పూలేను ఆదర్శంగా తీసుకోవాలి | 126th Death Anniversary of Mahatma Jyotirao Phule | Sakshi
Sakshi News home page

పూలేను ఆదర్శంగా తీసుకోవాలి

Published Tue, Nov 29 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

126th Death Anniversary of Mahatma Jyotirao Phule

హాలియా :  సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమసమాజ స్థాపనకు, నిరక్ష్యరాస్యత, మూఢాచారాల నిర్మూలన, సాంఘీక దురాచారాలు తదితర అంశాల్లో ప్రజలను చైతన్యవంతంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. 
 
 ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాజి వెంకటేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, చెరుపల్లి ముత్యాలు, గౌని రాజారమేష్ యాదవ్, అనుముల ఏడుకొండల్, మాకమళ్ల జంగయ్య, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, పొదిల శ్రీనివాస్, సత్యం, కిలారి కృష్ణ, కూరాకుల రవి, నసీర్, అన్వర్, పోశం శ్రీనివాస్ గౌడ్, రావుల వెంకటేశం గౌడ్, నామని సుధాకర్, చెరుపల్లి వెంకటేశ్వర్లు, మోటముర్రి సురేందర్ పాల్గొన్నారు. 
 
 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో..
 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం హాలియా బీసీ సంక్షేమ వసతి గృహంలో జ్యోతిబాపూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల రాంబాబు, సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురభి రాంబాబు, సూర్యనారాయణ, వసతి గృహ అధికారి వెంకటేశ్వర్లు, ఎడారి నరేష్, నారందాసు అంజయ్య, నాగిళ్ల నరేందర్, నంద్యాల ప్రవీణ్, దివాకర్, సైదులు వసతి గృహ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు. 
 
 చల్మారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో..
 మండలంలోని చల్మారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జ్యోతిబా పూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కరుముల వెంకట్మ్రణారెడ్డి, ఉపాధ్యాయులు చీదళ్ల శ్రీనివాస్‌లు, అరవింద్‌కుమార్, సైదుల్‌రావ్ గౌతమ్, లిల్లీథెరిస్సా, సత్తయ్య, సునీత, సుధాకర్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.  
 
 మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో..
 సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో ఎంఈఎఫ్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు యడవల్లి సోమశేఖర్, మామిడి శంకర్, మందా గౌతమ్, చింత వెంకటేశ్వర్లు, వర్కాల శ్రీనివాసరెడ్డి, పాల నాగేందర్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, బాబొద్దీన్ పాల్గొన్నారు. 
 
 గుర్రంపూడ్ : మండలంలని కొప్పోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జ్యోతిరావ్ పూలే వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ పోలా సరోజినమ్మ పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. సమసమాజ సాప్థనకు, పూలే ఆశయాలకు సాధనకు కృషి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట యాదయ్య, నర్ర రవి తదితరులున్నారు.  
 
 పెద్దవూర : యువత జ్యోతిరావు పూలే అశయాలకు అనుగుణంగా నడుచుకుని ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పూలే వర్థంతినిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వస్తపురి మల్లిక, నాయకులు పులిమాల కృష్ణారావు, కర్ణ బ్రహ్మారెడ్డి, హైమద్‌అలీ, వస్తపురి నర్సింహ, వెంకటేశ్వర్లు, దేవయ్య, పరమేష్, సులోచన, వెంకటయ్య, కొండయ్య, నడ్డి లక్ష్మయ్య, శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement