మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఇరుక్కుపోయిన తల | YouTube pranksters head fixeup in microwave | Sakshi
Sakshi News home page

మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఇరుక్కుపోయిన తల

Published Fri, Dec 8 2017 10:03 PM | Last Updated on Fri, Dec 8 2017 10:03 PM

 YouTube pranksters head fixeup in microwave - Sakshi

లండన్‌: ప్రాంక్‌.. అంటే తెలిసిందే. సరదాగా ఇతరులను ఆటపట్టించేందుకు చేసే పని. దానిని వీడియో తీసి, యూట్యూబ్‌లో పెడతారు. వీటిని ఫన్నీ ప్రాంక్స్‌ అని పిలుస్తారు. ఇలాంటివి చేసేవారిని ప్రాంక్స్‌టర్‌ అంటారు. బ్రిటన్‌కు చెందిన వోల్వర్‌హ్యాంప్టన్‌కు కూడా ఇలాంటి ప్రాంక్స్‌ చేయడం సరదా. ఈ సరదా పనే.. అతణ్ని చావు దగ్గరిదాకా తీసుకెళ్లి వెనక్కు పంపింది. ఇంతకీ మన హీరో ఏం చేశాడంటే... తన తలను ఓ ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి, మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టాడు. ఆ తర్వాత మైక్రోవేవ్‌ ఓవెన్‌ నిండా పాలిఫిల్లా(రకరకాల ఆకారాలు తయారుచేసేందుకు ఉపయోగించే సిమెంట్‌ లాంటి పదార్థం)ను నింపారు. ఆ తర్వాత తల తీసేస్తే తన ముఖాన్ని తయారు చేయడానికి ఓ అచ్చు తయారవుతుందని భావించాడు. అనుకున్నట్లుగా అంతా బాగానే జరిగినా పాలిఫిల్లా పోసిన తర్వాత తల ఎంతకీ బయటకు రాలేదు. ఇక లోపల ఊపిరి ఆడక మన ప్రాంక్‌స్టర్‌ అల్లాడిపోయాడు. కాసేపటికే చలనం లేకపోయేసరికి చచ్చిపోయాడని కూడా అనుకున్నారు. అయితే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి, దాదాపు గంటన్నరపాటు శ్రమించి, మైక్రోవేవ్‌ ఓవెన్‌ను కట్‌ చేసి, పాలిఫిల్లాను పగులగొట్టి, తలను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి, చికిత్స చేయడంతో ప్రాంక్‌స్టర్‌ కాస్తా ప్రాణాలతో బయటపడ్డాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement