మొరాయించిన మైకులు నిరసన తెలిపిన విలేకరులు | Morayincina dizziness journalists protested | Sakshi
Sakshi News home page

మొరాయించిన మైకులు నిరసన తెలిపిన విలేకరులు

Published Fri, Dec 19 2014 3:37 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Morayincina dizziness journalists protested

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీడియా గ్యాలరీలో మైకులు, స్పీకర్లు మొరాయించడంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు  మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక మీడియా ప్రతినిధులు లేచి నిలబడి తమ చేతిలోని పేపర్లను ఊపడంతో సీఎం తన ప్రసంగాన్ని ఆపి అధికారులను పురమాయించారు.

దీంతో అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సమాచార శాఖ అధికారి వెంకటేష్  సూచన మేరకు సిబ్బంది ప్రత్యామ్నాయ మైకు (స్పీకర్)ను తెచ్చి పెట్టడంతో గొడవ ముగిసింది. ఈలోపు సీఎం ప్రసంగం, స్పీకర్‌కు, వైఎస్సార్‌సీపీ సభ్యులకు మధ్య జరిగిన వాగ్వాదాన్ని విలేకరులు వినలేకపోయారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement