తైవాన్లో భూకంపం Shaking felt in Taipei as 5.6-magnitude quake hits | Sakshi
Sakshi News home page

తైవాన్లో భూకంపం

Published Thu, May 12 2016 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

Shaking felt in Taipei as 5.6-magnitude quake hits

తైపీ: తైవాన్ ఈశాన్య తీరం ప్రాంతంలో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు పేర్కొంది. తైవాన్ రాజధాని తైపీకి 60 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని తెలిపింది.

అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఇంత వరకు సమాచారం అందలేదని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్లో భూకంపం సంభవించి అపార్ట్మెంట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 117 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement