అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే! newyork times wrongly posts digvijay singh photo with amrita rai | Sakshi
Sakshi News home page

అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే!

Published Thu, Jul 2 2015 2:43 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే! - Sakshi

కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయండి.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ను ఇరకాటంలో పెట్టింది. ఏడు పదుల వయసుకు దగ్గరలో పడిన డిగ్గీరాజా.. ఇటీవలే నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సరిగ్గా వాటినే చూసిన అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తప్పులో కాలేసింది. ఆమెను మన డిగ్గీ రాజాకు కూతురు అనుకుని, వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలోకి చేర్చేసింది.

ఈ విషయాన్ని ఒకరు కనిపెట్టేసి.. దాన్ని ట్వీట్ చేశారు. డిగ్గీరాజా ఈ కాన్సెప్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, సెల్ఫీ విత్ డాటర్ అన్నారు తప్ప కూతురి వయసున్న గర్ల్ఫ్రెండ్తో సెల్ఫీ కాదని అన్నారు. చాలామంది తండ్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఇలా తమ కూతుళ్లతో సెల్ఫీలు తీసుకున్నారనే కథనంలో మరికొన్ని ఇతర ఫొటోలతో కలిపి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిగ్గీ రాజా ఫొటోను కూడా ప్రచురించేసింది. అయితే దీనిపై అటు దిగ్విజయ్ సింగ్ నుంచి గానీ, అమృతా రాయ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement