ఫన్ అండ్ ట్రెండ్ | fun and trend | Sakshi
Sakshi News home page

ఫన్ అండ్ ట్రెండ్

Published Sun, Mar 22 2015 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

ఫన్ అండ్ ట్రెండ్

సన్‌డే... వారానికోసారి వచ్చిపోయేదేగా అని లేజీగా ఇంటికే లాకయ్యి... బోర్‌గా ఫీలయ్యేవారికి కాస్తంత ఫన్... ఇంకాస్త ట్యాలెంట్‌ను మిక్స్ చేసి పర్‌ఫెక్ట్ ప్యాకేజీని అందించింది బంజారాహిల్స్ లామకాన్. మొబైల్ ఫోన్లు చేతిలోకొచ్చాక... డిజిటల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాక... ‘క్లిక్’లు అందరూ కొడుతున్నారు. కానీ... అవి ప్రత్యేకంగా... కళాత్మకంగా ఉండాలంటే..! ఆ క్లిక్ ట్రిక్స్‌ను వంటబట్టించుకున్నారు అమెచ్యూర్స్. పేపరంటే చదువుకొనే వస్తువే కాదని... దాంతో క్రియేటివ్ ఆబెక్ట్స్ ఎన్నో చేయవచ్చని తెలుసుకున్నారు బుడతలు.
 
 
‘క్లిక్’ ఆన్
 ‘చేతిలో కెమెరా ఉంటే ఎవరైనా ఫొటోలు తీసేస్తారు. కానీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే అంతకు మించి ఆలోచించాలి. ఆపై దాన్ని ఆచరణలో పెట్టాలి’ అంటున్నారు ప్రొఫెషనల్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ మను బైద్వాన్. ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే యువత కోసం ఆయన ‘బేసిక్స్ ఆఫ్ ఇమేజ్ ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్’ వర్క్‌షాప్ నిర్వహించారు. ‘ఫొటోగ్రఫీలో మూడు స్టేజీలుంటాయి. ప్రీ ప్రాసెసింగ్, ఫొటోగ్రఫీ, పోస్ట్ ప్రాసెసింగ్. ముందుగా తీయాలనుకున్న ఫొటో ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయించుకోవాలి. ఇది ప్రీ ప్రాసెసింగ్.

మనమేం తీయాలనుకున్నామో ఇమాజిన్ చేసుకున్నాక దాన్ని ఏ మాత్రం తేడా లేకుండా కెమెరాలో బంధించడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే సగం సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్‌లో ఇమేజ్‌ను మరింత అందంగా చూపించేందుకు కలర్, బ్రైట్‌నెస్, ఎఫెక్ట్స్ వంటివి వాడతాం. ఫొటోగ్రఫీలో కూడా వీక్లీ, సీజనల్, ైనె ట్ క్లిక్ లాంటి చాయిస్‌లు ఉంటాయి. అప్‌కమింగ్ ఫొటోగ్రాఫర్స్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి.  ఒక్కసారి ఫోకస్ అలవాటు అయ్యాక ల్యాండ్‌స్కేప్, ైవె ల్డ్, ఫ్యాషన్, ప్రొడక్ట్ బే స్డ్, ఆటోమొబైల్ ఫొటోగ్రఫీల్లో ఏదో ఒకదానిపై దృష్టి పెడితే కీర్తితో పాటు కెరియర్‌కు ఎటువంటి ఢోకా ఉండదు’ అని చెప్పారు మను.
 
 నయా ఆర్కిటెక్ట్
 ‘ఖాళీగా పేపర్ దొరికితే ఏం చేస్తారు? మహా ఐతే ఏదో ఒకటి రాస్తాం లేదంటే పడేస్తాం అంటారా... కానీ నాకిచ్చి చూడండి దాంతో జెట్, ట్యాంకర్, కారు, గన్, స్నేక్, స్కూల్ బ్యాగ్‌తో సహా ఇంకా ఎన్నో చేసి చూపిస్తా’ అంటున్నాడు పదకొండేళ్ల సాయిఆదర్శ్. తనతోటి పిల్లలకు కూడా ఆ విద్యను నేర్పిస్తూ పేరును సార్థకం చేసుకుంటున్నాడు. కాగితాలతో రకరకాల వస్తువులను తయారు చేయడం ఒక కళ. దీన్నే ‘ఆరిగామీ’ అంటారు. ‘కార్టూన్స్ బాగా ఇష్టం. టీవీలో కార్టూన్ షోస్ చూసినప్పుడు నాకు అలాంటి బొమ్మలే చేయాలనిపించేది. సో... ఆరిగామీ నేర్చుకున్నా.

బైక్ నుంచి జెట్, షిప్స్ వరకు ఏదైనా ఇట్టే తయారు చేయగ లను. స్కూల్‌కు వెళ్లను. ఇంట్లోనే చదువుకుంటున్నా’... అంటున్న ఆదర్శ్ లామకాన్‌లో తనలాంటి చిన్నారులకెందరికో ఈ ఆర్ట్‌లో మెళకువలు నేర్పాడు. కార్పొరేట్ కల్చర్ జాడ్యంలో తన కుమారుడు చాలాసార్లు ఒత్తిడికి లోనవ్వడం తనను బాధించిందని, అందుకే వాడిని స్కూలు మాన్పించి... ఇంట్లోనే చదివిస్తున్నానని చెప్పారు ఆదర్శ్ తండ్రి యుగంధర్. వాడి ట్యాలెంట్‌ను అందరికీ పరిచయం చెయ్యాలన్నదే తన కోరికన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement