స్పిన్‌ను ఆడలేరా.. భారత్‌కు వెళ్లకండి! did not spin .. don't go to india | Sakshi
Sakshi News home page

స్పిన్‌ను ఆడలేరా.. భారత్‌కు వెళ్లకండి!

Published Fri, Feb 3 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

స్పిన్‌ను ఆడలేరా.. భారత్‌కు వెళ్లకండి!

స్పిన్‌ బౌలింగ్‌ ఎలా ఆడాలో త్వరగా నేర్చుకోవాలని... లేకుంటే భారత పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సలహా ఇచ్చాడు. భారత్‌కు వెళ్లి ఆడాలంటే స్పిన్‌ను ఎదుర్కొనేందుకు కఠినంగా ప్రాక్టీస్‌ చేయాల్సిందేనని హెచ్చరించాడు.

బంతి బ్యాట్‌పైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, ముందుకెళ్లి ఆడడం ఏమాత్రం మంచిది కాదని చెప్పాడు. గత 13 ఏళ్ల నుంచి ఉపఖండంలో ఆస్ట్రేలియా కేవలం 3 టెస్టులు మాత్రమే గెలవగలిగింది. ఇందులో రెండు బంగ్లాదేశ్‌పై వచ్చినవే.
 

Advertisement
 
Advertisement
 
Advertisement