‘స్కామ్‌లతో దేశ ప్రతిష్టకు మచ్చ’ Venkaiah Says Scams will tarnish the image of the country   | Sakshi
Sakshi News home page

‘స్కామ్‌లతో దేశ ప్రతిష్టకు మచ్చ’

Published Mon, Apr 16 2018 7:25 PM | Last Updated on Mon, Apr 16 2018 7:25 PM

Venkaiah Says Scams will tarnish the image of the country   - Sakshi

సాక్షి, షిల్లాంగ్‌ : కుంభకోణాలు దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగులుతాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగు చూసిన బ్యాంకింగ్‌ స్కామ్‌లను ప్రస్తావిస్తూ ఇలాంటి కుంభకోణాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, కార్పొరేట్‌ విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్రాండ్‌ ఇండియా బలోపేతానికి ఎగ్జిక్యూటివ్‌లు పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ఐఐఎం షిల్లాంగ్‌ వార్షిక స్నాతకోత్సవంలో వెంకయ్య పేర్కొన్నారు.

భారత్‌ను బలోపేతం చేసేందుకు కార్పొరేట్‌ ఇండియాను దీటుగా మలిచేందుకు భవిష్యత్‌ బిజినెస్‌ లీడర్లుగా కృషి సాగించాలని ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఆయన పిలుపు ఇచ్చారు. జాతీయ దృక్పథంతో సామాజిక స్పృహతో పనిచేయాలని విద్యార్ధులను కోరారు. భవిష్యత్‌లో వ్యాపారం, ఉద్యోగం ఏది చేపట్టినా ఆర్థిక కోణంతో పాటు మానవతా దృక్పథంతోనూ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement