గ్రామాలభివృద్ధికి కృషి | try for develoment of villages | Sakshi
Sakshi News home page

గ్రామాలభివృద్ధికి కృషి

Published Thu, Aug 11 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

గ్రామాలభివృద్ధికి కృషి

చిలుకూరు:  గ్రామాలాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి అన్నారు. బుధవారం చిలుకూరులో తన నిధులు నుంచి రూ. 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రాధాన్యత ప్రకారం  పనులు చేస్తామన్నారు.  అనంతరం పార్టీ సీనియర్‌ నాయకుడు కొల్లు స్వామి ఇంట్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.  అంతకు ముందు  రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, మాజీ ఎంపీపీలు దొడ్డా నారాయణరావు, కొండా అన్నపూర్ణ, సర్పంచ్‌ సుల్తాన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్‌ యాదవ్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాగా శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ప్రోటోకాల్‌ పాటించకుండా తనను అవమానపరిచిందని  స్థానిక ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పిలిచి తాను రాకముందుకే శంకుస్థాపన చేశారన్నారు. తాను బీసీ ఎంపీపీననే ఉద్దేశంతో కావలని అవమానపరిచిందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement