‘జై జగన్‌.. పొలిటికల్‌ సూపర్‌స్టార్‌’ | YS Jagan Birthday Celebrations At Banjara Hills YSR Circle | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 8:31 AM | Last Updated on Fri, Dec 21 2018 3:23 PM

YS Jagan Birthday Celebrations At Banjara Hills YSR Circle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజన్న తనయుడి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

బంజారాహిల్స్‌లోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద గురజాల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్‌.. పొలిటికల్‌ సూపర్‌స్టార్‌ అంటూ నినాదాలు చేశారు.

చిత్తూరులో..
వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహార వితరణ చేశారు. మైనారిటీ నాయకుడు అను అల్తాఫ్, రాకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు.

వారాహి యాగం..
వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళంలోని దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో వారాహి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రంమలో సి.ఇ.సి. మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా

  • జిల్లాలోని కాళ్ల ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు కేక్‌ కట్ చేశారు. కార్యక్రంమలో పాతపాటి సర్రాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు యోగేంద్ర బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ జన్మదినం సందర్భంగా గణపవరం కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
  • తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే జననేత జగన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తణుకు కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు కేక్‌ కట్‌ చేశారు. వైఎస్‌ జగన్ తుదపరి పుట్టినరోజు ముఖ్యమంత్రి హోదాలో జరుపుకొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నదే ఆంధ్రా ప్రజల అభిలాష అని వ్యాఖ్యానించారు.
  • వైఎస్‌ జగన్ జన్మదినం నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు, నియోజకవర్గ యూత్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో  వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
  • ఇండస్ట్రీయల్  ఎస్టేట్ పార్కులో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జరిగాయి.  విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వాకర్లకు బూట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, చల్లా ఈశ్వర రావు, రత్నాకర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  •  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సంధర్భంగా భీమవరం  ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,రొట్టెలు, పండ్లు మరియు  విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి,కేక్‌ కట్ చేసిన భీమవరం  నియోజకవర్గం సమన్వయకర్త గ్రంధి. శ్రీనివాస్.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొయ్యే. మోసేనురాజు, పేరు చర్ల నరసింహబాబు, మేడిద జాన్సన్,కోడే యుగంధర్, గూడూరి. ఉమాబాల, పలువురు కార్యకర్తలు.
  • జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో  కేక్ కట్టింగ్. వికలాంగులుకు  పాలు, పండ్లు,  పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండవల్లి సోంబాబు,పొల్నాటి బాబ్జి,సాయిబాల పద్మ, చంద్ర రావు, హరిబాబు, బీవీఆర్ చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లాలో..
ఎస్.కోటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభిమానులు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌.కోటలో ఉచిత మంచినీటి సరఫరా ట్రాక్టర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుడు బాబు, రఘురాజు, చిన్న రాము నాయుడు,  రాజేశ్వరరావు, వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు మధ్య గార తవుడు కేకు కట్ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రోట్టెలు పంచారు. బూడి వెంకటరావు, వర్రి నర్శింహమూర్తి, బెల్లాన త్రినాదరావు, కరణం ఆదినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • పార్వతీపురం మండలం కోరీ గ్రామంలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయ కర్త జోగారావు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
  • ఆబాద్‌ వీధి ఊర్దూ పాఠశాలలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అవనపు విజయ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 
     
  • వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురష్కరించుకొని విజయనగరంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంద్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి కేక్ కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కృష్ణా జిల్లాలో..

  • వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో  వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ
  • విజయవాడ వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త  మల్లాది విష్ణు ఆధ్వర్యంలో  విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం
  • విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58 వ డివిజన్ లో వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా యువజన విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు వంటసామాగ్రి పంపిణీ

అనంతపురం జిల్లాలో..

  • వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్
  • వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెనుకొండ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement