'పేద విద్యార్థుల ముంగిటకు పెద్ద చదువులు' | YS vijayamma municipal elections campaign in velugodu | Sakshi
Sakshi News home page

'పేద విద్యార్థుల ముంగిటకు పెద్ద చదువులు'

Published Sat, Mar 22 2014 2:23 PM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

'పేద విద్యార్థుల ముంగిటకు పెద్ద చదువులు' - Sakshi

కర్నూలు : మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం కర్నూలు జిల్లా వెలుగోడులో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రైతులు, విద్యార్థుల గురించి చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘటన వైఎస్ఆర్దేనని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందేలా చేశారని విజయమ్మ పేర్కొన్నారు. మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి.. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న జనం ఆమెను చూసేందుకు దారి పొడవునా బారులు తీరారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement