‘క్రికెట్‌ జ్ఞాపకాని’కి రికార్డు ధర | Warne's Baggy Green Becomes Most Valuable Of All Time | Sakshi
Sakshi News home page

వార్న్‌ ‘బ్యాగీ గ్రీన్‌’కు ఆల్‌టైమ్‌ రికార్డు ధర

Published Thu, Jan 9 2020 2:14 PM | Last Updated on Sat, Jan 11 2020 9:53 AM

Warne's Baggy Green Becomes Most Valuable Of All Time - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం ఆ దేశ దిగ్గ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ తన బ్యాగీ గ్రీన్‌(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్‌)ను వేలానికి పెట్టగా దానికి ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. తన బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను సోమవారం వేలానికి తీసుకురాగా, అది రోజు వ్యవధిలోనే ఊహించని ధరకు అమ్ముడుపోయింది. వార్న్‌ బ్యాగీ గ్రీన్‌కు లభించిన ధర 5,29,500 డాలర్లు. సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి ఆ క్యాప్‌ను వేలంలో కొనుగోలు చేశాడు. దాంతో అత్యంత ధరకు అమ్ముడుపోయిన ఓ ‘క్రికెట్‌ జ్ఞాపకం’గా వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ రికార్డు సృష్టించింది. ఈ క‍్రమంలోనే ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను అధిగమించింది.(ఇక్కడ చదవండి: ‘ప్రతీ సిక్స్‌ను డొనేట్‌ చేస్తా’)

గతంలో బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను వేలం పెట్టగా అది 4,25,00 డాలర్లకు అమ్ముడుపోగా ఇప్పుడు దాన్ని వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ బ్రేక్‌ చేసింది. ఈ జాబితాలో వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ తర్వాత స్థానంలో బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ ఉండగా, మూడో స్థానంలో ఎంఎస్‌ ధోని బ్యాట్‌ విలువ ఉంది. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ధోని ఆడిన బ్యాట్‌ను తర్వాత వేలంగా వేయగా దాని విలువ సుమారు కోటి రూపాయిలు పలికింది.వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ను వేలంలో పెట్టిన మరుక్షణమే ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. రెండు గంటల వ్యవధిలో అది 2,75,000 డాలర్లను దాటింది చివరికి ఎంసీ అనే వ్యక్తి దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు నడుంబిగించిన వార్న్‌.. టెస్టు కెరీర్‌ ఆసాంతం ధరించిన బ్యాగీ గ్రీన్‌ టోపీని వేలం వేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలని వార్న్‌ పిలుపునిచ్చాడు.

వార్న్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు సాధించాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్‌(800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement