'హైదరాబాద్ మినీ ఇండియా' | hyderabad is a mini india: home minister naini narsimha reddy | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ మినీ ఇండియా'

Published Sun, Aug 30 2015 7:54 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

'హైదరాబాద్ మినీ ఇండియా' - Sakshi

రాజేంద్రనగర్(హైదరాబాద్): హైదరాబాద్ మిని భారత దేశం అని ఇక్కడి ప్రాంత ప్రజలు అందరిని తమలో కలుపుకోని ఒకే కుటుంబం వలే జీవిస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఆదివారం బండ్లగూడ గ్రామ మధు పార్కు రైడ్జ్‌లో మంచినీటి పైపులైన్ ప్రారంభోత్సవాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉందన్నారు.

ఎక్కడ లేని విధంగా ఇక్కడి వాతావరణం ప్రజల ఆప్యాయతతో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖః సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభ్యుతం సహకరిస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇచ్చి నీటిని అందించేందుకు కృషి చేస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ పధకాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంసృ్కతిక కార్యక్రమాలు విశేషంగా అకట్టుకున్నాయి. పాల్గొన్న అందరికి బహుమతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement