జైల్లోనే నీరవ్‌ మోదీ | UK court rejects Nirav Modi's bail plea for fifth time | Sakshi
Sakshi News home page

జైల్లోనే నీరవ్‌ మోదీ

Published Fri, Mar 6 2020 3:33 AM | Last Updated on Fri, Mar 6 2020 4:43 AM

UK court rejects Nirav Modi's bail plea for fifth time - Sakshi

లండన్‌/ముంబై:  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు కుచ్చుటోపీ, మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను యూకే కోర్టు గురువారం అయిదోసారి తిరస్కరించింది. గతేడాది మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నీరవ్‌ నైరుతీ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నాడు.   బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కి బాకీ ఉన్న పన్నుల వసూలుకు గాను ఆ సంస్థ వజ్రాల వ్యాపారి, పీఎన్‌బీ స్కాంలో నిందితుడి  నీరవ్‌ మోదీకి చెందిన 3 ఆస్తులను అటాచ్‌ చేసింది. నీరవ్‌ బీఎంసీకి రూ. 9.5 కోట్ల పన్ను చెల్లించాలని, ఇందుకుగాను అతని  4 ఆస్తుల్లో మూడింటిని అటాచ్‌ చేసినట్లు బీఎంసీ   తెలిపింది.  రుణాల ఎగవేతదారు నీరవ్‌ మోదీ ఆస్తులను వేలం వేయగా రూ. 51 కోట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు వచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. వేలం వేసిన వస్తువుల్లో రోల్స్‌ రాయిస్‌ కారు, పలు ప్రముఖ చిత్రలేఖనాలు, డిజైనర్‌ బ్యాగు సహా మొత్తం 40 వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement