ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు | Spain as a guest nation | Sakshi
Sakshi News home page

ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు

Published Thu, Jan 25 2018 3:02 AM | Last Updated on Thu, Jan 25 2018 3:02 AM

Spain as a guest nation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సాహిత్యోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం నుంచి 3 రోజులపాటు బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజులపాటు 5 వేదికలపైన ఆరు ప్లీనరీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. తొలిరోజు ఉదయం ‘కన్నడ సాహిత్యం అప్పుడు– ఇప్పుడు’ అనే అంశంపై ప్రముఖ రచయిత్రి ప్రతి భానందకుమార్‌ ప్రధాన ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం ‘లైఫ్‌ ఇన్‌ ఏ డ్యాన్స్‌’పై ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌మాన్‌సింగ్‌ మాట్లాడుతారు. 27న ‘సిటిజన్‌’ ఎడిటర్, సీనియర్‌ జర్నలిస్టు సీమా ముస్తఫా ‘బీయింగ్‌ ఏ సెక్యులర్‌ ముస్లిం ఇన్‌ ఇండియా’పై ప్రసంగించనున్నారు. బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కూతురు సంజనా కపూర్‌ నాటక రంగం, థియేటర్‌ ఆర్ట్‌ తదితర అంశాలపై తన అనుభవాలను వివరిస్తారు. 28న ‘మీడియా టుడే’ పై సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మాట్లాడతారు. సాయంత్రం జరిగే ప్లీనరీలో సమా చార హక్కు చట్టం కార్యకర్త అరుణారాయ్‌ ప్రసం గించనున్నారు. వీటితోపాటు విభిన్న సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలు, కళలపై మరో 30కిపైగా సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రతి బింబించే కళారూపాలనూ ప్రదర్శించనున్నారు.

ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి  ఏటా నగరంలో సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నా రు. ఈసారి స్పెయిన్‌ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసర వల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్‌’, ‘ద్వీప’, శశికపూర్‌ ‘షేక్సిపీరియానా’, ‘టామాల్టన్‌’ సినిమాలు ప్రదర్శిస్తారు. వంట చేస్తూ చెప్పే ఉ.సరస్వతి రామాయణం కథ, ‘నన్న నుక్కడ్‌’ (చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్‌ దక్కనీ హాస్య కవితాసమ్మేళనం, ‘బాంబే బైరాగ్‌’, వికలాంగుడైన కళాకారుడు బందే నవాజ్‌ నదీఫ్‌ ఫుట్‌ అండ్‌ మౌత్‌ పెయింటింగ్, తెలంగాణ విమెన్‌ రిసోర్స్‌ సెంటర్‌ మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ముస్తాబవుతున్న వేదికలు
పబ్లిక్‌ స్కూల్‌లోని ‘తెలంగాణ టూరిజం పెవిలియర్‌’ వేదికపై 6 ప్లీనరీలు, కార్వే క్యానోసీ, టాటా, గోథె గ్యాలరీల్లో పలు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలకు స్పెయిన్‌ అతిథిగా హాజరుకానుంది. సాహిత్యోత్సవాలకు ఆ దేశ మేధావులు, రచయితలు, కళాకారులు, అమె రికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్‌ ప్రతినిధులు తరలిరానున్నారు. ఉత్సవాలకు ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌ కంబారా హాజరుకానున్నారు. బెంగ ళూర్‌లో ప్రఖ్యాత రంగశంకర్‌ థియేటర్‌ నిర్మాత అరుంధతి నాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త ఉ.సరస్వతి, దివంగత పాత్రికేయు రాలు గౌరీ లంకేష్‌ స్నేహితురాలు, ఆర్టిస్టు పుష్పమేలా పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్‌ దిగ్గజం శశికపూర్, మరో నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌లను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement