ప్రపంచ ట్రెండ్గా 'సెల్ఫీ విత్ డాటర్' | SelfieWithDaughter Trends Worldwide After PM Modi's Mann ki Baat | Sakshi
Sakshi News home page

ప్రపంచ ట్రెండ్గా 'సెల్ఫీ విత్ డాటర్'

Published Sun, Jun 28 2015 5:57 PM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

ప్రపంచ ట్రెండ్గా 'సెల్ఫీ విత్ డాటర్' - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా తమ చిన్నారి కూతుర్లను, పెద్దవారైతే వారిని తమ గుండెలకు హత్తుకుని సెల్ఫీలు తీసుకునే పనిలో తండ్రులు పడ్డారు. ఒకటి కాకుంటే మరొకటి అనుకుంటూ వేర్వేరు కోణాల్లో తమ సెల్ ఫోన్లలో బందిస్తున్నారు. ఇదిప్పుడు కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాకుతుండటంతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన దేశాల జాబితాల్లో తాజాగా భారత్ కూడా చేరినట్లయింది. లింగ వివక్షను దూరం చేయాలని, కూతుర్లను కూడా కొడుకులతో సమానంగా చూడాలని బ్రూణ హత్యలు తగ్గించాలనే ఉద్దేశంతో పంజాబ్ లోని సునిల్ జగ్లాన్ అనే ఓ గ్రామ పంచాయతీ పెద్దాయన కూతురితో సెల్లో సెల్ఫీ తీసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అలా ఫొటోలు తీసి పంపించినవారిలో కొన్నింటిని ఎంపిక చేసి బహుమతుల ప్రధానం కూడా పెట్టాడు.

దీంతో అది మెల్లమెల్లగా పాకి అందరు తండ్రులు తమకూతుర్లతో సెల్ఫీలు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మాట్లాడిన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో పంజాబ్ గ్రామపెద్ద చేసిన పనిని కొనియాడిన మరుక్షణం నుంచి అది కాస్త మరింత ఊపందుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ఒక్క భారత్ ప్రజలే కాకుండా విదేశాల్లోని వారు ఫాలో అవుతుండటంతో మోదీ పిలుపునందుకు ఇప్పుడు అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడిలాంటివారు కూడా దీనికి ఆకర్షితులై తమ కూతుర్లతో కెమెరాల్లో సెల్ఫీలు క్లిక్ మనిపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement