Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు) Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos | Sakshi
Sakshi News home page

Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)

Published Thu, May 23 2024 6:39 PM | Last Updated on

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
1/18

రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
2/18

భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
3/18

ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించి పెళ్లాడిన వారిని మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
4/18

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఒకప్పుడు ఈ దుస్థితిని ఎదుర్కొన్నాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
5/18

తమిళనాడుకు చెందిన డీకే.. తన చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
6/18

డీకే సహచర క్రికెటర్‌, స్నేహితుడు అయిన మురళీ విజయ్‌ తరచుగా వాళ్లింటికి వచ్చేవాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
7/18

ఈ క్రమంలో నికితా- విజయ్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
8/18

వారిద్దరి రహస్యంగా రిలేషన్‌షిప్‌లో ఉండటం తెలిసిన దినేశ్‌ హృదయం ముక్కలైంది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
9/18

దీంతో డీకే 2012లో నికితాకు విడాకులు ఇచ్చాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
10/18

ఆ తర్వాత నికిత ఎంచక్కా మురళీ విజయ్‌ను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయింది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
11/18

మరోవైపు.. స్వ్యాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ రూపంలో డీకే జీవితంలోనూ తిరిగి వసంతాలు పూశాయి.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
12/18

దీపిక ద్వారా నిజమైన ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
13/18

ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
14/18

దీపికా పళ్లికల్‌ 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో జోష్న చిన్నప్పతో కలిసి స్క్వాష్‌ మహిళల డబుల్స్‌ పసిడి పతకం గెలిచింది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
15/18

అదే విధంగా.. 2023 ఆసియా క్రీడల్లో హరిందర్‌ పాల్‌ సింగ్‌తో కలిసి దీపికా మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగంలో స్వర్ణం సాధించింది.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
16/18

ఐపీఎల్‌-2008 నుంచి 2024 దాకా పదిహేడేళ్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగిన డీకే... మే 22న ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
17/18

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓడిపోయిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

Dinesh Karthik's Lovely Wife Who Saved After His First Wife Betrayed Him: Photos
18/18

కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ, పంజాబ్‌, ముంబై, ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, గుజరాత్‌ లయన్స్‌ తదితర జట్లకు డీకే ప్రాతినిథ్యం వహించాడు. 2022 నుంచి ఆర్సీబీలో ఉన్న అతడు అక్కడే రిటైర్‌ అయ్యాడు.

Advertisement
 
Advertisement