర్తించలేరు.