మాస్‌ మెచ్చేలా ఫైట్స్‌ dare movie released this friday | Sakshi
Sakshi News home page

మాస్‌ మెచ్చేలా ఫైట్స్‌

Published Thu, Nov 16 2017 3:18 AM | Last Updated on Thu, Nov 16 2017 3:18 AM

dare movie released this friday - Sakshi

నవీన్, పల్లవి జంటగా కె. కృష్ణప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేర్‌’. యన్‌. కరణ్‌రెడ్డి సమర్పణలో యన్‌. రామారావు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యన్‌. కరణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు చాలా ఉన్నాయి. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. నవీన్‌ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. తను చేసిన ఫైట్స్‌ మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతాయి. జి.ఆర్‌. నరేన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలకు బాగా చేరువయ్యాయి. మా సినిమా తప్పకుండా ప్రేక్షలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్, నిర్మాణం: యన్‌. వరలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement