మళ్లీ ఉత్కంఠ | 144 section divis area | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉత్కంఠ

Published Thu, Feb 23 2017 12:17 AM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM

మళ్లీ ఉత్కంఠ - Sakshi

దివీస్‌ బాధిత గ్రామాల్లో ఈ నెల 28 వరకూ 144 సెక్షన్‌ అమలు
నేడు భూముల్లోకి వెళ్లేందుకు రైతుల సన్నద్ధం 
సీపీఎం ఆధ్వర్యంలో రెఢీ
పోలీసుల మోహరింపు...
తొండంగి: కోన తీరంలో దివీస్‌ లేబరేటరీస్‌కు ప్రభుత్వం కేటాయించిన రైతుల భూముల్లోకి బాధిత గ్రామాల ప్రజలు వెళ్లేందుకు గురువారం ప్రయత్నించనున్న నేపథ్యంలో తీరప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేయడంతోపాటు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివీస్‌కు ప్రభుత్వం దానవాయిపేట, కోదాడ గ్రామల పంచాయతీల పరిధిలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 671 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి విదితమే. సుమారు పది నెలల నుంచి రైతులు దివీస్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు మద్దతు పలకడంతో పలు దఫాలుగా ఉద్యమంలో భాగంగా రోడ్‌షోలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల్లోనూ, హైకోర్టు స్టేటస్కో ఇచ్చిన భూముల్లోనూ దివీస్‌ యాజమాన్యం ప్రహరీ గోడ, ఇతర నిర్మాణాలను చేపట్టడం ప్రారంభించింది. దివీస్‌ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బాధిత గ్రామాల రైతులు రెవెన్యూ, పోలీసు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులపాటు దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే, విచారణలు చేపట్టి ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని ప్రకటించడంతో  ప్రభుత్వాధికారుల తీరుపై ఆ ప్రాంత ప్రజలు మరింత మండిపడుతున్నారు. దీంతో బాధిత గ్రామాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం తమ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకునేందుకు సన్నద్ధమవడంతో ప్రభుత్వం భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఎనిమిది రోజులపాటు 144 సెక్షన్‌...
కోన ప్రాంతంలో రైతులు దివీస్‌ ప్రతిపాదిత ప్రాంతంలో తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్న నేపధ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా తీరప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు  ఒంటిమామిడి పోలీస్‌స్టేన్‌ హెచ్‌సీ మాణిక్యం తెలిపారు. బాధిత గ్రామాల్లోనూ, బీచ్‌రోడ్డులోనూ సుమారు 300 మంది 
 

Advertisement
 
Advertisement
 
Advertisement