ఈ వారం యూట్యూబ్ హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Aug 2 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఫాంటమ్ : ట్రైలర్
నిడివి : 2 ని. 41 సె.
హిట్స్ : 26,59,944

 బజ్‌రంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ మళ్లీ ఇంకో సినిమాను తెరపైకి తెస్తున్నారు! 26/11 బాంబు పేలుళ్ల కథాంశంతో కబీర్ తీసిన ‘ఫాంటమ్’ ఈ నెల 28 న విడుదల కాబోతోంది. సయీఫ్ అలీఖాన్, కత్రీనా కైఫ్ నటించిన ఈ చిత్రం ట్రైలర్... ఎంతో ఉత్కంఠభరితంగా, సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థీమ్ ఒకటే కాబట్టి...  హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జీరో డార్క్ థర్టీ’ (2012) కి, ‘ఫాంటమ్’కీ మధ్య కొన్ని పోలికలు కనిపించవచ్చు.
 
బ్లాక్ మాస్ : ట్రైలర్
నిడివి : 2 ని. 31 సె.
హిట్స్ : 20,23,216

అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్.బి.ఐ.కి, 1970ల నాటి ఆ దేశపు  నేరగాడు వైటీ బల్జర్‌కు మధ్య సాగిన ‘అపవిత్ర’ బంధాన్ని కథాంశంగా తీసుకుని స్కాట్ కూపర్ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బ్లాక్ మాస్’పై ఇది మూడో ట్రైలర్. హాలీవుడ్ చిత్రాలలో తరచు తలపై పక్షితో కనిపించే జానీ డిప్ ఇందులో వైటీ బట్జర్ పాత్రను పోషిస్తున్నారు. (బహుశా మొదటిసారిగా తలపై పక్షి లేకుండా). సినిమా విడుదల సెప్టెంబర్ 18.
 
బజ్‌రంగి భాయ్‌జాన్ డైరీస్ : హర్షాలీ
నిడివి : 3 ని. 18 సె.
హిట్స్ : 12,69,633

సెట్స్‌లో ఉన్నప్పుడు బజరంగీ భాయ్‌జాన్ లోని ఆరేళ్ల చిన్నారి హర్షాలీ రకరకాలుగా ప్రవర్తించేది. సాటి పిల్లలతో ఎలా ఉండేదో
 స్టార్‌లతో అలా ఉండేది. ఓసారైతే దర్శకుడు ధ్యాన ముద్రలో ఉండి సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్లి ఆయన జుట్టు పట్టుకుని లాగింది! ఇంకోసారి అనెక్స్‌పెక్టెడ్‌గా ఆయనకు ఓ ముద్దు కూడా ఇచ్చింది. ఇలాంటి బిహైండ్ ద సీన్స్ అన్నిటినీ కలిపి కూర్చిన వీడియో ఇది.  
 
స్ప్లిట్‌విల్లా సీజన్
8 ఎపిసోడ్ 6
నిడివి : 44 ని 13 సె.
హిట్స్ : 10,66,361

ఈ... ప్రేమ, లాలసల క్రీడ... స్ల్పిట్‌విల్లాలో మెలికలు, మలుపులు   కొనసాగుతూనే ఉన్నాయి. సుబుహీ అనే అమ్మాయి ‘క్వీన్’గా ఎంపికయింది. ఇక చెప్పేదేముంది? అబ్బాయిలకు ప్రేమ గండం. తర్వాత ఎంపిక కావలసింది ‘కింగ్’. ‘థార్న్ అండ్ రోజెస్’ అనే వినూత్నమైన పోటీతో అతడిని ఎన్నుకోవడాన్ని ఈ వీడియోలో మనం వీక్షించవచ్చు. ఎం.టి.వి.లో వస్తున్న ఇండియన్ రియాలిటీ షోనే స్ల్పిట్ విల్లా. అమెరికన్ డేటింగ్ షో ‘ఫ్లేవర్ ఆఫ్ లవ్ ’ ప్రేరణతో రూపొందిన ఈ షో.. ప్రస్తుతం 8వ సీజన్‌లో ఉంది. అందులోని 6వ ఎపిసోడ్ ఇది.
 
హౌ టు ‘క్రికెట్’ :
ఎ.ఐ.బి. అండ్ జెస్ రైన్
నిడివి : 4 ని. 8 సె.
హిట్స్ : 4,06,9
82
క్రికెట్ ఆడడం ఎలా అనే టాపిక్‌తో సరదాగా తయారైన వీడియో ఇది. భారతదేశంలో పేరు మోసిన వివాదాల కామెడీ గ్రూపు అ ఐఛీజ్చీ ఆ్చజుఛిూూూ (అఐఆ), టొరంటో లోని యూ ట్యూబ్ గ్రూపు ‘జెస్ రైన్’ కలిసి క్రియేట్ చేసిన ఈ వ్యంగ్య దృశ్యమాలిక అందర్నీ ఆకట్టుకుంటోంది. నవ్వు తెప్పించే ముఖాలతో ఉన్న ఎనభైల నాటి క్రికెట్ ఆటగాళ్లు కొందరు ఇందులో క్రికెట్‌లోని బేసిక్స్, స్కిల్స్ చెబుతుంటారు. మచ్చుకి: క్రికెట్‌లో 11 మంది ప్లేయర్సే ఎందుకు ఉంటారు? అనే ప్రశ్నకు వారి జవాబు: ‘పన్నెండో ప్లేయర్ చచ్చిపోయాడు కనుక’.
 
బ్రదర్స్ యాంథమ్
నిడివి : 2 ని. 22 సె.
హిట్స్ : 3,09,057

బ్రదర్స్ చిత్రంలోని సంఘీభావ గేయం ఇది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ మల్హోత్రా తమ కండర విన్యాసాలను, వ్యాయామాలను ప్రదర్శిస్తుండగా నేపథ్య గేయంగా వినిపిస్తుంటుంది. గానం విశాల్ దడ్లానీ. సంగీతాన్ని సమకూర్చింది 2012 నాటి అగ్నిపథ్ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘చిక్నీ చమేలీ’కి సంగీతాన్నిచ్చిన జంట అజయ్, అతుల్. ‘తేరి బారి హై కమర్ కస్ లె / తేరె బస్ మే హై సారే మస్లే / తేరె టూటె హు దిల్‌కి జమీనొ పే / హిమ్మత్ కి ఉగా లె ఫస్‌లీ..’ వంటి స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో ఈ గేయం యూత్‌ని ఉరకలెత్తిస్తోంది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement