చోక్సీని వెనక్కు పంపండి: భారత్‌ | India requests Antigua and Barbuda govt to not allow Mehul Choksi | Sakshi
Sakshi News home page

చోక్సీని వెనక్కు పంపండి: భారత్‌

Published Mon, Aug 6 2018 5:38 AM | Last Updated on Mon, Aug 6 2018 5:38 AM

India requests Antigua and Barbuda govt to not allow Mehul Choksi - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్లకు మోసగించి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మెహుల్‌ చోక్సీని వెనక్కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని భారత్‌ అభ్యర్థించింది. చోక్సీని  తిరిగి తీసుకొచ్చే విషయమై ఆంటిగ్వా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత్‌ నుంచి ఓ బృందం కొన్ని రోజుల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత బృందం ఆంటిగ్వా విదేశాంగ శాఖను శనివారం కలిసి, చోక్సీని భారత్‌కు తిప్పి పంపాలని అభ్యర్థించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని బంధువైన చోక్సీ కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.12 వేల కోట్ల మేర మోసగించి దేశం నుంచి పారిపోవడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement