ఎన్ని ఘనకార్యాలో...! | Sriramana Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఎన్ని ఘనకార్యాలో...!

Published Sat, Apr 20 2019 1:19 AM | Last Updated on Sat, Apr 20 2019 1:19 AM

Sriramana Article On Chandrababu Naidu - Sakshi

పెళ్లి కార్యక్రమం నిరాటంకంగా ముగు స్తుంది. ఎప్పట్నించో పెళ్లి ఆరాటంలో నలి గిపోతున్న మనసు కుదుట పడుతుంది. చివరి ఘట్టాలు ముగి శాక పెళ్లి పెద్దలు హాయిగా కొయ్య దుంగల్లా పడి నిద్రపోతారు. ‘సదశ్యం తీరినట్టు పడుకున్నారు’ అనేది సామె తలా వచ్చింది. నిజానికి ఎన్నికల మహాఘట్టం ముగిశాక చంద్రబాబు ఆ తీరున గుర్రుపెట్టి నిద్రించాలి. పోలింగ్‌ తర్వాత బాబులో అలజడి పెరిగింది. అదే పలు అనుమానాలకి దారి తీసింది. జారిపోతున్న ధైర్యాన్ని ఎగలాగి, గెలుపు మాదేనంటూ స్పీచ్‌లో ఓ వాక్యం కలిపారు. నేని ప్పుడు ఆరాట పడుతోంది నా గురించి, నా రాష్ట్రం గురించి కాదు. టోటల్‌గా నా దేశ ప్రజల గురించి వర్రీ అవుతున్నాను.

అప్రజాస్వామిక ధోరణులు పెచ్చు పెరు గుతున్న ఈ మోదీ కబంద హస్తాల నించి భారతమాత ముద్దుబిడ్డల్ని, సవతి సంతతిని ఎలా రక్షించాలని ఆవేదన పడుతున్నానని మైకులు పగుల గొడుతున్నారు. బుద్ధుడికి బోధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు చంద్ర బాబుకి ‘సన్‌రైజ్‌ సమయంలో’ బాత్‌రూంలో స్వస్వరూప జ్ఞానం విచ్చుకుంది. ఎనిమిది చక్రాలు, నాలుగు హాండిల్సు, నాలుగు సీట్లు, రెండు చెయిన్లు, రెండు జతల పెడల్సు, ఒకే ఒక స్టాండు కలిగి పసుప్పచ్చ కాంతిలో సైకిల్‌ విశ్వరూప దర్శనం అయింది. అట్లా ఎక్స్‌ట్రా భాగాలతో కన్పించేసరికి అదొక పీడకలగా తోచింది.

ఎందుకు చంద్రబాబు హాయిగా విశ్రమిం చక ఇట్లా పరిపరి విధాల వ్యాకులపడుతున్నారు? మా వూళ్లో ఒక వృద్ధ మాత చంద్రబాబు మనోస్థితిని పసిగట్టింది. చాలా ఫీల్‌ అయింది. బాబు ఇప్పుడు చేయాల్సింది ప్రసంగాలు కాదు. తన వారిని వెంటేసుకుని రాష్ట్ర పర్యటన చెయ్యాలి. ఇన్నేళ్లలో తను చేసిన ఘన కార్యాలను కళ్లారా చూసి తరించవచ్చు. బెజవాడ చుట్టుప క్కల కృష్ణానదిలో ఇసుక లేకుండా తను, తన వారు నిశ్శబ్దంగా జుర్రేయడం చూసుకోవచ్చు. కనకదుర్గమ్మకి అందుబాటులో వచ్చి ఆగిపో యిన ఫ్లైఓవర్‌ని కనులారా వీక్షించవచ్చు. క్యాపి టల్‌ తాలూకు సౌధాల బొమ్మరిళ్లతో తన వారంతా కలిసి కాసేపు ఆడుకోవచ్చు. అమరా వతి పరిసరాలలో బాబు రూపొందించిన విశ్వ విఖ్యాత టూరిస్ట్‌ స్పాట్స్‌లో తనివితీరా సెల్ఫీలు దిగవచ్చు. సింగపూర్‌ స్థాయి జెయింట్‌ వీల్‌లో చంద్రబాబు పరివారమంతా ఒక రౌండ్‌ తిరగ వచ్చు. ఇంకా ఉద్యానవనాలలో సేదతీరచ్చు. ఫౌంటెయిన్‌ల నీడలో జలకాలాడవచ్చు. ఇలా చెబుతూ ఆ పెద్దావిడ అలిసిపోయింది. ఒక్క నిమిషం విశ్రమించి, అప్పుడు ఎన్నికల ముందు తొంభై శాతం ఓటర్ల సంతృప్తి సాధించాలని బాబు చెప్పేవారు. ఒక దశలో 65 శాతం, 72 శాతం, 81 శాతం, 85 దాకా వచ్చిందని ప్రక టించారు కూడా. ‘సంతృప్తి’ అనే మానసిక స్థితిని తూకం వేసిన చంద్రబాబు, ఇప్పుడు జనంలోకి వెళ్లి తాజాగా తూకాలు వేసి ఇంతకీ ఆయన సంతృప్తి లెవెల్‌ తేల్చుకోవడం ముఖ్యం.

ఆడపడుచులకు అన్నగారిచ్చిన కానుకలు, వాటి తాలూకు ప్రతిస్పందనలు బేరీజు వేసుకుని మురిసి పోవచ్చు. ఆయన హయాంలో విద్యా ర్హతలు హెచ్చుగా ఉన్న యువకులు ఎందరు తగిన ఉద్యోగాలు పొందారో విని, చూసి ముచ్చ టపడవచ్చు. ఎన్నికల ముందు ఆవూ–దూడని (అది ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ గుర్తు) చంద్రన్న కానుకలుగా పెరళ్లలో కట్టేసి ప్రచారం చేశారు. వాటికి లేత పచ్చికలు మేతలు వేసి, సంతృప్తి మేరకు హీనపక్షం 90 శాతం కుడుతులు పట్టి బాబు రిలాక్స్‌ అవచ్చు– అంటూ వృద్ధమాత ఏక రువు పెడుతుంటే ఓ యువకుడు విలాసంగా నవ్వాడు. 

‘అవ్వా! అది ఒకటే ఆవు, ఒకే దూడ. టీవీలో యథాశక్తి నటించాయ్‌. అంతే! ఆవు మనకి వినిపించిన ‘అంబా’ అరుపు దానిది కాదుట. డబ్బింగ్‌ చెప్పించారట.’ పెద్దావిడ బోసి నోటితో ‘హవ్వ.. హవ్వ’ అంటూ నవ్వింది.

 శ్రీరమణ , ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement