ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్‌ బాబు | Mahesh Babu Wishes To His Mother Indira Devi On Her Birthday | Sakshi
Sakshi News home page

తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌

Published Mon, Apr 20 2020 11:06 AM | Last Updated on Mon, Apr 20 2020 12:09 PM

Mahesh Babu Wishes To His Mother Indira Devi On Her Birthday - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్‌ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తల్లితో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘ఏప్రిల్‌ 20. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అమ్మ పుట్టినరోజు. హ్యపీ బర్త్‌డే అమ్మ’’ అంటూ తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా ఇందిర.. నటుడు కృష్ణ మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. (సందీప్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి)

కాగా మహేష్‌ సోదరి మంజులా కూడా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తన వ్యక్తిత్వంలాగే అమ్మ ఎ‍ప్పుడూ నవ్వుతూ ఉంటుంది. మా ప్రతి రోజును గొప్పగా తీర్చిదిద్దుతుంది. తన మంచితనం, అప్యాయత, ప్రేమ మా హృదయాలను తాకుతుంది. మా కుటుంబానికిక వెన్నుముక తను. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాం’ అంటూ మంజులా ట్వీట్‌ చేశారు.

కాగా మహేష్‌ తల్లి ఇందిర బయట కనిపించడం చాలా అరుదు. ఇందిర కృష్ణకు మేన మరదలు. 1961లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు. అయితే కొంత కాలానికి కృష్ణ.. విజయ నిర్మలను వివాహం చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిరాను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక )

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement