పగబట్టిన ప్రేమ; సాఫ్ట్‌వేర్‌ యువతికి..! | Young Man Was Molested By A Young Girl In Bangalore | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ యువతిపై హైటెక్‌ తరహా వేధింపులు

Published Mon, Jun 1 2020 8:25 AM | Last Updated on Mon, Jun 1 2020 12:38 PM

Young Man Was Molested By A Young Girl In Bangalore - Sakshi

సాక్షి, కర్ణాటక:  ప్రేమను తిరస్కరించిన యువతికి హైటెక్‌ తరహాలో వేధింపులకు పాల్పడిన ఓ టెక్కీ ఎట్టకేలకు చిక్కాడు. పరిహార  కుటుంబ సలహా కేంద్రం సమాలోచనతో కేసు సుఖాంతమైంది. ఉత్తరభారతదేశానికి చెందిన 24 ఏళ్ల యువతి నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీగా పనిచేస్తూ వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటోంది. నెలక్రితం స్కైప్‌ ద్వారా గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చా యి. సదరు వ్యక్తి అశ్లీలంగా మాట్లాడాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాధ్యం కాలేదు. ప్రతిరోజు ఇదే విధంగా కాల్స్‌ వస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ఇతరుల సాయంతో కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబ సలహా కేంద్రం సిబ్బంది సైబర్‌ పోలీసులసహకారం  తీసుకున్నా సదరు నిందితుడి ఆచూకీ లభించలేదు.  

మీకు శత్రువులు, బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారా ?
కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్‌ డాక్టర్‌ బింద్య సదరు బాధితురాలితో మీకు ఎవరైనా కానివారు, బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారా అంటూ ప్రశ్నించింది. అలాంటి వారు ఎవరూ లేరని ఆమె సమాధానమిచ్చింది. రెండు రోజుల తరువాత ఫోన్‌ చేసి ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో క్లాస్‌మెట్‌ తనను ప్రేమిస్తున్నట్లు వేధింపులకు పాల్పడినట్లు గుర్తు చేసింది.  

ప్రేమ తిరస్కరించిందని.. : కళాశాలలో చదువుతున్న సమయంలో తన ప్రేమను తిరస్కరించిందని క్లాస్‌మెట్‌ అయిన యువకుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు. రెండేళ్ల తరువాత ఆమె గురించి ఆరా తీసి ఫోన్‌ చేయ డం ప్రారంభించాడు. యువతి ఫిర్యాదు మేరకు కుటుంబ సలహా కేంద్రం అధికారులు వివిధ మార్గాల్లో సదరు వ్యక్తి గురించి ఆరా తీయగా అతను ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా యువతి క్లాస్‌మెట్‌గా గుర్తించారు.

కుటుంబ సలహా కేంద్రం అధికారులు సదరు యువకుడికి ఫోన్‌ చేసి విచారణ చేయగా మొదట తనకు సంబంధం లేదని చెప్పినా చివరకు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి యువతి ఆశ్చర్యపోయింది. అనంతరం ఇద్దరిని కలపడంతో సదరు వ్యక్తి యువతికి క్షమాపణ చెప్పడంతో బాధితురాలు కేసు ఉపసంహరించుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా కుటుంబ సలహా కేంద్రం ఇన్‌చార్జ్‌ రాణి శెట్టి మాట్లాడుతూ... సైబర్‌ క్రైం పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, మేనెలలో 433 ఫిర్యాదులు అందగా అందులో 25 కేసులు ఇంటర్నెట్‌ ద్వారా వేధింపుల కేసులేనని చెప్పారు. 

చదవండి: నలుగురూ స్నేహితులు.. ఒకే గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement