చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం | Eye Diseases in Children With Smartphones | Sakshi
Sakshi News home page

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

Published Thu, Jul 11 2019 12:43 PM | Last Updated on Thu, Jul 11 2019 12:43 PM

Eye Diseases in Children With Smartphones - Sakshi

చిన్నపిల్లలు మెుబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే కంటి జబ్బులు తప్పట్లేదు.  కాయగూరలు, పండ్లు తినడం ద్వారా శరీరానికి స్వాభావికంగా కంటి జబ్బుల నుంచి దూరం చేసే శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జామ కంటికి ఎంతో సహాయపడుతుంది. దీంతోపాటు నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే దృష్టి లోపాలను నివారించవచ్చు. అందుకే పిల్లలు తీసుకునే ఆహారంలో బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు వంటివి చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు ఇలా రకరకాలుగా తిండి పెట్టడం వలన మీరు వారి కంటి జబ్బులను దూరం చేయవచ్చు. ఈ కూరగాయలు, పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్క కంటి సమస్యలే కాదు... అనేక ర కాల సమస్యలకు ఆహారంతోనే చెక్‌ పెట్టవచ్చు. వీటితోపాటు రోజూ ఒక స్పూను తాజా వెన్నను తినిపించడం ద్వారా కూడా కంటిజబ్బులను నివారించవచ్చు. సీజన్‌లో లభించే పండ్లను తినడం పిల్లలకే కాదు, పెద్దల కంటికి కూడా మంచిదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement