పోలింగ్ సిబ్బందికి నో ‘టీఏ’ | No 'TA' to polling staff | Sakshi
Sakshi News home page

పోలింగ్ సిబ్బందికి నో ‘టీఏ’

Published Thu, May 1 2014 3:19 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

No 'TA' to polling staff

 మోర్తాడ్, న్యూస్‌లైన్ :  జిల్లాలో బుధవారం నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో విధులు నిర్వహించిన తమకు డీఏ మాత్రం చెల్లించి టీఏను ఎగ్గొట్టారని ఉద్యోగులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడం, దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల రవాణా చార్జీలు తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లాలో తొమ్మిది శాసన సభ నియోజకవర్గాల్లో 2,057 పోలింగ్ కేంద్రాలు ఉండగా 18,885 మంది ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులకు 1400 చెల్లించారు. ప్రిసైడింగ్ అధికారులు రెండు మార్లు శిక్షణకు హాజరయ్యారు.  రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు కలిపి 1400 చెల్లిం చారు.

 నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని గ్రామాలలో ఓటు హక్కు ఉండటం, ఉద్యో గం నిర్వహించిన వారికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బాధ్యతలను అప్పగించారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విధులను అప్పగించారు. అనేక మంది ఉద్యోగులు శిక్షణ, పోలింగ్ విధులకు రవాణా చార్జీల కోసం 400కు పైగా ఖర్చు చేశారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కూడా రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులు నిర్వహించినందుకు రోజుకు 250 చొప్పున వెయ్యి చెల్లించారు. పోలింగ్ క్లర్క్‌లకు ఒక రోజు శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు హాజరైనందుకు రోజుకు 250 చొప్పున 750 చెల్లించారు.

 వీటితో పాటు ప్రతి ఉద్యోగికి కనీసం 300 నుంచి 400 రవాణా చార్జీలను చెల్లించాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా టీఏ చెల్లించాలని ఆదేశించిందని ఉద్యోగులు చెబుతున్నారు. దూర ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి రవాణా చార్జీలు చెల్లించక పోవడం సరికాదన్నారు.  అధికారులు మాత్రం ఎన్నికల శిక్షణకు, పోలింగ్ విధులకు హాజరైన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ట్లు  చెబుతున్నారు. దీంతో  రవాణా చార్జీలను చెల్లిం చలేమంటున్నారు. ఇప్పుడు చెల్లించిన సొమ్ము నుంచి రవాణా చార్జీలు భరించుకోవాలని  సూచిస్తున్నారు. రవాణా చార్జీలు విధిగా చెల్లించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అధికారులు టీఏ, డీఏ చెల్లించడంలో సరైన నిబంధనలను పాటించలేదని అ ధికారులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని పోలింగ్ సిబ్బందికి టీఏ ప్రత్యేకంగా చెల్లిం చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement