1870 తరువాత ఇదే అత్యంత దారుణమైన మాంద్యం |  Global economy to shrink 5.2 Pc worst recession since WWI :World Bank | Sakshi
Sakshi News home page

1870 తరువాత ఇదే అత్యంత దారుణమైన మాంద్యం

Published Tue, Jun 9 2020 3:25 PM | Last Updated on Tue, Jun 9 2020 5:28 PM

 Global economy to shrink 5.2 Pc worst recession since WWI :World Bank - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది.  లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్  సోమవారం తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగాఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. తద్వారా ఇది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ)

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ సోమవారం విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు.  ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని  1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ తెలిపారు. మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై  అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు. 60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్పాస్ పిలుపునిచ్చారు.  అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. ఈ మాంద్యంలో  వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు)

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. 1870 నుండి14  ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది (భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రతికూలం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement