Prabhas Birthday Special: Interesting Facts about Baahubali Star | ప్రభాస్‌ బర్త్‌ డే, ఆసక్తికరమైన విశేషాలు - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ బర్త్‌ డే: ఆసక్తికరమైన విశేషాలు

Published Wed, Oct 23 2019 12:28 PM | Last Updated on Wed, Oct 23 2019 5:12 PM

Baahubali Prabhas Happy Birthday Special - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్‌ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్‌. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలతో ప్రభాస్‌ కెరీర్‌ ఎవరెస్ట్‌ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్‌.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్‌ టాక్‌ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్‌ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్‌ నిరాశపరిచినా.. ప్యాన్‌ ఇండియా స్టార్‌గా డార్లింగ్‌ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్‌ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్‌ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్‌ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు మీకోసం.

  • ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న.
  • ప్రభాస్‌ దేశవ్యాప్తంగా టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్‌ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్‌ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్‌ అయ్యేలా ప్రభాస్‌ భారీ సినిమాలకు ప్లాన్‌ చేస్తున్నాడు.
  • 2017లో జీక్యూ మ్యాగజీన్‌ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్‌ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్‌ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది.
  • ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్‌ ఎప్పుడు మ్యారెజ్‌ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్‌ అనుష్కను ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్‌.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్‌ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్‌ సరదాగా వ్యాఖ్యానించారు.
  • దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం  ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్‌ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు.

  • ప్రభాస్‌ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.
  • ప్రభాస్‌కు వాలీబాల్‌ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఇచ్చారు.
  • చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్‌' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్‌లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్‌ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్‌ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్‌ ప్రచారంలో ఉంది.

హృతిక్‌ను ఢీకొంటాడా?

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘వార్‌’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఉంది. ఈ సినిమా సీక్వెల్‌లో హృతిక్‌ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్‌ ష్రాఫ్‌ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్‌ మీడియా వర్గాలు కూడా ప్రభాస్‌ పేరును ‘వార్‌-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్‌ ఉండటంతో ‘వార్‌-2’లో హృతిక్‌, ప్రభాస్‌ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
 
Advertisement
 
Advertisement