తెయూ డిగ్రీ ఫలితాలు విడుదల | telangana university results were released | Sakshi
Sakshi News home page

తెయూ డిగ్రీ ఫలితాలు విడుదల

Published Wed, May 28 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

telangana university results were released

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల ఫలితాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొపెసర్ లింబాద్రి మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో వీసీ విడుదల  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి యూనివర్సిటీ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించిన డిగ్రీ ఫలితాలు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.

తాను వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఓయూ నుంచి తెయూకు అఫిలియేషన్ అనుమతి వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా తెయూ ద్వారా డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల  చేశామన్నారు.  ఈ విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల ఫలితాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ నసీం, పరీక్షల అదనపు నియంత్రణాధికారి నాగరాజు, అసిస్టెంట్ అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ రాంబాబు, ప్రిన్సిపాల్ కనకయ్య, నాగరాజు, సాయాగౌడ్, అసిస్టెంట్ పీఆర్‌వో ఖవి పాల్గొన్నారు.

 తొలిసారి గ్రేడింగ్ విధానం..
 తెయూ పరిధిలో మంగళవారం విడుదల చేసిన డిగ్రీ ఫరీక్ష ఫలితాల్లో తొలిసారి గ్రేడింగ్ పద్ధతిలో కన్సాలిడేటెడ్ మెమోలు జారీ చేస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు.  విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తామని ఆయన తెలిపారు.
 ఈ విద్యా సంవత్సరం (2013-14)లో డిగ్రీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 26 శాతం, తృతీయ సంవత్సరం పరీక్షల్లో 33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ  తెలిపారు. మూడేళ్లకు సంబంధిం చి అన్ని కోర్సుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement