ఆడియన్స్‌ మైండ్‌ సెట్‌ మారింది | Aadhi Pinisetty at Neevevaro Film Interview | Sakshi
Sakshi News home page

ఆడియన్స్‌ మైండ్‌ సెట్‌ మారింది

Published Fri, Aug 24 2018 12:26 AM | Last Updated on Sun, Jul 14 2019 1:28 PM

Aadhi Pinisetty at Neevevaro Film Interview - Sakshi

‘‘ఒక క్యారెక్టర్‌ని నేను కంప్లీట్‌గా నమ్మి, ఆ కథ నాకు నచ్చి, ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది అని నేను ఫీలైనప్పుడే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. నన్ను నేను జడ్జ్‌ చేసుకోను. మంచి పెర్ఫార్మర్‌ అని ఆడియన్స్‌ నుంచి పేరు తెచ్చుకోవడమే నా మెయిన్‌ గోల్‌’’ అన్నారు ఆది పినిశెట్టి. హరినాథ్‌ దర్శకత్వంలో cటి, తాప్సీ, రితికా సింగ్‌ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘నీవెవరో’. ‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌.. నాట్‌ ది లవర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆది చెప్పిన విశేషాలు...

► ఇందులో కల్యాణ్‌ పాత్ర చేశాను. ‘వెన్నెల’ పాత్రలో తాప్సీ, అను పాత్రలో రితికా కనిపిస్తారు. నా క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయా? ‘లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌.. నాట్‌ ది లవర్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఎందుకు పెట్టాం? అనే విషయాలకు థియేటర్స్‌లో సమాధానం దొరకుతుంది. ‘అదే కన్‌గళ్‌’ తమిళ సినిమా రీమేక్‌ రైట్స్‌ తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేశాం.

► బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హోమ్‌వర్క్‌ చేశాను. బ్లైండ్‌ స్కూల్స్‌కి వెళ్లాను. అక్కడి స్టూడెంట్స్‌ రియాక్షన్స్, ఎమోషన్స్‌ గమనించాను. ఇలాంటి క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూనే కన్విన్స్‌ చేయగలగడం కష్టం. రిఫరెన్స్‌ కోసం కొన్ని సినిమాలు కూడా చుశాను.

► నేను ‘సరైనోడు’లో వైరం ధనుష్‌గా, ‘నిన్ను కోరి’ సినిమాలో అరుణ్‌గా, ‘రంగస్థలం’లో కుమార్‌బాబుగా చేసినప్పుడు సినిమాలు తగ్గడంతోనే క్యారెక్టర్స్‌ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలు ఆడగానే మళ్లీ హీరోగా చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఇది ఇష్యూనే కాదు నాకు. ఈ సినిమా హిట్‌ అయినా కూడా మంచి క్యారెక్టర్‌ వస్తే తప్పుకుండా చేస్తాను. అప్పుడే యాక్టర్‌గా నాకు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించే అవకాశం వస్తుంది. హీరోగానే చేయాలి అని ఫిక్స్‌ అయితే  మంచి మంచి క్యారెక్టర్స్‌ మిస్‌ అయ్యేవాణ్ణి. వైరం ధనుష్‌ తర్వాత విలన్‌ క్యారెక్టర్స్‌ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్‌ వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు.

► ఇప్పుడున్న ఆడియన్స్‌ మైండ్‌ సెట్‌ మారింది. అది ఎవరి సినిమా? ఏ సినిమా? అనే విషయాలు వారికి అక్కర్లేదు. బాగుందా? లేదా? బాగుంది అంటే ఓపెనింగ్స్‌ ఉంటాయి. థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతాయి. బాగోలేదు అంటే ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్‌ యాక్ట్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు.

► నా యాక్టింగ్‌ గురించి నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) హ్యాపీ. ఎన్ని సినిమాలు సైన్‌ చేశావ్‌? అని నాన్నగారు అడగరు. ఎన్ని మంచి కథలు విన్నావ్‌ అని అడుగుతారు. అన్నయ్య (సత్య ప్రభాస్‌) డైరెక్షన్‌లో నా సినిమా ఉంటుంది. కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను. తమిళంలో ‘ఆర్స్‌100’ రీమేక్‌ చేయబోతున్నాం. డైరెక్టర్‌ని, హీరోయిన్‌ని ఇంకా ఫైనలైజ్‌ చేయలేదు. అలాగే బైక్‌ రేసింగ్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో హేమంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కార్తీక్‌ నిర్మిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement