నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు | in 4 days southwest monsoon onset to telangana | Sakshi
Sakshi News home page

నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు

Published Tue, Jun 14 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు

సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాలు కేరళను తాకాక తెలంగాణకు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడానికి 15-20 రోజుల సమయం కూడా పడుతుందని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ఇటీవల ‘సాక్షి’కి వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే 4 రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో 5 సెం.మీ, సదాశివనగర్, కామారెడ్డిలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు సోమవారం రామగుండంలో అత్యధికంగా 40.6, హన్మకొండలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement