సిద్ధార్థ్‌ ట్విట్టర్‌ హ్యాక్‌.. పక్కా ప్లానింగ్‌ Actor Siddharth Twitter Hack Drama | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 9 2017 3:17 PM | Last Updated on Sat, Aug 25 2018 6:49 PM

Actor Siddharth Twitter Hack Drama - Sakshi

సాక్షి, సినిమా : నటుడు సిద్ధార్థ్‌ ట్విట్టర్‌ శుక్రవారం ఉదయం హ్యాక్‌ కి గురైంది. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే వెల్లడించాడు. ఆరు నిమిషాలపాటు తన అకౌంట్‌ హ్యాక్‌కి గురైందని.. సైబర్‌ క్రైమ్‌కి ఫిర్యాదు చేయటంతో వారు తన అకౌంట్‌ను మళ్లీ పునరుద్ధరించారని తెలిపాడు. అయితే దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం కాసేపటికే అందరికీ అర్థమైపోయింది. 

సిద్ధార్థ్‌ ట్విట్టర్‌లో ఈరోజు ఉదయం ఓ పోస్టు దర్శనమిచ్చింది. తమిజ్‌ పదమ్‌ 2.0 అనే ఓ చిత్రం మే 25న విడుదల అవుతుందని ప్రకటించిన‌.. ఆ మరుసటి రోజు తమిళ్‌ రాకర్స్‌ లో ఆ చిత్రం పైరసీ ఉంటుందన్న సందేశం ఉంది. అయితే కాసేపటికే సిద్దూ తన అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని.. హ్యాకర్లు చేసిన ట్వీట్‌తో తనకు సంబంధం లేదని సందేశం ఉంచాడు. దీంతో కంగారు పడిన ఆ చిత్ర దర్శకుడు సీఎస్‌ అముధన్‌ ఈ పని ఎలా చేశారంటూ సిద్ధార్థ్‌ను, చిత్ర నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్‌ ను నిలదీశాడు. కానీ, ఈ పోస్టుతో తనకు సంబంధం లేదని సిద్ధార్థ్‌ బుకాయించాడు. 

చివరకు ఇదంతా ఫ్లానింగ్‌ ప్రకారం ఆ చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్‌ అని తర్వాత తేలింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ కథనానికి స్పందించిన సిద్ధూ.. అది తన చిత్రం కాదని.. ఓ బిగ్‌ స్టార్‌ నటించిన సినిమా అని.. ఓ లెజెండ్‌ దర్శకుడు డైరెక్ట్‌ చేశాడని పరోక్షంగా 2.O చిత్రాన్ని ఉద్దేశిస్తూ వెటకారపు రీట్వీట్‌ చేశాడు. శివ, ఇషా మీనన్‌ జంటగా నటిస్తున్న తమిజ్‌ పదమ్‌ 2.0(తమిజ్‌ పదమ్‌ 2) చిత్రం బడాస్టార్ల సినిమాలపై స్ఫూఫ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అందుకే ఇలా కన్ఫ్యూజన్‌ కి గురి చేసే ప్రమోషన్‌తో చిత్ర యూనిట్‌ ముందుకు రాగా, దానికి హీరో సిద్ధార్థ్‌ తన వంతు సాయం అందించాడన్న మాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement