భోజనం వికటించి 230 మందికి అస్వస్థత 230 People Become Sick Due To Food Poisoning At Adilabad | Sakshi
Sakshi News home page

భోజనం వికటించి 230 మందికి అస్వస్థత

Published Mon, Dec 30 2019 5:34 AM | Last Updated on Mon, Dec 30 2019 5:34 AM

230 People Become Sick Due To Food Poisoning At Adilabad - Sakshi

జైనథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడ పంచాయతీ పరిధిలోని దాజీనగర్‌లో భోజనం వికటించి దాదాపు 230 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం గ్రామంలో గురుపూజ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీనికోసం శుక్రవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు కొనసాగాయి. అయితే అర్ధరాత్రి నుంచి గ్రామస్తులకు వాంతులు కావడంతో 47 మందిని జిల్లా కేంద్రం లోని రిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. మిగతావారికి గ్రామంలోనే చికిత్స అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement