గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు! South African leader Cyril Ramaphosa may be Chief guest of R-day | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు!

Published Sun, Nov 11 2018 4:56 AM | Last Updated on Sun, Nov 11 2018 4:56 AM

South African leader Cyril Ramaphosa may be Chief guest of R-day - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసను ప్రత్యేక అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా ఖండాల్లోని ఏదైనా ఒక దేశాధినేతను గణతంత్ర వేడుకలకు అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించాలనుకుంటోందనీ, రమఫోస పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంబంధిత ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించినా ఆయన రాలేనని చెప్పడం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement