జానకమ్మ క్షేమంగా ఉన్నారు Singer S Janaki Is Safe Says SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

జానకమ్మ క్షేమంగా ఉన్నారు

Published Tue, Jun 30 2020 12:31 AM | Last Updated on Tue, Jun 30 2020 12:31 AM

Singer S Janaki Is Safe Says SP Balasubrahmanyam - Sakshi

‘ప్రముఖ గాయని ఎస్‌. జానకి లేరు’ అనే వార్త సోషల్‌ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఎవరో సోషల్‌ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్‌సెన్స్‌. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా  ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్‌ మీడియాను పాజిటివ్‌ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్‌ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్‌ మీడియాని వాడొద్దు. ‘లాంగ్‌ లివ్‌ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్‌గా ఉన్నారు’. జెంటిల్‌మెన్‌ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్‌మెన్‌ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement