ఏకం చేసేది హిందూత్వమే | Devendra Fadnavis poorer than Aditya Thackeray | Sakshi
Sakshi News home page

ఏకం చేసేది హిందూత్వమే

Published Sat, Oct 5 2019 3:44 AM | Last Updated on Sat, Oct 5 2019 3:44 AM

Devendra Fadnavis poorer than Aditya Thackeray - Sakshi

ముంబై: హిందూత్వ ఎజెం డాయే బీజేపీని, శివసేనను కలిపి ఉంచుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టంచేశారు. రెండు పార్టీల కలయిక విజయం చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శుక్రవారం ముంబైలో ఆయన మాట్లాడారు. మొత్తం 288 సీట్లలో శివసేన 124, ఎన్డీయే మిత్రపక్షాలైన ఆర్పీఐ, ఆర్‌ఎస్పీలు 14, బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. రెబల్‌ అభ్యర్థులను రెండు రోజుల్లోగా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతామని, లేకపోతే వారి స్థానమేంటో వారికే చూపిస్తామని తెలిపారు.  ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌నేత ఖడ్సేకు టికెట్‌ రాకపోగా, ఆయన కుమార్తె రోహిణికి ముక్తయినగర్‌లో సీటు కేటాయించారు. ఖడ్సే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.  

ఆదిత్య భారీ విజయం ఖాయం..
శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య భారీ మెజార్టీతో గెలుస్తారని ఫడ్నవిస్‌ అన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఆదిత్యను సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తులో (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఉండే చోటు) చూడాలనుకుంటున్నారని తెలిపారు. ఆదిత్య రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రెండు పార్టీల్లో పెద్దన్న (ఆధిపత్య పార్టీ) ఏదన్న చర్చలు లేనేలేవని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement