ఆ బాల నేరస్తుడిని ఇప్పుడే వదలరట! | Juvenile in Delhi Gang-Rape Case Won't Be 'Released': Sources | Sakshi
Sakshi News home page

ఆ బాల నేరస్తుడిని ఇప్పుడే వదలరట!

Published Thu, Dec 3 2015 9:14 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

Juvenile in Delhi Gang-Rape Case Won't Be 'Released': Sources

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్(నిర్భయ) ఘటనకు సంబంధించిన బాల నేరస్తుడిని ఇప్పుడే విడుదల చేయడం లేదని సమాచారం. అతడిని ఒక ఏడాదిపాటు ఓ స్వచ్ఛంద సంస్థ కస్టడీలో ఉంచనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.అతడి విడుదలపట్ల ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వెలిచుచ్చడంతోపాటు భిన్న వర్గాల నుంచి కూడా ప్రతికూల స్పందన వస్తుంది. ఓ రకంగా చాలామంది ఈ విషయానికి సంబంధించి ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపధ్యంలో అతడిన జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది తమ పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. తమ కూతురుపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిపింది ఆ నేరస్తుడేనని కోర్టు కూడా పేర్కొందని, అలాంటివాడిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖకు, కోర్టులకు, మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. 'ఇది సామాన్యంగా ఆలోచించాల్సిన విషయం కాదు.. పోలీసులు సరిగా పనిచేయాల్సిన సమయం' అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

నేరస్తులకు హక్కులు ఉండవని వారు పేర్కొన్నారు. అతడి వల్ల సమాజానికి మా కుటుంబంలాగే అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో అతడిని మరో ఏడాదిపాటు అక్కడే పోలీసుల సమక్షంలో ఉంచనున్నట్లు తెలిసింది. 2012 డిసెంబర్ నెలలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై ఆరుగురు వ్యక్తులు పాశవిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె చనిపోయింది. ఆ సమయంలో ఈ బాలనేరస్తుడికి 18 ఏళ్ల లోపు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 21.

Advertisement
 
Advertisement
 
Advertisement