‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు | Mahendra Singh Dhoni Sues Amrapali Group Over Rs 150 Crore Dues | Sakshi
Sakshi News home page

‘అమ్రపాలి’పై ధోని ఫిర్యాదు

Published Thu, Apr 12 2018 9:56 AM | Last Updated on Fri, Apr 13 2018 5:38 PM

Mahendra Singh Dhoni Sues Amrapali Group Over Rs 150 Crore Dues - Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అమ్రపాలి గ్రూప్‌పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్‌, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదని ధోని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాక పలు నగరాల్లో హౌజింగ్‌ ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేయలేకపోతోంది. కేవలం ధోని మాత్రమే కాక, కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్‌ డుప్లెసిస్‌పై కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. 

బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్‌ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని  అమ్రపాలి గ్రూప్‌కు క్రికెట్‌ స్టార్లను మేనేజ్‌ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ పాండే తెలిపారు. ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ హౌజింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్‌ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్‌లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్‌గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement