నర్సరీలను చంటి పిల్లల్లా కాపాడాలి | Baby nurseries protected | Sakshi
Sakshi News home page

నర్సరీలను చంటి పిల్లల్లా కాపాడాలి

Published Sat, Dec 20 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

Baby nurseries protected

డ్వామా పీడీ ఎన్.సునందారాణి
 అడ్డాకుల: హరితహారం కోసం మొక్కలు పెంచే నర్సరీలను ఉపాధిహామీ ఏపీఓలు, వనకాపరులు చంటి పిల్లల్లా కాపాడాలని డ్వామా పీడీ ఎన్.సునందరాణి సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో శుక్రవారం ఆమె ఉపాధి సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 160 నర్సరీలను ఏర్పాటుచేసి 1.60కోట్ల మొక్కలను పెంచడ మే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలి పారు. ఇందుకోసం ఇప్పటివరకు 145 నర్సరీలకు అనుమతి లభించిందని, మరో 15 నర్సరీలకు మంజూరు రావాల్సి ఉందన్నారు. జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని జనవరి 15 నాటికి పూర్తిచేయాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు చనిపోతే ఉపాధి అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నర్సరీలకు వచ్చే కూలీలకు సకాలంలో డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
  ‘సాక్షి’ కథనానికి స్పందన
 ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన ‘మరుగున పడుతున్న బిల్లులు’ అనే శీర్షికన వచ్చిన కథనంపై ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో డ్వామా పీడీ సునందరాణి సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం నాబార్డు నుంచి రావాల్సిన వాటా నిధులు ఆలస్యమవడంతోనే బిల్లుల చెల్లింపులో ఆలస్యమైందన్నారు. నిధులు వచ్చినందున  వెంటనే బిల్లులు చెల్లించాలని ఏపీఓ గట్టయ్యను ఆదేశించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement