తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్ | Tirupathi, Srikalahasthi should be merged in Tamilnadu | Sakshi
Sakshi News home page

తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్

Published Thu, Feb 20 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్

 పీఎంకే అధినేత రాందాస్ డిమాండ్

 సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన దృష్ట్యా గతంలో ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను తిరిగి తమిళనాడులో కలపాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ బుధవారం డిమాండ్ చేశారు. మద్రాసు రాజధాని నుంచి 1956లో విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తమిళనాడులోని 9 మండలాలు దూరమయ్యూయన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి కేవలం తిరుత్తణిని మాత్రమే తిరిగి దక్కించుకోగలిగామని వివరించారు.
 
  పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి తదితర 8 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయాయన్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న ఈ 8 మండలాల్లోని తమిళులు ద్వితీయశ్రేణి పౌరులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నందున  వారికి న్యాయం జరిగేలా తమిళనాడులో తిరిగి కలపాలని, ఇందుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాందాస్ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement