బిల్‌గేట్స్‌ టిప్‌ ఫొటో ఫేక్‌ News On Bill Gates Tip To Waiter In Restaurant Is Fake | Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌ టిప్‌ ఫొటో ఫేక్‌

Published Wed, Nov 27 2019 5:57 PM | Last Updated on Wed, Nov 27 2019 7:45 PM

News On Bill Gates Tip To Waiter In Restaurant Is Fake - Sakshi

న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని  తేలింది. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌.. రెస్టారెంట్‌ వెయిటర్‌కు టిప్‌ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్‌కట్టర్‌ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో చాలామంది ఫార్వర్డ్‌ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్‌గేట్స్‌ తండ్రి వుడ్‌కట్టర్‌ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్‌గేట్స్‌ బ్లాగ్‌ 'గేట్స్‌ నోట్స్‌' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్‌. గేట్స్‌ II.. సీటెల్‌ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్‌ స్కూల్‌ టీచర్‌ అని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్‌గేట్స్‌ ఒక రెస్టారెంట్‌కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్‌కు టిప్‌ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్‌ను బిల్‌.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్‌పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్‌ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్‌గేట్స్‌ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్‌ యువర్‌ బెస్ట్‌ టీచర్‌ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్‌ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement